MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఆయుర్వేదం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదా?

ఆయుర్వేదం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదా?

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని, వివాహిక జీవితాన్నిఆస్వాదించాలనుకుంటారు. ఆయుర్వేదం ప్రకారం.. సెక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే కొన్ని నియమాలను పాటించాలి.
 

R Shivallela | Published : Oct 24 2023, 02:13 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మన ఆరోగ్యం బాగుండాలంటే మన జీవినశైలి  మెరుగ్గా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కూడా ఉంది. సెక్స్ శరీరానికే కాదు, మనస్సుకు కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు ఇది వైవాహిక జీవితాన్ని బలోపేతం కూడా చేస్తుంది. భాగస్వాముల మధ్య ప్రేమను పెంచుతుంది. అయితే సెక్స్ విషయంలో ఆయుర్వేదం కొన్ని నియమాలను సూచిస్తుంది. 
 

25
Pain During Sex

Pain During Sex


పీరియడ్ సెక్స్ సురక్షితం కాదా?

ఆయుర్వేదం ప్రకారం..  పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవారు శృంగారానికి దూరంగా ఉండాలి. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎండోమెట్రియోసిస్ వస్తుంది. అంటే దీనిలో ఎండోమెట్రియల్ కణాలు గర్భాశయం వెలుపల పెరుగుతాయి. ఇది అండాశయాలు లేదా ఫెలోపియన్ గొట్టాలకు వ్యాపిస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే  శృంగారంలో పాల్గొనడం సురక్షితమని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

35
Sex Life

Sex Life

ఆరోగ్యకరమైన బరువు

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి శరీర బరువు ఆరోగ్యకరంగా ఉండాలి. అధిక బరువు, స్థూలకాయం ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండాలి. ఖాళీ కడుపుతో లేదా హెవీగా తిన్న తర్వాత సెక్స్ లో పాల్గొనకూడదు. ఒకవేళ పాల్గొన్నారంటే గౌట్, పిత్త లోపాల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ అసమతుల్యత వల్ల తలనొప్పి, జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రైటిస్  వంటి సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యం బాలేనప్పుడు లేదా శారీరకంగా, మానసికంగా దృఢంగా లేనప్పుడు కూడా సెక్స్ లో పాల్గొనకూడదు. 
 

45
Asianet Image

గర్భధారణ సమయంలో  సెక్స్

ఆయుర్వేదం గర్భధారణ సమయంలో లేదా డెలివరీ అయిన వెంటనే సెక్స్ లో పాల్గొనకూడదని సూచిస్తోంది. ఒక వ్యక్తి తన కోరికలపై నియంత్రణ కలిగి ఉండాలి. సి-సెక్షన్ అయితే కనీసం 5 నెలలు, నార్మల్ డెలివరీ అయితే 2-3 నెలల గ్యాప్ ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇది లైంగిక జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది స్త్రీ శరీరం డెలివరీ  అయిన తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుంది. హింసాత్మక శృంగారాన్ని ఆయుర్వేదం వ్యతిరేకిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఓరల్ సెక్స్ కరెక్ట్ కాదు.
 

55
Sleep after sex

Sleep after sex

ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి

శిలాజిత్

 సెక్స్ స్టామినాను పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అందుకే దీనిని ఇండియన్ వయాగ్రా అని పిలుస్తారు. ఇది లైంగిక పనితీరును మెరుగుపరచడానికి, సెక్స్ బలహీనతలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

అశ్వగంధ: ఇది కూడా పురుషుల్లో లైంగిక వాంఛను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే వంధ్యత్వ సమస్యను కూడా ఇది పోగొడుతుంది. 

జాజికాయ: శీఘ్రస్ఖలనాన్ని ఎదుర్కోవడావడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. దీనిని మహిళలకు వయాగ్రా అని పిలుస్తారు. దీని సువాసనను తరచుగా లైంగిక కోరికలను రేకెత్తించడానికి ఉపయోగిస్తారు.

కుంకుమపువ్వు: దీనిని పాలలో కలిపి తాగడం వల్ల భాగస్వామికి లైంగిక కోరికలు కలుగుతాయి. ఇది లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. 

R Shivallela
About the Author
R Shivallela
 
Recommended Stories
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలో తెలుసా?
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలో తెలుసా?
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!
Marriage: పెళ్లి చేసుకుంటే 12 లక్షలు మీ సొంతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Marriage: పెళ్లి చేసుకుంటే 12 లక్షలు మీ సొంతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Top Stories