జగన్ పై పవన్ సమర శంఖం: కాపు రాజకీయ అజెండాతో ముందుకు

First Published 28, Jun 2020, 12:42 PM

కాపులకు అన్యాయం జరుగుతున్నందున కాపు నాయకులందరూ తనను మాట్లాడమని  ఒక గొంతుకలాగా మారమని కోరుతున్నారని అడుగుతున్నారని ఆయన అన్నారు. ఇవి లేఖలోని ముఖ్యాంశాలు. వీటన్నిటిని  పరిశీలించి, కొన్ని వర్ధమాన రాజకీయాలతో గనుక పోల్చి చూసుకుంటే.... మనకు పవన్ కళ్యాణ్ కాపు రాజకీయం గురించి క్లియర్ గా అర్థమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ప్రభుత్వానికి బ్యాక్ టు బ్యాక్ లేఖలు రాసి మరోమారు వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ప్రారంభించగానే పవన్ కళ్యాణ్ యాక్టీవ్ అయ్యారు. ఆయన కాపు నేస్తం పథకాన్ని జగన్ తీసుకురావడానికి కారణం కాపు రేజర్వేషన్లను పక్కదోవ పట్టించడానికే అంటూ ఒక ఘాటు లేఖ రాసారు.

కాపు నేస్తం పేరుతో పథకాన్ని తీసుకొచ్చి కాపులకేదో చేస్తున్నామంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని, అన్ని పథకాల కింద ఉన్న లబ్ధిదారులకు సంబంధించిన అన్ని లెక్కలను తీసుకొచ్చి కాపులకు ఇంత చేసాం అంత చేసాం అని ప్రగల్భాలు చెప్పుకుంటున్నారని అన్నారు.

ఇక నిన్నటి లేఖలో మంజునాథ కమిషన్ నుండి మొదలు మొన్న మొన్నటి కేంద్రం తీసుకొచ్చిన ఈబీసీ రేజర్వేషన్ల వరకు అన్నిటిని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఈ ప్రస్తావనల్లో ఆయన మొత్తంగా చెప్పింది కాపులకు అన్ని రాజకీయ పార్టీలు ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ కానీ ద్రోహం చేసాయి అని అన్నాడు.

ఈబీసీ కోటాలో 5 శాతం కాపులకు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు అంటే... జగన్ అధికారంలోకి రాగానే అది కోర్టుల్లో నిలబడదు అని దాన్ని అటకెక్కించి దాని ఊసే లేకుండా చేసాడని ఆరోపించారు.

కాపులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ...వైసీపీ లోని కాపు నేతలకు ఇది పట్టడంలేదని, వారెవ్వరూ కూడా ఈ విషయంలో స్పందించడంలేదని ఆయన అన్నారు. జగన్ పంచన చేరి వారు కాపులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపణ.

కాపులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ...వైసీపీ లోని కాపు నేతలకు ఇది పట్టడంలేదని, వారెవ్వరూ కూడా ఈ విషయంలో స్పందించడంలేదని ఆయన అన్నారు. జగన్ పంచన చేరి వారు కాపులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపణ.

కాపులకు అన్యాయం జరుగుతున్నందున కాపు నాయకులందరూ తనను మాట్లాడమని  ఒక గొంతుకలాగా మారమని కోరుతున్నారని అడుగుతున్నారని ఆయన అన్నారు. ఇవి లేఖలోని ముఖ్యాంశాలు. వీటన్నిటిని  పరిశీలించి, కొన్ని వర్ధమాన రాజకీయాలతో గనుక పోల్చి చూసుకుంటే.... మనకు పవన్ కళ్యాణ్ కాపు రాజకీయం గురించి క్లియర్ గా అర్థమవుతుంది.

కాపులకు అన్యాయం జరుగుతున్నందున కాపు నాయకులందరూ తనను మాట్లాడమని  ఒక గొంతుకలాగా మారమని కోరుతున్నారని అడుగుతున్నారని ఆయన అన్నారు. ఇవి లేఖలోని ముఖ్యాంశాలు. వీటన్నిటిని  పరిశీలించి, కొన్ని వర్ధమాన రాజకీయాలతో గనుక పోల్చి చూసుకుంటే.... మనకు పవన్ కళ్యాణ్ కాపు రాజకీయం గురించి క్లియర్ గా అర్థమవుతుంది.

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తానొక్క సెగ్మెంట్ కి మాత్రమే నాయకుడిని కాదు అని చెప్పుకున్నాడు. రాష్ట్రమంతా కూడా ఆయన తన ఇమేజ్ ని ప్రోజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసారు. ఆ ప్రయత్నంలో కాపులు కూడా ఆయన వెంట పూర్తిగా నడవలేదు. (పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపులకు మాత్రమే నాయకుడు అని కాదు, కానీ సొంత సామాజికవర్గ బాసట ఉంటుందని ఆయన వేసుకున్న లెక్కలు మాత్రం తప్పాయి)

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొలుతగా తన సొంత సామాజికవర్గానికి ఒక ప్రతినిధిగా ఎదగాలని భావిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓటమికి, 2019 ఎన్నికల్లో జగన్ అఖండ విజయానికి అయినా కారణం ఉభయగోదావరి జిల్లాలు. అనూహ్యంగా ఆ ప్రాంతాల్లో జగన్ విజయం సాధించారు.

ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలాగైనా జగన్ ని దెబ్బకొట్టాలనే సంకల్పంతో సాగుతున్నట్టుగా కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్. కరెక్ట్ గా చెప్పాలంటే... కాపు సామాజికవర్గాన్ని జగన్ నుండి తనవైపుగా తిప్పుకోవడానికి ఎత్తుగడలు మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.

ఆయన అందుకోసమే ఇప్పుడు ఇలా కాపు రేజర్వేషన్ల గురించి కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం అన్నాక ప్రశ్నిస్తారు. అందులో ఇంత నిగూఢార్థం వెతకాల్సిన అవసరం లేదు కదా అని అనిపించొచ్చు.

కానీ వర్తమాన రాజకీయాలతో పోల్చి చూసుకుంటే... పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచనలు మనకు అర్థమవుతాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం. ప్రస్తుతానికి బీజేపీ అధికార వైసీపీతో మంచిగానే ఉంటుంది. ఒకరకంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీతో, అధికార వైసీపీ తో సఖ్యతతోనే ఉంటుంది.

రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ మీద ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ... కేంద్ర నాయకులు మాత్రం ఏ నాడు జగన్ ని పల్లెత్తు మాట అనలేదు. అవసరమైతే లేఖలు రాసారు, ఢిల్లీకి పిలిపించారు. అంతే తప్ప ఎటువంటి బహిరంగ విమర్శను చేయలేదు.

కానీ అనూహ్యంగా మొన్న రామ్ మాధవ్, నిన్న నిర్మల సీతారామన్ జగన్ మీద మాటల తూటాలు పేల్చారు. వీటితోపాటుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపుల ఎజెండా ను ఎత్తుకోవడం. దీనికి బ్యాక్ గ్రౌండ్ లో రఘురామ కృష్ణం రాజు.

వీటన్నిటిని చూస్తుంటే... ఒక పెద్ద ప్లాన్ కనబడుతుంది(అది మరల చర్చించుకుందాము) కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా కాపుల విషయాన్నీ ఎత్తుకోవడం మాత్రం కాకతాళీయం కాదు. ఆయన ఒక ప్లాన్ తోనే ఇలా ఇప్పుడు కాపుల విషయాన్నీ ఎత్తుకున్నాడు.

పవన్ కళ్యాణ్ తన స్కెచ్ వల్ల రెండు విధాలుగా లాభం పొందాలని అనుకుంటున్నాడు. ఒకటి జగన్ మోహన్ రెడ్డిని ఉభయ గోదావరి జిల్లాల్లో బలహీనపరచడం. కాపు సామాజికవర్గానికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా(అధికారం చేజిక్కించుకునేంత పెద్ద నాయకుడిగా) ఎదగడం. ఎప్పటి నుండో తమ సామాజికవర్గానికి అధికారం దక్కడంలేదు అని తమలో తాము మదనపడుతున్న కాపులకు ఒక లీడర్ గా పవన్ కళ్యాణ్ ఎదగాలని ప్రయత్నాన్ని మొదలుపెట్టారు.

loader