- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips:స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలు ఈ పనులు చేస్తున్నారా..? ఇవి నేర్పించారా?
Parenting Tips:స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలు ఈ పనులు చేస్తున్నారా..? ఇవి నేర్పించారా?
Parenting Tips: మనం నేర్పించే చిన్న చిన్న పనులే... భవిష్యత్తులో వారిని మంచి పౌరులుగా మారుస్తుంది. కాబట్టి, చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పిస్తే... భవిష్యత్తులో వారు సంస్కారవంతులు అవుతారు. అందుకే, బేసిక్ స్కిల్స్ కచ్చితంగా నేర్పించాలి..

Parenting Tips
తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని ప్రతి పేరెంట్స్ కలలు కంటారు. దాని కోసం వారిని మంచి స్కూల్లో చదివించడం, వారి భవిష్యత్తుకు ఉపయోగపడే కళలను నేర్పిస్తూ ఉంటారు. అయితే.. వాటితో పాటు... బేసిక్ స్కిల్స్ కూడా నేర్పించాలి. మనం నేర్పించే చిన్న చిన్న పనులే... భవిష్యత్తులో వారిని మంచి పౌరులుగా మారుస్తుంది. కాబట్టి, చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పిస్తే... భవిష్యత్తులో వారు సంస్కారవంతులు అవుతారు. మరి.. పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
1.స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం...
పిల్లలు ఎక్కడ కష్టపడతారో అని... పేరెంట్స్ అని ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాళ్ల పుస్తకాల బ్యాగులు సర్దడం, వాళ్ల వస్తువులు అన్నీ చక్కగా పేరెంట్స్ సర్దుతూ ఉంటారు. కానీ... ఇలాంటి పనులు... పిల్లలతోనే చేయించుకోవాలి. వారి పుస్తకాలను వారితోనే సర్దుకునేలా చేయాలి. అప్పుడే.. వారికి ఏ వస్తువు ఎక్కడ ఉందో వారికి తెలుస్తుంది. టైమ్ మేనేజ్మెంట్ కూడా వారికి అలవడుతుంది. స్కూల్ నుంచి రాగానే.. వారి బుక్స్ వారే నీట్ గా సర్దుకోమని చెప్పాలి. హోం వర్క్ రాసిన తర్వాత మళ్లీ ఆ బుక్స్ బ్యాగులో పెట్టుకోవడం. పెన్సిల్, పెన్ లాంటివి సర్దుకోవడం వారితోనే చేయించాలి. మీరు చేయకూడదు.
2.బ్యాగ్ నుంచి లంచ్ బాక్స్ తీయడం..
స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. వాళ్ల సొంత పనులు వాళ్లే చేసేలా ప్రోత్సహించాలి. బ్యాగ్ లో నుంచి లంచ్ బాక్స్ వారితోనే తీయించి కిచెన్ లో పెట్టించాలి. కొంచెం పెద్దవాళ్లు అయితే.. ఆ బాక్సులను వాళ్లతోనే కడిగించాలి. అప్పుడు మరుసటి రోజు లంచ్ పెట్టడానికి వీలుగా ఉంటుంది.
ఈ చిన్న పనులను చేయించడం వల్ల పిల్లలకు బాధ్యత పెరుగుతుంది. పిల్లలకు ఇంటి పనుల్లో సహాయం చేసే అలవాటు నేర్పించాలి. దీని వలన వారు తమ ఇంటి పనులను అర్థం చేసుకుని, కుటుంబంతో కలిసి పనిచేయగలుగుతారు.
చేతులు కడుక్కోవడం, ముఖం కడుక్కోవడం
పాఠశాల తర్వాత మీ పిల్లలకు చేతులు, ముఖం కడుక్కోవడం అనే అలవాటు నేర్పించాలి. ఇది వారికి ఆరోగ్యంగా ఉండటానికి , అనారోగ్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మీ బిడ్డ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మీరు చేయవలసిన మొదటి పని వారి పాఠశాల యూనిఫాంను తీసివేయమని చెప్పడం. దీని తర్వాత, వారి చేతులు, కాళ్ళు కడుక్కోమని చెప్పండి. చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే సాక్స్ లాంటివి పెట్టాలి.
వారి సమయాన్ని తెలివిగా ఉపయోగించడం
పిల్లలకు వారి సమయాన్ని తెలివిగా ఉపయోగించడం అలవాటు నేర్పించాలి. ఇది వారి పనులను సమయానికి పూర్తి చేయడానికి , వారి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. పిల్లలకు వారి తల్లిదండ్రులతో సంభాషించే అలవాటు నేర్పించాలి. ఇది వారి ఆలోచనలను , భావాలను వారి తల్లిదండ్రులతో పంచుకోవడానికి , వారితో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.