మండలి ఎన్నిక: ధర్మపురి సోదరుల మధ్య "కవిత" చిచ్చు
ధర్మపురి శ్రీనివాస్ తనయుల్లో ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతూ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. మరో తనయుడు ధర్మపురి సంజయ్ తెరాస లో ఉన్నారు. ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో కవితను ఎలాగైనా ఓడించాలని ధర్మపురి అరవింద్ పావులు కడుపుతుంటే... కవితను ఎలాగైనా గెలిపించుకొని తీరాలని ధర్మపురి సంజయ్ ప్రణాళికలను రచిస్తున్నారు.
శాసనమండలి ఎన్నికలు ఇప్పుడు యావత్ తెలంగాణాలో కాక రేపుతున్నాయి. పోటీలో నిలిచేవారి మధ్య వైరం ఉండడం సహజం కానీ.. తెలంగాణాలో ఇప్పుడు పోటీలో వారిరువురూ నిలబడకున్నప్పటికీ.... అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం ఎత్తులు పైఎత్తులు స్థాయిని కూడా దాటింది.
ఇంతకు ఏమిటా పోరు, ఎవరా నేతలు అనుకుంటున్నారా. ఆ ఇరువురు నేతలే నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ అతని సోదరుడు ధర్మపురి సంజయ్. వారిరువురి మధ్య చిచ్చు పెట్టిన ఎన్నిక నిజామాబాదు శాసనమండలి ఎన్నిక.
ధర్మపురి శ్రీనివాస్ తనయుల్లో ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతూ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. మరో తనయుడు ధర్మపురి సంజయ్ తెరాస లో ఉన్నారు. ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో కవితను ఎలాగైనా ఓడించాలని ధర్మపురి అరవింద్ పావులు కడుపుతుంటే... కవితను ఎలాగైనా గెలిపించుకొని తీరాలని ధర్మపురి సంజయ్ ప్రణాళికలను రచిస్తున్నారు.
వాస్తవానికి గతంలోనే ఈ శాసనమండలి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ... కరోనా లాక్ డౌన్దెబ్బకు అవి వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు మొదలవ్వడం, నేడు రాజ్యసభ ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా జరగడంతో శాసనమండలి ఎన్నికల వ్యవహారానికి ఊపు వచ్చింది.
సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాదు స్థానం నుంచి కల్వకుంట్ల కవిత పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఓటమితరువాత ఆమె అసలు బయట కనబడని లేదు. గత బతుకమ్మ సంబరాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. హుజూర్ నగర్ ఎన్నికల్లో సైది రెడ్డి అఖండ విజయం సాధించిన తరువాత కూడా ఆమె బయటకు వచ్చింది లేదు.
ఇక అప్పటి నుండి కవిత రాజకీయ భవిష్యత్తుపై ఎడతెగని చర్చ నడిచిన విషయం మనందరికీ సుపరిచితమే. కవితను తొలుత హుజూర్ నగర్ ఉపఎన్నికలోనే దింపుతారని ప్రచారం సాగింది. ఆతరువాత కొందరు ఉత్సాహవంతులైన పార్టీ ఎమ్మెల్యేలు తాము రాజీనామా చేసి అయినా తమ సీట్లో కవితను గెలిపించుకుంటామని అన్నారు.
ఇక ఆతరువాత ఆమెను రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. అవి కూడా హంబక్ అని తేలాయి. వీటిలాగానే కవితను శాసనమండలికి పంపించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారన్న చర్చలు కూడా మొదలయ్యాయి. అది కూడా వట్టి హంబక్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో... అనూహ్యంగా కవితను శాసనమండలి బరిలోకి దింపారు ముఖ్యమంత్రి కేసీఆర్.
గత ఎన్నికల్లో రిపీట్ అయిన తప్పులు రిపీట్ కాకూడదని కేసీఆర్ ఈసారి కృత నిశ్చయంతో ఉంది ధర్మపురి సంజయ్ ని రంగంలోకి దింపారు. సోదరుని వ్యూహాలకు అడ్డుకట్టవేస్తూ... ఆ వ్యూహానికి ప్రతివ్యూహం పన్నుతూ అడ్డుకట్ట వేస్తున్నారు.
ఈ నిజామాబాదు శాసనమండలి స్థానం స్థానిక సంస్థలది అవడంతో... ఇక్కడ స్థానిక సంస్థల నాయకులందరినీటర్స్ తనవైపుగా తిప్పుకుంటుంది తెరాస. ముఖ్యంగా మునిసిపల్ కౌన్సిలర్లను తెరాస లో చేర్చుకునేందుకు తెరాస నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
అందుకోసమే సంజయ్ ని రంగంలోకి దింపినట్టుగా చెబుతున్నారు. సంజయ్ బీజేపీ కార్పొరేటర్లందరికి గాలం వేస్తున్నాడు. ఇప్పటికే ఒక నలుగురు దాదాపుగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వారు తెరాస నేతలతో రాసుకు పూసుకొని తిరుగుతున్నారు. మరో పది మందికి కూడా సంజయ్ గళం వేస్తుండడంతో అరవింద్ రంగంలోకి దిగి, వారిని పార్టీ వీడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పాడు. వేచి చూడాలి నిజామాబాదు రాజకీయం ఎటువైపు దారి తీస్తుందో. చూడబోతుంటే అన్నదమ్ముల మధ్య చిచ్చయితే పెట్టినట్టుగా ఉంది.