జగన్ పకడ్బందీ ప్లాన్: ప్రశాంత్ కిశోర్ చేతుల్లోకి గ్రామ వాలంటీర్లు

First Published 7, Jul 2020, 2:12 PM

కరోనా కష్టకాలంలో గ్రామా వాలంటీర్ల వ్యవస్థ జగన్ సర్కార్ కు వెన్నుముకగా  నిలిచింది. వాలంటీర్లు చాలా సందర్భాల్లో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి తీవ్ర కళంకాన్ని తీసుకువస్తున్నారు. వారిని గాడిలో పెట్టడానికి జగన్ ఇప్పుడు మరోసారి పీకే టీం ని రంగంలోకి దింపారు.

సమీపంలో ఎన్నికలు లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటున్నాయి. అందుకు కారణాలు అనేకం. కరోనా వైరస్ మహమ్మారి ఒకపక్కన దాని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ... కరోనా హీట్ కన్నా పొలిటికల్ హీట్ ఎక్కువవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత డైనమిక్ గా ఉంటున్నాయో.....  రోజు జరుగుతున్న సంగతులు, మారుతున్న రాజకీయ సమీకరణాలను చూస్తే మనకు అర్థమవుతుంది.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుండి సుపరిపాలన మీద దృష్టి పెట్టాను అని చెబుతూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల్లో దూసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు అన్ని చేస్తున్నప్పటికీ... వైసీపీ పార్టీ నిర్మాణంలో ఒక లోపం మనకు కనబడుతుంది. పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు.

వైసీపీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచినప్పటికీ.... ఆ ఓట్లన్నీ కూడా జగన్ చరిష్మా వల్ల, జగన్ ఇమేజ్ వల్ల మాత్రమే పడ్డాయి. ప్రజలు జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఓట్లేశారు. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా తెలియకుండా వోట్లేసినవారున్నారు కూడా. పార్టీకి గనుక సంస్థాగత నిర్మాణం లేకపోతే అది ఎప్పటికైనా పార్టీకి ఇబ్బందే.

ఈ విషయాన్నీ కొద్దీ సేపు పక్కకుంచితే... సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్రామంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమిస్తామని పేర్కొన్న ప్రభుత్వం, చెప్పినట్టుగానే ఆ మేరకు వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి మరీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సూచించిన వారినే ఎంపిక చేశారు.

వారిలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, వీరాభిమానులు ఎక్కువ. గ్రామ, వార్డు వలంటీర్లుగా ఎంపికైన వారు.. క్షేత్రస్థాయిలో జరిగే పేదలకు రేషన్, పెన్షన్ పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకుచేరవేయడంలో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా కష్టకాలంలో గ్రామా వాలంటీర్ల వ్యవస్థ జగన్ సర్కార్ కు వెన్నుముకగా  నిలిచింది. ఊరిలోకి కొత్తవారు ఎవరు వచ్చారు అనే విషయం ప్రభుత్వానికి నివేదించడం దగ్గరి నుండి వారి వారి హోమ్ క్వారంటైన్ లను పరిశీలించడం వరకు అన్ని విషయాల్లోనూ వారి పాత్ర కీలకంగా మారింది. సాంపిల్స్ కలెక్షన్ నుండి వచ్చిన ఆ ఫలితాలను గ్రామంలోని ప్రజలకు చేరవేయడం వరకు అన్ని విషయాల్లోనూ వారు కీలకంగా మారారు.

ఇప్పుడు ప్రభుత్వ మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయపరమైన అంశాల నుంచి మొదలు, ఇసుక, మద్యం సహా అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని వారు అధిష్టానానికి ఉప్పందిస్తున్నారు. అది కూడా క్షణాల్లో జరిగిపోతుంది.

ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని, సర్వేలను, ఇతర డేటాను వలంటీర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. చివరకు ఆయా పోలీస్ స్టేషన్లలో ఉండే కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు కూడా వలంటీర్ల ద్వారా గ్రామాలలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అనధికారిక వేగులుగా పనిచేస్తున్నారు గ్రామ వాలంటీర్లు.

అయితే వాలంటీర్లు చాలా సందర్భాల్లో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి తీవ్ర కళంకాన్ని తీసుకువస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. (అధికారిక వ్యవస్థలో ఈ వలంటీర్ల ప్రమేయం అనే విషయం తరువాత చర్చించుకుందాము)వారిని గాడిలో పెట్టడానికి జగన్ ఇప్పుడు మరోసారి పీకే టీం ని రంగంలోకి దింపారు.

టాప్ లెవెల్ లో పీకే టీం ఉంటుంది. ప్రతి మండలంలోనూ ఒక మండల స్థాయి అధికారిని వీరు నియమిస్తారు. ఆ మండలంలోని గ్రామా వాలంటీర్లంతా ఆ అధికారి కింద పనిచేయాలి. ఆ మండల స్థాయి అధికారి నేరుగా పీకే టీం తో టచ్ లో ఉంటాడు. పీకే టీం పూర్తిగా వారి పెర్ఫార్మన్స్ ను, గ్రామ వలంటీర్ల పనితీరును ట్రాక్ చేస్తారు.

మండల పరిధిలోని గ్రామ, సచివాలయ వలంటీర్ల పనితీరును పర్యవేక్షిస్తారు. వాలంటీర్ల నుంచి సమాచారం సేకరిస్తారు. వారి పనితీరు మెరుగు పరిచేందుకు పీకే టీం సభ్యులు శిక్షణ కూడా ఇస్తారు. ఈ మండల స్థాయి అధికారులను పీకే టీం నియమిస్తుంది. ఇప్పటికే ఈ సదరు నియమించిన మండల లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, వారికి సహకరించాలని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లకు జేసీల నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఇక ఇప్పుడు వైసీపీ పార్టీ విషయానికి వద్దాము. పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. క్యాడర్ లేదు. ఇప్పడు ఈ సమస్యలన్నిటికీ ఈ గ్రామా వాలంటీర్లు ఒక సింగల్ పాయింట్ సొల్యూషన్ గా కనబడుతున్నారు. ఎలాగూ వారు సానుభూతిపరులే. వారు అక్రమాలకు తెగబడకుండా వారిని పూర్తిగా కంట్రోల్ లో పెట్టి గనుక అందరికి అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను ఎటువంటి అవినీతి లేకుండా  అందవేసేలా చేయగలిగితే... పార్టీ బలోపేతమవుతుంది. ప్రభుత్వానికి ప్రజల్లో మంచి మార్కులు పడటం ఖాయం.

loader