హరీష్ రావు వెనక్కి...: కేటీఆర్ మరింత ముందుకు, కేసీఆర్ ఆలోచన ఇదీ...

First Published 26, Jan 2020, 11:27 AM IST

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధించడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన గమ్యం వైపు మరో అడుగు ముందుకు వేసినట్లయింది. 

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధించడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన గమ్యం వైపు మరో అడుగు ముందుకు వేసినట్లయింది. మున్సిపాలిటీల్లో బిజెపికి కార్యకర్తల బలం ఉంటుందని, దానివల్ల టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే, వారి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. (KTR)

లోకసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బిజెపి సత్తా చాటుతుందని భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. బిజెపియే కాదు, కాంగ్రెసు కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల విజయం క్రెడిట్ పూర్తిగా కేటీఆర్ కు దక్కుతుందనడంలో సందేహం లేదు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత శనివారం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు కూడా కేటీఆర్ ను తన వారసుడిగా ముందుకు తెచ్చినట్లే ఉంది. కేటీఆర్ తదుపరి ముఖ్యమంత్రి అనే ప్రచారానికి బలం చేకూరే విధంగానే ఉంది. కేటీఆర్ పేరును కేసీఆర్ తన మీడియా సమావేశంలో మూడు నాలుగు సార్లు ప్రస్తావించారు.

మీడియా ,సమావేశంలో కేసీఆర్ కు ఓ పక్కన కే. కేశవరావు కూర్చుంటే మరో సీనియర్ నేత మరో పక్కన కూర్చునేవారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ కేసీఆర్ పక్కన కూర్చున్నారు. మరో వైపు కేకే కూర్చున్నారు. దీన్ని బట్టి కూడా కేటీఆర్ ప్రమోషన్ వచ్చినట్లు భావించవచ్చు.

వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాలు సాధిస్తూ వస్తోంది. ఆ విజయాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం కేటీఆర్ కే దక్కుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్ స్థాయిని పెంచాయి. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల సమయం నుంచి కేటీఆర్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు.

లోకసభ ఎన్నికలు మాత్రమే కాస్తా చిక్కులు తెచ్చిపెట్టాయి. తాజా మున్సిపల్ ఎన్నికలు ఆ చిక్కులను మరిపిస్తున్నాయి. అందువల్ల లోకసభ ఎన్నికల్లో ఎదురు దెబ్బను ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా తిప్పికొట్టారు. నిజామాబాద్ లో ఓటమి పాలైన కవిత కేటీఆర్ కు పోటీ ఇచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో కేటీఆర్ సూచనల మేరకే ఆమె పనిచేయాల్సి ఉంటుంది.

శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి హరీష్ రావును వెనక్కి నెడుతూ వస్తున్నారు. హరీష్ రావు నుంచి కేటీఆర్ కు ఏ మాత్రం పోటీ లేకుండా కేసీఆర్ చూస్తూ వస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలను కేటీఆర్ అందుకుంటూ హరీష్ రావును వెనక్కి నెడుతూ ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా హరీష్ రావు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ వెనక్కి వెళ్లిపోయినట్లేనని భావిస్తున్నారు.

ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వంలోనూ ఆయనదే పట్టు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల తర్వాత పార్టీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా కేటీఆర్ ను ప్రకటించే అవకాశం లేదు. తద్వారా ముఖ్యమంత్రి పదవి వైపు కేటీఆర్ ను క్రమంగా నడిపిస్తారని అంటున్నారు.

loader