కేసీఆర్ కు జగన్ కు తేడా అదే: జైంట్ కిల్లర్స్ కూడా బలాదూరే...

First Published 13, Aug 2020, 5:27 PM

కొందరు అనామక నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్కున్నా.... ప్రధానమైన నాయకులకు, ముఖ్యంగా జైంట్ కిల్లర్లుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారికి మాత్రం ఖచ్చితంగా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరిని అంత త్వరగా కలవరు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఇది స్వయంగా వైసీపీ లోని నేతలే చెప్పే మాట. రఘురామకృష్ణం రాజు మొత్తం వ్యవహారంలోనూ ఇదే విషయం ప్రధానాంశమయింది. ఆయన పదే పదే జగన్ ని కలవలేకపోతున్నానని అన్నాడు.

రఘురామ కృష్ణంరాజు ఉదంతం తరువాత ఒకింత మార్పు వచ్చిందని, జగన్ రోజులో కొద్దీ సమయం ఎమ్మెల్యేలను కలవడానికి కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ... చాల మంది ప్రజాప్రతినిధులు ఇంతవరకు ఎదురుగా కూర్చొని జగన్ తో నేరుగా సమావేశమయి మాట్లాడింది లేదు. జగన్ అపాయింట్మెంట్ దొరకడమే మహద్భాగ్యమయిపోయింది.

జగన్ నిత్యం ప్రజాక్షేత్రంలోనే బిజీగా ఉంటున్నాడు, అందుకని కొత్తవారిని కలవడానికి అవకాశం దక్కి ఉండకపోవచ్చు అని అనవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో  ప్రజాప్రతినిధి తమ నాయకుడిని కలుసుకోవడం అత్యంత ఆవశ్యకం.

కొద్దీ సేపు ప్రజాస్వామ్య విషయాలు పక్కనబెడితే.... కల్ట్ ఫాలోయింగ్ కలిగిన నాయకుల శైలి ఇలానే ఉండడాన్ని ఈ మధ్య మనం చూస్తున్నాము. తెలంగాణ సర్కారులో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది.

కొద్దీ సేపు ప్రజాస్వామ్య విషయాలు పక్కనబెడితే.... కల్ట్ ఫాలోయింగ్ కలిగిన నాయకుల శైలి ఇలానే ఉండడాన్ని ఈ మధ్య మనం చూస్తున్నాము. తెలంగాణ సర్కారులో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది.

కొందరు అనామక నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్కున్నా.... ప్రధానమైన నాయకులకు, ముఖ్యంగా జైంట్ కిల్లర్లుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారికి మాత్రం ఖచ్చితంగా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది.

కొందరు అనామక నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్కున్నా.... ప్రధానమైన నాయకులకు, ముఖ్యంగా జైంట్ కిల్లర్లుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారికి మాత్రం ఖచ్చితంగా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది.

కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కొందరు హేమాహేమీలు సైతం జగన్ ను కలవడం కోసం కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.

జైంట్ కిల్లర్స్ విషయానికి వస్తే... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ని ఓడించిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి కోర్టు కేసు అంటూ హడావుడి చేయడం తప్ప వేరే పెద్దగా కనబడడం లేదు. అమరావతి పుణ్యమాని ఆయన మంగళగిరి పరిధిలో తిరగలేకపోతున్నారు కూడా.

లోకేష్ ను ఓడించి అసెంబ్లీకి పంపిస్తే ఆర్కే కి మంత్రి పదవి కట్టబెడతానని జగన్ ఆనాడు మంగళగిరి ప్రజలకు చెప్పాడు. కానీ సామాజికవర్గ సమీకరణలు ఆయనకు కలిసి రాలేదు. ఈ మధ్యనే ఆయన సోదరుడికి రాజ్యసభ సీటును ఇచ్చినా ఆర్కేకి మాత్రం అమాత్య పదవి దక్కలేదు.

ఇక మరో జైంట్ కిల్లర్ పవన్ కళ్యాణ్ ని ఓడించినవారు. పవన్ ని భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఓడిస్తే... గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ఓడించాడు. కనీసం గ్రంధి శ్రీనివాస్ అయినా... రఘురామ వ్యవహారం సమయంలో టీవీలోనైనా కనిపించాడు, కానీ నాగిరెడ్డి పేరు ఎంతమందికి ఇంకా గుర్తుందనేది ప్రశ్నార్థకమైన విషయమే.

లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి ఉద్దండులను ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారిని ఘనంగా పదవులిచ్చి ప్రభుత్వం సత్కరిస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా వారికి అపాయింట్మెంట్ దొరకడమే గగనమయిపోయింది. వీరి పరిస్థితే ఇలాగుంటే... ఇక సాధారణ ఎమ్మెల్యేల పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు!

loader