Relationship: సహజీవనం చేస్తున్నారా.. అయితే అవగాహన పెంచుకోవాల్సిందే?
Relationship: నేటి రోజుల్లో సహజీవనం సాధారణం అయిపోయింది. అయితే సహజీవనం గురించి మంచి చెడ్డలు చాలామందికి తెలియదు. అలాంటి వాళ్లకి అవగాహన కోసం ఈ వ్యాసం.
ఈమధ్య ఎక్కడ చూసినా లివింగ్ రిలేషన్షిప్ చాలా పాపులర్ అవుతుంది. ముందు అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ లో ఇది ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. అక్కడ వాళ్లకి ఇది కామనే అయ్యుండొచ్చు కానీ మన భారతదేశంలో దీన్ని ఎక్కువగా ఇష్టపడేవారు కాదు.
కానీ కాలం మారుతున్న కొద్ది ప్రజలు ఇప్పుడు దీనికి కూడా అలవాటు పడుతున్నారు. సహజీవనం అంటే పెళ్లికి ముందే ఇద్దరు భాగస్వాములు కలిసి బ్రతకడం. ముందు దీని తప్పుగా చూశారు. కానీ ఈ మధ్య కొన్ని కొన్ని ప్రాంతాలలో కోర్టు కూడా దీన్ని లీగల్ గానే అప్రూవ్ చేసింది. అయితే ఇందులో కూడా కొన్ని లాభనష్టాలు ఉన్నాయి.
లాభం ఏమిటంటే పెళ్లి చేసుకుని రెండు మూడు నెలలు తరువాత ఒకరిని ఒకరు పూర్తిగా తెలుసుకొని విడాకులకు అప్లై చేస్తున్నారు. దీనికన్నా ఒకరి గురించి ఒకరు ముందే తెలుసుకొని కొన్ని నెలలు సహజీవనం చేసి అప్పటికి అంతా సరైనది అయితే అప్పుడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు.
అలాగే ఒకరినొకరు అలవాటు చేసుకోవడానికి కూడా సహజీవనం ఉపయోగపడుతుంది.వాళ్లకున్న ఇన్ సెక్యూరిటీస్ అన్ని పోయి ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం వచ్చి జీవితాంతం ఉండగలము అనే ధైర్యం వస్తే అప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ లివింగ్ రిలేషన్ షిప్ లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ఎలాగా సహజీవనం జరుగుతున్నది కదా అని చెప్పి కొన్ని రోజులకి ఒకరి మీద ఒకరికి బోర్ కొట్టేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ ఆఫీసులో, లేకపోతే వాళ్లు పని చేస్తూనే దగ్గర ఇంకెవరైనా నచ్చడం లాంటివి జరుగుతాయి. ఇది తెలిసి భాగస్వామికి కోపం రావడం ఇలాగ గొడవలుకు కూడా కారణం అవుతుంది. పొజిసివినెస్ లాంటివి పెరిగిపోయి మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగిపోతుంది.
ఎలాగా కోర్టు దీన్ని లీగల్ చేసింది కనుక ఎవరితో అయినా తిరగవచ్చు అనే ఒక ధీమా కూడా వచ్చేస్తుంది. అందుకే లివింగ్ రిలేషన్షిప్ కొన్ని అంశాల మీద మంచిదే అయినా మిగిలిన కొన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తుంది అన్నదాంట్లో సందేహం లేదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.