Relationship: అన్యోన్య దాంపత్యం కోసం పాటించవలసిన సూత్రాలు.. ఇంతకు అవేంటంటే?
Relationship: సంసారం చక్కగా సాగాలంటే భార్యాభర్తల ఇద్దరి పాత్ర సమానంగా ఉండాలి. చక్కనైన సంసారం కోసం భార్య ఈ చిట్కాలు పాటిస్తే నిజంగానే మీది అన్యోన్య దాంపత్యం అవుతుంది. ఆ చిట్కాలేంటో చూడండి.
భార్యాభర్తలు పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు సంతోషంగా ఉన్నా కాలం గడుస్తున్న కొద్ది ఒకరి మీద ఒకరికి చిన్న చిన్న గొడవలు రావడం, కోపాలు తెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల దూరం పెరుగుతూ వస్తుంది. అలాగే ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరిగితే మాత్రం ఆ అనుమానాలు తీరడం అనేవి చాలా కష్టమైపోతాయి.
ఒకసారి ఒకరి మీద అనుమానం వస్తే అది ఎన్నటికీ పోదు. అందులోని భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్లు. అనవసరంగా తప్పులు చేసి ఒకరి దృష్టిలో చెడు అవడం మంచిది కాదు. అది ఇద్దరి మధ్య బంధాన్ని దూరం చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు భర్త ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు భార్య ఇంట్లో ఒక్కతే ఉంటుంది.
అలాంటి సమయంలో భార్య తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంది. దీనివల్ల భర్తకు అనుమానం వచ్చి దానిపైన గొడవలు రావడం మొదలవుతాయి. అందుకే ఈ లేనిపోని సమస్యలన్నీ లేకుండా ఉండడానికి భర్త ఇంట్లో లేనప్పుడు భార్య చేయకూడని మూడు పనులు ఏంటో తెలుసుకుందాం.
మొదటిది భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఎక్కువగా ఎవరితోని ఫోన్స్ మాట్లాడకూడదు అలాగే అనవసరమైన చాటింగ్లు కూడా చేయకూడదు. ఎక్కువగా ఫోన్లో ఉండడం వల్ల అనుమానాలు రావచ్చు. రెండవది భర్త లేని సమయంలో భర్తకు తెలియకుండా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అలాగే సినిమాలకు, పార్టీలకు వెళ్ళకూడదు.
చెప్పకుండా బయటికి వెళ్లినందుకు భార్య మీద భర్తకు అనుమానాకు వచ్చి గొడవలు మొదలవుతాయి. ఇంట్లో భర్త లేనప్పుడు స్నేహితులని ఇంటికి రానివ్వకూడదు. ముఖ్యంగా మగ స్నేహితులని అస్సలు రానివ్వకూడదు. తెలిసో తెలియకో భార్యలు ఈ తప్పులు చేస్తే ఇంక భర్తలకి వాళ్ల మీద అనుమానాలు పెరుగుతాయి.
చివరకు అది గొడవకే దారితీస్తుంది. కనుక ఈ గొడవలన్నీ ఉండకూడదు అంటే భార్య ఈ మూడు పనులు చేయకూడదు. అప్పుడే దంపతులు ఏ గొడవలు లేకుండా సుఖమైన జీవితాన్ని కొనసాగించగలరు. ఇప్పటికైనా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి.