ప్రతిరోజూ ఉదయం ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అస్సలు గొడవలే రావు..!
గొడవలే జరగని రిలేషన్ షిప్ అంటూ ఏదీ ఉండదు. కానీ ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు, కారణం లేకుండా వాధించుకోవడం వల్ల ఆ రిలేషన్ షిప్ బ్రేకప్ వరకు వెళుతుంది. అయితే భార్యాభర్తలు ప్రతిరోజూ ఉదయం పూట ఈ పనులు చేస్తే కారణాలు లేకుండా గొడవలే జరగవు. అంతేకాదు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు.
ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కొంతమంది జంటల లైఫ్ సాఫీగా సాగితే.. మరికొంతమంది జంటల మధ్య ఎన్నో మనస్పర్థలు, విభేధాలొస్తాయి. ఇది కాస్త విడాకుల వరకు వెళుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే భార్యాభర్తలు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తే చాలు మీ లైఫ్ ఎంతో సంతోషంగా సాగుతుంది. మనస్పర్థలు అసలు రానే రావు. అంతేకాదు అవి మీ బంధాన్ని బలపరుస్తాయంటున్నారు నిపుణులు. ఇది మీ ఇద్దరి మధ్యన ప్రేమను, నమ్మకాన్ని, బంధాన్ని పెంచుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మాట్లాడుకోవడం
మీరెంత బిజీగా ఉన్నా సరే భార్యాభర్తలు రోజులో కొద్దిసేపైనా మాట్లాడుకోవాలి. సగం కోట్లాటలు మాటలు లేకపోవడం వల్లే వస్తాయి తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య దూరం ఉండదు. అందుకే టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుకోండి. జోక్స్ పంచుకోండి.
కలిసి బ్రేక్ ఫాస్ట్ తినడం
ప్రతిరోజూ భార్యాభర్తలు కలిసి ఉదయం టీ తాగడం, బ్రేక్ ఫాస్ట్ ను తినడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఇద్దరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో మీరు ఎన్నో విషయాలను కూడా మాట్లాడుకుంటారు. అయితే ఈ సమయంలో మీకు సంతోషాన్ని కలిగించే విషయాలనే మాట్లాడుకోవాలి. ఇది ఇద్దరి మూడ్ ను కూడా మెరుగుపరుస్తుంది. మీరు మీ భాగస్వామితో ఎంత ఎక్కువసేపు మానసికంగా కనెక్ట్ అవుతారో.. మీరు ఒకరినొకరు అంత బాగా అర్థం చేసుకుంటారు.
మాట్లాడుకోవడం
మీరెంత బిజీగా ఉన్నా సరే భార్యాభర్తలు రోజులో కొద్దిసేపైనా మాట్లాడుకోవాలి. సగం కోట్లాటలు మాటలు లేకపోవడం వల్లే వస్తాయి తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య దూరం ఉండదు. అందుకే టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుకోండి. జోక్స్ పంచుకోండి.
రొమాన్స్
భార్యాభర్తల మధ్య రొమాన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే దగ్గరగా ఉండటం, కౌగిలించుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం వంటివి చేయాలి. ఇవి మీ ప్రేమను పెంచుతుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న పనులు మీలో హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో మీ రిలేషన్ షిప్ బోరింగా అనిపించదు.
ఇలా చెప్పండి
మీరు మార్నింగ్ నిద్రలేవగానే మీ భాగస్వామిని ఖచ్చితంగా పలకరించండి. అంటే గుడ్ మార్నింగ్ ను కూడా చెప్పొచ్చు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు "భాయ్" అని కూడా చెప్పొచ్చుచ. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త లాంటివి చెప్పండి. ఇది మీ వైవాహిక సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది.
థ్యాంక్స్ చెప్పండి
మీ జీవితంలోని ప్రతి విషయంలో మీకు అండగా నిలిచేది జీవిత భాగస్వామే. అందుకే వారు ఏ చిన్న సాయం చేసినా ఎప్పటికప్పుడు వారికి థ్యాంక్స్ ను చెప్తూనే ఉండండి. మీ నుంచి వారే ఏది ఆశించినా, మీరు చెబితే వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతిదానికీ వారికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల వారి పట్ల ఎంతో కేరింగ్ గా ఉన్నారని వారికి అర్థమవుతుంది.