లాక్ డౌన్ పొడిగింపు ప్రతిపాదన: కేసీఆర్ లెక్కలు ఇవీ!
లాక్ డౌన్ ముగియడానికి వస్తున్న తరుణంలో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు లాక్ డౌన్ ను ఒక వారం నుండి రెండు వారల పాటు పొడిగించాలని కోరారు.
కరోనా వైరస్ కి మందు ఇంకా లేకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ ఒక్కటే శరణ్యంగా ప్రకటించి ఈ మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ భగవంతుడ్ని పోరార్తిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల మంత్రమే లాక్ డౌన్ అయినప్పుడు, అగ్రరాజ్యాలను తలదన్నే వైద్యసేవలు మనవద్ద లేకపోవడంతో మనదేశం కూడా 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.
ఇలా లాక్ డౌన్ ముగియడానికి వస్తున్న తరుణంలో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు లాక్ డౌన్ ను ఒక వారం నుండి రెండు వారల పాటు పొడిగించాలని కోరారు.
కేసీఆర్ ఇలా కోరడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయినా, నేటి ఉదయం నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దగ్గరి నుండి మొదలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు అందరూ ఇదే పాత పాడుతున్నారు.
కేసీఆర్ రెండు వారల పాటు పొడిగించమని, మనదేశం ఈ కరోనా బారి నుండి బయటపడాలంటే ఇలా కరోనా వైరస్ లీకులనుఈ కట్ చేయడమే మార్గం అని పదే పదే చెప్పారు. ఆయన లాక్ డౌన్ ప్రారంభమయిన నాటి నుండి అదే బాటలో పయనిస్తున్నారు. ఇంటలిజెన్స్ అధికారుల నుండి డాక్టర్ల వరకు ప్రతి ఒక్కరి తోను సమావేశాలు నిర్వహిస్తూ, వారందరితో నిత్యం టచ్ లో ఉంటూ, పరిస్థితి చేయిదాటినా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఏకంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియాన్ని సిద్ధం చేసి ఉంచారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కేసీఆర్ వాస్తవానికి కొన్ని రోజుల కింద నిర్వహించుకొని ప్రెస్ మీట్లో ఏప్రిల్ 7వ తేదీ నాటికి తెలంగాణలో కేసులు నమోదు కాకపోవచ్చు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. కానీ అనూహ్యంగా మర్కజ్ నిజాముద్దీన్ ఘటన వల్ల ఒక్కసారిగా తెలంగాణలో కేసులు విపరీతం,గా పెరిగాయి. అయినా కూడా కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అన్ని విభాగాలను రంగంలోకి దింపారు.
అన్ని తానై ఢిల్లీ నుంచి వచ్చినవారందరిని పూర్తిగా వెదికి పట్టుకునేవరకు విశ్రమించలేదు. వారిని వారికి సంబంధించిన వారందరిని క్వారంటైన్ కి తరలించారు. వారు టిఫిన్ చేసిన టిఫిన్ షాపుల నుంచి వారు ప్రయాణించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వారి బోగీల్లో ఉన్నవారందరిని కూడా క్వారంటైన్ కి తరలించారు.
ఇలా దాదాపుగా 99.9 శాతం మందిని గుర్తించారు. వారందరు ఇప్పుడు ప్రభుత్వ కనుసన్నల్లో క్వారంటైన్ లలో, ఐసొలేషన్ వార్డుల్లో ఉన్నారు. ఇలా అంతా కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం రెండు వారల పాటు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఇలా కోరారు అనేది అందరి మనసుల్లోనూ మెదులుతున్న ఒక ప్రశ్న.
వాస్తవానికి కేసీఆర్ బలమైన ఒక ఆలోచనతోనే ఇలా లాక్ డౌన్ ని పొడిగించాలని కోరారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి వచ్చినవారందరిని, వారి సన్నిహితులను, కాంటాక్టులు అందరిని వెదికి పట్టుకున్నారు. వారందరిని ప్రస్తుతానికి క్వారంటైన్ లలో ఉంచారు.
ఇలా ఉంచినవారందరి క్వారంటైన్ కాలం కూడా మరొక 11 నుంచి 14 రోజుల్లో ముగుస్తుంది. అప్పటిలోపల లక్షణాలు బయటపడేవారికి పడతాయి. అప్పుడు వారిని ఆసుపత్రికి తరలిస్తారు. లక్షణాలు బయటపడక పోతే క్వారంటైన్ పూర్తయితే వదిలేస్తారు. ఈ తతంగం అంతా లాక్ డౌన్ లోనే పూర్తయితే ఈ తతంగం అంతా కూడా సజావుగా సాగిపోతాది. పెద్ద ఇబ్బందులుపడకుండానే వారిమీద ఒక కన్నేసి ఉంచొచ్చు.
అంతే కాకుండా ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ ఇలా ఎవరైతే కరోనా పాజిటివ్ కేసులున్న వారి ఇంటి చుట్టుప్రక్కల కిలోమీటర్ పరిధి వరకు వైద్య బృందాలతో కలిసి ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జలుబు, జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించి ఎవరికైన పాజిటివ్ ఉన్నదా లేదా అన్నది తెలుసుకుంటారు.
అప్పుడు వారినికనుక్కోవడం, అవసరమైతే ఆ ఒక్క ప్రాంతాన్ని పూర్తిగా లాక్ డౌన్ లోనే కొనసాగించవచ్చు కూడా. ఇలాంటి పనులు అన్ని చేయాలంటే కేసీఆర్ కి కనీసం ఒక పది రోజులైనా పడుతుంది. నిన్న సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం ఇంకో రెండు రోజుల్లో అన్ని టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వస్తాయి. మిగిలిన వారు క్వారంటైన్ లలో ఉంటారు. వారందరిని మేనేజ్ చేయడానికి కూడా తగిన సమయం కావలి.
ఈ అన్ని పనులు చేసినతరువాత కొన్ని రోజులపాటు ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక లాక్ డౌన్ ఎత్తేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉండవచ్చు. ఆయన ముందు నుండి కూడా ఇదే దార్శనికతతో ఉన్నారు. ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న కూడా దాని పర్యవసానాలు ఊహించలేము. ఇది కేసీఆర్ 14 రోజులు పొడిగించమని మోడీ గారిని కోరడానికి కారణం. చూడబోతుంటే కేంద్రం కనీసం ఒక వారం పాటైనా పొడిగించేవిధంగానే కనబడుతుంది.