జగన్ నేర్పిన వ్యూహమే: నిమ్మగడ్డ, రఘురామ అదే దారిలో...

First Published 27, Jun 2020, 5:34 PM

రఘురామ కృష్ణంరాజు కూడా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరడంతో... మనందరికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ గుర్తుకురావడం తథ్యం. ఆయన కూడా తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించమని కోరిన విషయం ఇంకా అందరికి గుర్తుండే ఉంటుంది.

రఘురామకృష్ణంరాజు రోజుకో విషయాన్నీ తెరమీదకు తీసుకొచ్చి వేడి మీదున్న రాజకీయాలను మరింత హాట్ గా మారుస్తున్నారు. మొన్నామధ్య తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించమని కోరిన రఘురామ నేడు ఏకంగా కేంద్ర మంత్రులను కలిశారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.

ఆయన ఇలా మంత్రులను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.... తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే సొంతపార్టీ ఎంపీయే భయపడాల్సిన దుస్థితి వచ్చిందని, తనను బయట తిరిగితే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

ఇలా రఘురామ కృష్ణంరాజు కూడా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరడంతో... మనందరికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ గుర్తుకురావడం తథ్యం. ఆయన కూడా తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించమని కోరిన విషయం ఇంకా అందరికి గుర్తుండే ఉంటుంది.

ఆయన ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు వైసీపీ నేతలు ఆయనపై తీవ్రస్థాయిలోన్ దాడి చేసిన విషయం తెలిసిందే. వారంతా రమేష్ కుమార్ ను చంద్రబాబు కోవర్ట్ గా అభివర్ణిస్తూ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.... కింద ఉన్న క్యాడర్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రానికి తనకు రక్షణ కల్పించమని లేఖ రాసారు. ఆయన అడగగానే కేంద్రబలగాలు ప్రత్యక్షమయ్యాయి.

ఈ రెండు సంఘటనల్లోనూ మనకు కనబడుతున్న ఒక కామన్ అంశం ఏమిటంటే..... వీరిరువురు కూడా రాష్ట్ర పోలీసులను నమ్మడంలేదు అని. పోలీసులను మనం మనకు న్యాయం చేయమని, మనల్ని రక్షించమని వేడుకొంటాం. కానీ ఇక్కడ ఈ రెండు సందర్భాల్లోనూ వీరిరువురు కూడా రాష్ట్ర పోలీసులను నమ్మడం లేదు.

ఇంకొద్దిగా లోతుగా పరిశీలిస్తే... వీరిరువురు కూడా జగన్ మోహన్ రెడ్డి దారిలోనే నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలో జగన్ మోహన్ రెడ్డి సైతం టీడీపీ హయాంలో రాష్ట్ర పోలీసులను నమ్మను అని అన్న సందర్భాలు అనేకం.

గతంలో జగన్ మోహన్ రెడ్డి పై వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన విషయం దగ్గరి నుండి వివేకానంద హత్య వరకు అనేక సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి తాను రాష్ట్ర పోలీసులను నమ్మను అని అన్నారు.

వైసీపీవారు సైతం ఒక అడుగు ముందుకేసి తెలంగాణాలో కేసులు పెట్టారు, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. జగన్ సోదరి షర్మిల సైతం తెలంగాణాలో కేసు పెట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరల సీన్ రిపీట్ అయినట్టుగా మొన్న నిమ్మగడ్డ, నేడు రఘురామా కృష్ణం రాజు ఇద్దరు కూడా రాష్ట్ర పోలీసులపై  నమ్మకం లేదు అన్నట్టుగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించమని కోరడం నిజంగా ఆశ్చర్యకరం.

కేవలం ప్రభుత్వాలు మారాయి. కానీ పోలీసులు అలానే ఉన్నారు. పోలీసు వ్యవస్థ అలానే ఉంది. పోలీసులపై తాము అధికారంలో ఉన్నప్పుడు అప్పటి అధికారపక్షానికి నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు లేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి అప్పుడు నమ్మకం లేదు, ఇప్పుడు అధికారంలోకి రాగానే నమ్మకం తన్నుకొచ్చింది. ఈ పరిస్థితులను చూస్తుంటే... కోర్టు పోలీసులపై నమ్మకం పోయింది అని ఎందుకు వ్యాఖ్యానించిందో ఇప్పుడు అవగతమవుతుంది.

loader