- Home
- Life
- Relationship
- Relashionship: మీ భాగస్వామితో తరచూ గొడవ పడుతున్నారా.. అయితే ఎంతవరకు మంచిదో చూడండి?
Relashionship: మీ భాగస్వామితో తరచూ గొడవ పడుతున్నారా.. అయితే ఎంతవరకు మంచిదో చూడండి?
Relationship: నేటి దంపతుల మధ్య అవగాహన కన్నా అపార్ధాలు ఎక్కువైపోతున్నాయి. దాంతో తరచూ గొడవ పడుతున్నారు దంపతులు. అయితే కొన్ని గొడవలు బంధాన్ని విడదీస్తే కొన్ని గొడవలు మంచికే అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

నేటి తరం దంపతుల మధ్య చాలా సులభంగా అపార్ధాలు సమస్యలు చుట్టుముడుతున్నాయి. దాంతో తరచుగా గొడవలు పడుతున్నారు భార్యాభర్తలు. అయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఎలాంటి సమస్య ఉండదు కానీ అలాంటి సహనం నేటి దంపతులలో కరువైపోయింది.
అయితే భార్యాభర్తల గొడవలు ఎప్పుడూ బంధానికి అవరోధమే కానీ కొన్ని గొడవలు మంచివే అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం. చిన్ని చిన్ని గొడవలు పడటం వల్ల మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తారు భాగస్వాములు తద్వారా మనలో ఉండే లోపాలని సరిదిద్దుకోవచ్చు.
అలాగే బంధం దూరమైపోతున్నప్పుడు ఆవేశాన్ని అణుచుకోలేక గొడవ పడుతుంటారు. ఇది ఎదుటి వ్యక్తి మీద ఇష్టం లేక కాదు ఎదుటి వ్యక్తి దూరం అయిపోతారేమో అన్న భయం. కాబట్టి గొడవకి కారణం చూడకుండా ఎదుటి వ్యక్తిలో ప్రేమని చూడగలిగితే ఇలాంటి..
గొడవలు ఇద్దరి మధ్యన బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. అలా కాకుండా ప్రతి విషయానికి గొడవపడుతున్నారంటే ఆ బంధం చిక్కుల్లో పడినట్లే.మీ భాగస్వామి కోపంతో గొడవకి దిగినప్పుడు మీరు కూడా రెచ్చిపోకుండా కాసేపు మౌనం వహించండి. అప్పుడు సమస్యని దూరం..
చేయడంతో పాటు మీ భర్త లేదా భార్యకి మీ సహనం అర్థమవుతుంది. అలాగే పిల్లల ముందు మీరు గొడవ పడుతున్నట్లయితే కచ్చితంగా వారి భవిష్యత్తుని మీరు పాడు చేసినట్లే కాబట్టి పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడకండి. కొంచెం సహనం చూపించగలిగితే చాలా గొడవలు రాకుండా నివారించవచ్చు.
ఆటోమేటిక్ గా మీ భర్తలో కూడా అలాంటి సహనం అలవడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గొడవకి దిగేముందు ఆలోచించండి అది ఉపయోగకరమో కాదో తెలుసుకోండి. గొడవకి దిగకపోతే సమస్య చేజారిపోతుంది అనిపించినప్పుడు గొడవ పడడమే మంచిది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.