పేరెంట్స్.. మీ పిల్లలతో ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి
చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఇదే పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. పేరెంట్స్ పట్ల ప్రేమ తగ్గేలా చేస్తుంది. అందుకే పిల్లల పట్ల తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన కొన్ని థాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి.

పేరెంటింగ్ టిప్స్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం ప్రతి తల్లిదండ్రికి పెద్ద సవాలుగా మారింది. బిజీ లైఫ్ స్టైల్ లో పిల్లల అల్లరి, వారిని క్రమ శిక్షణలో పెట్టడం, వారిని స్కూలుకు రెడీ చేయడం, చదివించడం వంటివి ఈ కాలం తల్లిదండ్రులు పెద్ద బాధ్యతగా ఫీలవుతున్నారు. నిజానికి పిల్లల బిహేవియర్ తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు? వంటివి తల్లిదండ్రుల పైనే ఆధారపడి ఉంటాయి.
పేరెంటింగ్ టిప్స్
నిజానికి పిల్లలు సొంతంగా నేర్చుకోవడం కంటే ఇతరులను చూసే ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ విషయం చాలా మంది పేరెంట్స్ కు తెలియదు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు? వేరేవారితో ఎందుకు మాట్లాడవు? వంటి మాటలను అని వారిని బాధపెడుతుంటారు. ఇవి అనడం ఈజీ అయినా ఈ మాటల వల్ల పిల్లలు ఎంతో బాధపడతారు. ఇది మీ పిల్లలపై నెగిటీవ్ ఎఫెక్ట్ పడుతుంది. పేరెంట్స్ మీరు పాయింట్ అవుట్ చేయాల్సింది పిల్లల్ని కాదు వారి బిహేవియ్ ను. అందుకే తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ ఆలోచనలు ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అల్లరి చేయకు
పిల్లలు అన్నాక అల్లరి చేయడం చాలా కామన్. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే విసుక్కుంటారు. దయ్యంలా అల్లరి చేయకు అని తిడుతుంటారు. వారిపై అరుస్తుంటారు.
మీ పిల్లలు అల్లరి చేయకూడదంటే మీరు ఇలాంటి మాటలు అనడానికి బదులుగా బాబూ నువ్ హైపర్ యాక్టీవ్ గా చేస్తున్నావు. ఇలా నువ్ ప్రతి సారీ హైపర్ అవ్వడం మంచిది కాదని చెప్పండి. ఇది మీరు పిల్లలో చెప్పే పద్దతి. అంతేకానీ మీరు తిట్టడం వల్ల పిల్లలు అల్లరి మానరు.
రిలేటీవ్స్ తో మాట్లాడటానికి సిగ్గేంటి
చాలా మంది పిల్లలు ఇతరులతో అంత సులువుగా కలవలేరు. వారితో ఫ్రీగా మాట్లాడలేరు. అందుకే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వారితో అస్సలు మాట్లాడకుండా ఉంటారు. కానీ పేరెంట్స్ తమ పిల్లలు బంధువులతో బాగా మాట్లాడాలని కోరుకుంటారు.
ఇలా జరగకపోతే బంధువులతో మాట్లాడటానికి సిగ్గెందుకు అని కసురుకుంటుంటారు. మీ పిల్లలు బంధువులతో మాట్లాడాలంటే మీరు ఇలా మాటలు అనడానికి బదులుగా ఇట్స్ ఓకే డియర్ ఇతరులతో మింగిల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి పెద్దవారు వచ్చినప్పుడు వారికి రెస్పెక్ట్ ఫుల్ గా నమస్తే చెప్పండి అని మీ పిల్లలకు నేర్పించండి.
అమ్మను విడవకపోవడం
చాలా మంది పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అమ్మతోనే ఎక్కువగా ఉంటారు. ఆమెతో ఉండటానికే ఇంట్రెస్ట్ చూపుతారు. వేరే వాళ్ల దగ్గరకికి అస్సలు పోరు. అంటే వారు అమ్మతోనే గ్లై లాగ స్టిక్ అయ్యారని కాదు.. మీదగ్గరుంటే వారు సేఫ్ గా ఫీలవుతున్నారని అర్థం. సేఫ్ గా ఫీలవుతారు కాబట్టే పిల్లలు తల్లిని విడిచిపెట్టి ఉండరు. ఎప్పుడూ ఆమెతోనే ఉండాలనుకుంటారు.
ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావా?
పిల్లలు ఏడవడం కూడా చాలా కామన్. వీరు చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావా? అంటూ పిల్లల్ని కసురుకుంటుంటారు. కానీ ఇలా అనడానికి బదులుగా కొన్ని విషయాల పట్ల స్ట్రాంగ్ గా ఉండాలని పిల్లలకు నేర్పండి.