కవితమ్మ నైతిక ఓటమి
కవిత గారి ఓటమికి ఎన్ని కారణాలైనా ఉండవచ్చు. కానీ, తనకు భూమిక నిచ్చిన బతుకమ్మ ఉత్సవాల నుంచి ఈ ఏడూ దూరం జరగడం వారి నైతిక ఓటమికి ప్రతీక.
(కందుకూరి రమేష్ బాబు)
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన కల్వకుంట్ల కవిత గారు తమ ఓటమికి కారణాలేమిటో సమీక్షించుకుంటూ ఉండవచ్చు. దొర్లిన పొరబాట్లనుంచి భవిష్యత్ కార్యాచరణకు తగిన విధానాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండవచ్చు. కానీ, తెలంగాణ సాధనలో అత్యంత కీలకంగా వ్యవహరించిన‘జాగృతి’ స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలిగా కల్వకుంట కవిత ఓటమికి మరో నైతిక అంశం గురించి రెండు మాటలు చెప్పక తప్పదు. అది ఆమె తలకెత్తుకున్న బతుకమ్మ గురించే.ఈ సారి తను దూరం పెట్టిన ఫలితమే ఆమె ఓటమికి అసలు కారణం అని నా భావన. బతుకమ్మ ఉత్సవాలకూ ఇప్పటితన ఓటమికీ నేరుగా ఏమీ సంబంధం లేకపోవచ్చు గానీ, ఈ ఏడాది తాను బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉండటం ఒక చారిత్రక పొరబాటు అనే చెప్పాలి. చరిత్రకు భవిష్యత్తు ఉంటుంది, కారణాలు ఏమైనా ఉత్సవాలకు దూరంగా ఉండటం వల్ల తనకు భూమిక ఇచ్చిన నేల కుదుపుకు గురైందని ఒక సెంటిమెంటల్ వ్యాఖ్యానపు విశ్లేషణ ఇది. ప్రతి ఏటా తెలంగాణా జాగృతి తరపున నిర్వహించే బతుకమ్మ వేడుకలకు తాను ఈ సంవత్సరం దూరంగా ఉన్న విషయం మనకు తెలుసు. అందుకు రెండు కారణాలు చెప్పారు. ఒకటి, ‘ఎన్నికల ఏడాది కావడం’ అన్నారు. రెండు, ‘గత నాలుగేళ్ళలో ప్రతిపక్షాలుచేసిన వ్యాఖ్యలు’ తనని బాధించడం అన్నారు. నిజానికి బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి జాగృతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని కవిత గారువిషదంచేస్తూ తాను ఈ ఏడూ వేడుకలకు దూరంగా ఉండబోతున్నామని బాధతోఅప్పుడు ప్రకటించారు. బహుశా దేశం బయట వారు ఏమైనా ఉత్సవాల్లో పాల్గొన్నారా నాకు గమనంలో లేదు గానీ మన దగ్గర మాత్రం వారు ఉత్సవాలలో యాక్టివ్ గా లేరు. ఐతే, బతుకమ్మ ఉత్సవాల వల్ల ఏం వొరిగింది? అనే వారి విషయం పక్కన పెడితే ఒక నాడు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కవిత గారు తెచ్చిన విప్లవం సకల జనులనూ వినమ్రంగా కలిపింది. పోరు దారిలోకి అపురూపంగా ఉసిగోలిపింది.అదొకఅందమైన చరిత్ర. దాని నుంచి ఆమె విస్తరించవలసిన అవకాశం ఉండే. మరింత లోతైన కార్యాచరణ తీసుకోవలసి ఉండే. కానీ రాజకీయాల్లో నిమగ్నమై, సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు తప్పాఅసలైన బతుకు ...బతుకమ్మలను అర్థం చేసుకుని, వారితో మమేకం కాలేదనే చెప్పాలి. ఏమైనా,ఒకసారి ఒకచారిత్రిక బాధ్యతను నెరవేర్చిన వారు అక్కడ నుంచి జరగడం అన్నది వారి ఉదాసీనతకు లేదా వారి దృష్టి ఇతరత్రా విషయాలకు మరలడం అనే భావించవలసి వస్తుంది లేదా గతంలో చేసింది అంతా కూడా ఒక స్వప్రయోజనం కోసం అని, ఇప్పటి ప్రయోజనాలు వేరు అనే సంకేతాలు వెలుతై. ఏమైనా కవిత గారి ఓటమికి తాను బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉండటం ఒక ప్రతీక. ప్రజలకు దగ్గరగా ఉండవలసిన వారు ప్రకలకు దూరం అవుతున్నరూ అనడానికి అప్పుడే వెల్లడైన సంకేతం. ఉద్యమ అకాక్షలే ఎప్పటికైనా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమే తప్పా అధికార రాజకీయ ప్రయోజనాలుఅంతిమం కారాదు, ఎప్పటికైనా... +++ మన అందరికీ తెలుసు, తెలంగాణలో కవిత గారికి అస్తిత్వాన్ని ఇచ్చిందే బతుకమ్మ అని. ఈ రోజు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉండవచ్చు. రేపు మన రాష్ట్రం మరొకరు ఏలుబడిలో ఉండవచ్చు. అధికారంలో ఎవరున్నా కూడా ఆయా ప్రభుత్వాలు బతుకమ్మ వేడుకలను నిర్వహించక పోతే తానైనా నడుం కట్టి తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు పూనుకోవాలిసిన మహత్తర బాధ్యత కూడా కవిత గారిదే.
ఒక సారి ఒక సంస్కృతిలో భాగమై ఆ తర్వాత ‘నాకు పట్టదు’ అంటే అది రాజకీయాల్లో చెల్లుతుందేమో గానీ ఒకఆడబిడ్డగా చెల్లదు. తెలంగాణ ప్రజ స్వభావం అది కాదు. ఆత్మగల్ల మనుషులు ప్రయోజనాలు ఎరిగి ఎన్నడూ పని చేయరు. తనకు లైఫ్ ఇచ్చిన బతుకమ్మ నుంచి వేరుపడి కవిత గారు సాధించే ఏ విజయమైనా బతుకమ్మ ముందు దిగదుడుపే. అది గ్రహించడం నేటి కర్తవ్యం. కాగా, నిజానికి కవిత గారు తెలంగాణ అడబిడ్డగా మరింత చురుకుగా ప్రజల్లోకి వెళ్ళ వలసి ఉంది. బతుకమ్మ పండుగ అందుకు మంచి సదవకాశం. అటా పాట మాత్రమే కాకుండా సాకారమైన తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఇప్పటిప్రజాక్షేత్రంలో అసలు పరిస్థితులను, ఆడబిడ్డల దగ్గరకు వెళ్లి అర్థం చేసుకునే సదవకాశం ఆమెకే ఎక్కువ. తెలంగాణ ప్రజల మంచి చెడులను మరింత బాధ్యతతో నెరవేర్చేందుకు తలలో నాలుకలా మేసేలే అవకాశం వారికి ఉన్నంతగా మరొకరికి లేదు. ఇప్పటికీ ఆమె క్షేత్రం పదిలం. ఒక వైపు తండ్రి, మరోవైపు సోదరుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు కూడాపైపైకి పోవాలనుకున్నారే గానీ కిందికి...బతుకమ్మను కింది నుంచి పేర్చుకునే సంస్కృతిలోపునరంకితం కావాలని భావించినట్లు లేదు. అసలుకు డిల్లిలోఉత్తమ పార్లమెంటేరియన్ గా వారు పొందిన గుర్తింపుకన్నా తెలంగాణ క్షేత్రంలో తానుచేయవలసిన పని ఎక్కువ ఉన్నది. పొందవలసిన మన్ననా ఇక్కడే ఎక్కువ ఉన్నది.రేపుమాపు వారిని కేసీఆర్ మంత్రి వర్యులని చేస్తారని కూడా వినికిడి. అది మంచి నిర్ణయం కూడా.
చివరగా, ఎన్నికల్లో ఓటమి గురించి. అదిచాలాచిన్న విషయం. కవితమ్మ గట్టి మనిషి.ఆమె ముందర మా గెలుస్తారు.రేపటి రోజు రాష్ట్రం యావత్తూ జలకళ పెరుతుతున్న సందర్భంలో బతుకమ్మ పండుగతో ఆమె ఉత్సాహంగాప్రజల్లోకి వెళ్ళడం అంతకంటే ముఖ్యం. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే ఇదే. జాగృతి‘జాగృతం’ కావలసింది కూడాఇక్కడే. అన్నట్టు,ఈ సారి సీట్లు తగ్గినా ఎన్నికలశాతంపెరగవచ్చు. కానీరాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నేలకొనలేదన్నది మాత్రం అంతిమ సత్యం. (వ్యాసకర్తనమస్తే తెలంగాణ ఆదివారం సంచిక ‘బతుకమ్మ’ పూర్వ సంపాదకులు)