పవన్ కల్యాణ్ భావసారూప్యత డొల్లతనం: ఆలోచనల్లోనే వైరుధ్యాలు

First Published 17, Jan 2020, 3:46 PM IST

కొన్ని విషయాలు చేదుగా ఉంటాయి, కానీ చెప్పక తప్పదు. చేదును దిగమింగి వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తే అది మేలు చేయవచ్చు. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ లక్షణం ఉందా అనేది ప్రశ్న. ఓ రాజకీయ నాయకుడికి స్పష్టమైన విధానం ఉండాలి. స్పష్టమైన ఆలోచనా సరళి ఉండాలి. తాను చేరదలుచుకున్న గమ్యానికి అది బాగా పనికి వస్తుంది.

కొన్ని విషయాలు చేదుగా ఉంటాయి, కానీ చెప్పక తప్పదు. చేదును దిగమింగి వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తే అది మేలు చేయవచ్చు. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ లక్షణం ఉందా అనేది ప్రశ్న. ఓ రాజకీయ నాయకుడికి స్పష్టమైన విధానం ఉండాలి. స్పష్టమైన ఆలోచనా సరళి ఉండాలి. తాను చేరదలుచుకున్న గమ్యానికి అది బాగా పనికి వస్తుంది. కానీ, పవన్ కల్యాణ్ ఓ దారి వెంట నడుస్తూ మధ్యలో మరో దారికి మళ్లుతున్నారు.

తనకు చెగువేరా ఆదర్శమని అంటారు. చెగువేరా కమ్యూనిస్టు. సమాజాన్ని మార్చడానికి సాయుధ పోరాటాన్ని అనుసరించినవాడు. పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ కొల్లలుగా వస్తున్నాయి. అందులో చెగువేరాకు బొట్టు పెట్టిన ఇమేజ్ ఒక్కటి. అదే సమయంలో తనకు గుంటూరు శేషేంద్ర శర్మ అభిమాన కవి అంటాడు. ఈ దేశం జెండాకు ఉన్నంత గర్వం తనకు ఉందని శేషేంద్ర శర్మ అన్నాడు. శేషేంద్ర శర్మ కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవాడే. దాన్ని చాలా మంది సాహితీవేత్తలు అంగీకరించకపోవచ్చు. కానీ తన సిద్ధాంతాన్ని గుంటూరు శేషేంద్ర శర్మ ఆచరణలో పెట్టిన దాఖలు లేవు.

వామపక్షాలతో పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాడు. సిపిఐ, సీపీఎంలతోనే కాకుండా బీఎస్పీ అధినేత మాయవతి కాళ్లు కూడా మొక్కాడు. సిపిఐ, సిపీఎంలది మార్క్సిస్టు సిద్ధాంతమైతే, మాయావతిది దళిత బహుజన దృక్పథం. ఇప్పుడు బిజెపితో ఆయన పొత్తు పెట్టుకున్నాడు. బిజెపితో తనకు భావసారూప్యత ఉందని చెప్పారు. వామపక్షాలు, బిజెపి పరస్పర విరుద్ధ భావజాలాలకు, సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అందువల్ల బిజెపితో పొత్తు పెట్టుకునే సమయంలో పవన్ కల్యాణ్ భావ సారూప్యత గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఆదర్శాలు మంచివే కావచ్చు. ప్రజలకు, మొత్తంగా సమాజానికి మేలు చేయాలనే సంకల్పం ఆయనకు లేదని చెప్పలేం. కానీ అనిర్దిష్టమైన ఆదర్శాలు రాజకీయాలకు పనికి రావు. అందుకు జయప్రకాశ్ నారాయణ పెట్టిన లోకసత్తానే నిదర్శనం. లోకసత్తా ఓ విఫల ప్రయోగమనే విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ అదే ప్రయోగాన్ని ఎంచుకున్నారు.

ప్రస్తుత రాజకీయాలు పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి చెప్పినట్లు చాలా కరుగ్గా ఉంటాయి. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణమైన విధానాలనే అనుసరించాలి. కొన్ని అయిష్టమైన పనులు కూడా చేయాలి. రాజకీయాలు శత్రువులను పెంచుతాయనేది చిరంజీవి అభిప్రాయం. ఆ రాజకీయాలను తట్టుకోలేకనే చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. రాజకీయాలకు దూరం జరిగారు. కానీ, పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల కొన్ని కఠినమైన, కఠోరమైన వాస్తవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డక్కామొక్కీలు తినాల్సి ఉంటుంది. మాటల్లో అలా ఉన్నానని చెబుతున్నారు గానీ చేతల్లో అది కనిపించడం లేదు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు అసలు సిసలు రాజకీయ నాయకుడు కాబట్టి భావసారూప్యత వంటి పెద్ద పదాలు వాడలేదు. వామపక్షాలను కాదని బిజెపితోనూ పొత్తును పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఆ పదం వాడలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏది అవసరమైతే ఆ మార్గం తొక్కడానికి సిద్ధంగా ఉండాలి. పవన్ కల్యాణ్ కూడా బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించే సమయంలో భావసారూప్యత గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేది.

పవన్ కల్యాణ్ బహుశా మార్క్సిజానికి, హిందూ సంప్రదాయాలకు మధ్య పొత్తు కుదిరించి కొత్త సిద్దాంతాన్ని ముందుకు తెస్తారేమో చూడాలి. మార్క్సిజాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారనే విమర్శ చాలా కాలంగా ఉంది. భారతదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారి ఆచరణ లేకపోవడం వల్లే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీల మనుగడ దెబ్బ తింటుందనే మాట ఉంది.

ఓ వైపు హైందవ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరో వైపు మార్క్సిజాన్ని కళ్లకు అద్దుకునే పవన్ కల్యాణ్ ఆలోచనా సరళిలోనే నిలకడ లేదనేది స్పష్టం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, తాను గమ్యం చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని ఎంచుకుని కష్టాలకు ఓర్చి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకుంటూ ముందుకు సాగితే ఎదురయ్యేది బహుశా వైఫల్యమే కావచ్చు. పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసును ఢీకొని గమ్యం చేరుకుంటాడా అనేది భవిష్యత్తులో తేలాల్సిందే.

loader