MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • పిల్లల కోసం ఐవీఎఫ్ ప్రాసెస్ కోసం వెళ్తున్నారా..? ముందు స్కోర్ తెలుసుకోండి..!

పిల్లల కోసం ఐవీఎఫ్ ప్రాసెస్ కోసం వెళ్తున్నారా..? ముందు స్కోర్ తెలుసుకోండి..!

ఎలాంటి ప్రికార్షన్స్ తీసుకోకుండా.... సంవత్సరంపాటు.. సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా.. సంతానం కలగకపోతే.. వారిలో.. వంధత్వ సమస్య ఉన్నట్లు అర్థంచేసుకోవచ్చట.

3 Min read
ramya Sridhar
Published : Nov 30 2021, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


ఈ మధ్యకాలంలో.. సంతాన సమస్యలు ఎదర్కొన్నవారు చాలా మంది ఉన్నారు.. వంధ్యత్వం కూడా.. దంపతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఒక్కటిగా మారిపోయింది. శారీరక శ్రమ, వ్యసనాలు, ఒత్తిడి స్థాయిలు, వివిధ ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం లాంటి కారణాల వల్ల.. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు.

213

చాలా మంది దంపతులకు సంతాన సాఫల్యత అనేది జీవితంలో ముఖ్యమైన భాగమని ...వారిలో వంధ్యత్వమే అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య అని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇక సాధారణంగా తమకు పిల్లలు కలగరు అనుకున్న దంపతులు.. ఐవీఎఫ్ పద్దతిని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో  ముందుగా.. దంపతులు తమ ఫెర్టిలిటీ స్కోర్ ని తెలుసుకోవాలట. అదెలాగో ఓసారి చూద్దాం..
 

313
fertility

fertility

ఎలాంటి ప్రికార్షన్స్ తీసుకోకుండా.... సంవత్సరంపాటు.. సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా.. సంతానం కలగకపోతే.. వారిలో.. వంధత్వ సమస్య ఉన్నట్లు అర్థంచేసుకోవచ్చట.

413


"అండాశయాల వైఫల్యం, ఋతు చక్రం సమస్యలు, పునరుత్పత్తి వ్యవస్థ నిర్మాణ సమస్యలు, అంటువ్యాధులు, గుడ్డు పరిపక్వత లోపాలు, ఇంప్లాంటేషన్ వైఫల్యం, ఎండోమెట్రియోసిస్, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ప్రైమరీ ఓవరీ ఇన్సఫిసియెన్సీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి అనేక స్త్రీ , పురుష కారకాలు వంధ్యత్వాన్ని వివరించగలవని బలమైన ఆధారాలు సూచిస్తున్నాయి.  గర్భాశయ ఫైబ్రాయిడ్లు. అండోత్సర్గము వైఫల్యం స్త్రీ వంధ్యత్వానికి , వృద్ధాప్యానికి ప్రధాన కారణం, ఇది అండాశయ నిల్వలను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 

513

ముందుగా.. పురుషుల్లో అయితే.. వీర్య కణాల సంఖ్య ఎలా ఉంది..? వీర్యం నాణ్యత ఎలా ఉంది అనే  చెక్ చేస్తారు.  ఇక స్త్రీలలో అయితే.. అండాలు సరైన సమయానికే విడుదల అవుతున్నాయా.. లేదా..? విడుదలైన అండాలు సరైన పరిమాణంలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు.

613

ధూమపానం, బాడీ మాస్ ఇండెక్స్, ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. సంతానోత్పత్తిని ప్రభావం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే చాలు.. ముందుగా.. కెఫిన్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
 

713

వయస్సు, వివాహ వ్యవధి, జీవనశైలి , సంతానోత్పత్తిపై పర్యావరణ కారకాలు , సహాయక పునరుత్పత్తి చికిత్స (ART) లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే, .. జంట సంతానోత్పత్తికి ఈ కారకాల సహకారాన్ని నిపుణులు స్కోర్ చెక్ చేస్తారట. ఇది సంతానోత్పత్తి చికిత్సల ఫలితాన్ని మెరుగుపరుస్తుందని  నిపుణులు చెబుతున్నారు.

813

ఫెర్టిలిటీ స్కోర్ ప్రిడిక్టర్ (FSP) అప్లికేషన్ విస్తృత సామాజిక సందర్భాలతో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇది జంట స్కోర్‌ను  లెక్కించడానికి సహాయం చేస్తుంది. ఆ స్కోర్ ని బట్టి..  సదరు జంటకు ఎలాంటి చికిత్స ఇవ్వాలి అనే విషయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారట.

913

FSP పద్దతి వంధ్యత్వ చికిత్సలో జంట కోసం నిర్ణయం తీసుకునే ప్రక్రియలో సహాయపడుతుంది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సహాయపడుతుంది. చికిత్స ఎంపికను..పరిస్థితి తీవ్రతను నిర్ణయించడానికి సహాయం చేస్తుంది. 

1013

ఫెర్టిలిటీ స్కోర్ ని ఎలా క్లాసిఫై చేస్తారు అనే విషయాన్ని వైద్యులు ఎలా వర్గీకరిస్తారో ఓసారి చూద్దాం..

ఆకుపచ్చ (>20 స్కోరు): ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు గర్భధారణ కోసం సహజమైన ప్రయత్నంతో ఆహార సవరణలు, ఒత్తిడిని తగ్గించడం వంటి అంచనాలతో కూడిన నిర్వహణ. కనీసం ఆరు నెలల పాటు జీవనశైలి మార్పులు (బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, కెఫిన్ కలిగిన పానీయాలు తగ్గించడం వంటివి) సిఫార్సు చేయబడింది.

1113

నీలం (15–19 స్కోరు): అన్ని ప్రాథమిక పరిశోధనలు, సమయానుకూల సంభోగం (TIC), యూరినరీ కిట్ ద్వారా అండోత్సర్గాన్ని గుర్తించడం లేదా బేసల్ బాడీ టెంపరేచర్ (BBT) లేదా సోనోగ్రాఫిక్ అసెస్‌మెంట్‌ని నిర్వహించడానికి సంతానోత్పత్తి నిపుణుడితో సంప్రదింపులతో సహా చికిత్స ఎంపికలో క్రియాశీల ప్రమేయం. ప్రాథమిక పరిశోధనలలో అన్ని సాధారణ పరిశోధనలు, స్త్రీ హార్మోన్ల పరిశోధనలు, మగ వీర్య విశ్లేషణలు ఉంటాయి.

1213
ದಿನಕ್ಕೆ ಎರಡು ಚಮಚದಷ್ಟು ಟೊಮ್ಯಾಟೋ ಪ್ಯೂರಿಯನ್ನು ಸೇವಿಸುವ ಆರೋಗ್ಯವಂತ ಪುರುಷರಲ್ಲಿ ವೀರ್ಯಾಣುವಿನ ಗುಣಮಟ್ಟ ಉತ್ತಮವಾಗಿರುವುದು ಸಂಶೋಧನೆಯಿಂದ ತಿಳಿದುಬಂದಿದೆ. ಗರ್ಭವನ್ನು ಪಡೆಯಲಾಗದ ದಂಪತಿಗಳಲ್ಲಿ ಅರ್ಧಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ದಂಪತಿಗಳಿಗೆ ಪುರುಷ ಬಂಜೆತನ ಕಾಡುತ್ತದೆ.

ದಿನಕ್ಕೆ ಎರಡು ಚಮಚದಷ್ಟು ಟೊಮ್ಯಾಟೋ ಪ್ಯೂರಿಯನ್ನು ಸೇವಿಸುವ ಆರೋಗ್ಯವಂತ ಪುರುಷರಲ್ಲಿ ವೀರ್ಯಾಣುವಿನ ಗುಣಮಟ್ಟ ಉತ್ತಮವಾಗಿರುವುದು ಸಂಶೋಧನೆಯಿಂದ ತಿಳಿದುಬಂದಿದೆ. ಗರ್ಭವನ್ನು ಪಡೆಯಲಾಗದ ದಂಪತಿಗಳಲ್ಲಿ ಅರ್ಧಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ದಂಪತಿಗಳಿಗೆ ಪುರುಷ ಬಂಜೆತನ ಕಾಡುತ್ತದೆ.

ఆరెంజ్ (10–14 స్కోర్): 3–6 సైకిల్స్ మరియు ఎండోస్కోపీ ప్రక్రియ కోసం గర్భాశయంలోని ఇన్సెమినేషన్ (IUI)తో పాటు ఓవులోజెన్స్ /లేదా గోనాడోట్రోపిన్‌లతో అండోత్సర్గ ప్రేరణతో సహా స్థిరమైన మరియు క్రియాశీల నిర్వహణ

1313

ఎరుపు (5–9 స్కోరు): IVF, ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ మోర్ఫోలాజికల్‌గా ఎంచుకున్న స్పెర్మ్ ఇంజెక్షన్ (IMSI), వృషణ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ (TESE), పెర్క్యుటేనియస్ ఎపిడిడైమల్ స్పెర్మ్ ఆస్పిరేషన్ (PESA), మైక్రో-TESE, అసిస్టెడ్ లేజర్ హాచింగ్, బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌తో సహా దూకుడు నిర్వహణ , 3 నుండి 6 చక్రాల కోసం సమయం-లాప్స్ పర్యవేక్షణ.
  నలుపు (<5 స్కోరు): గేమేట్ డోనర్, సర్రోగేట్, ఎంబ్రియో డోనర్, గర్భాశయ మార్పిడిని ఉపయోగించడంతో సహా ప్రత్యామ్నాయ ఎంపిక.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా
Recommended image2
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Recommended image3
దిష్టి నిజమేనా? స్మృతి మంధాన, సమంత లైఫ్ ఇలా అవ్వడానికి దిష్టే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved