ముద్రగడ కాడెత్తేయడం వెనక ఆంతర్యం: జగన్, చంద్రబాబు రాజకీయాలే
ముద్రగడ కాడినెత్తేయడం, బోండా ఉమా ప్రకటనల తరువాత కాపు నాయకులంతా అలెర్ట్ అయ్యారు. ముద్రగడ తిరిగి కాపు ఉద్యమాన్ని కొనసాగిస్తారని అంటున్నారు వారు. ఈ నేపథ్యంలో అసలు కాపు ఉద్యమానికి ఈ సమయంలో ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన కాపు నాయకులంతా కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాము.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ ఇప్పుడొక హాట్ టాపిక్. ఆయన రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయానని, ఇకమీదట కాపు ఉద్యమానికి నాయకత్వం వహించడం తనవల్ల కాదని కాడెత్తేసారు ముద్రగడ. తనను కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన ఆవేదన సైతం వ్యక్తం చేసారు.
కాపు ఉద్యమాన్ని ముద్రగడ వదిలేస్తున్నాను అనే ప్రకటన చేయగానే టీడీపీ నేత, మరో కాపు నాయకుడు బోండా ఉమా దాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేసారు. 13 జిల్లాలకాపు నాయకులతో కలిసి ఒక సమావేశం నిర్వహిస్తామని అన్నాడు. ముద్రగడను నాయకత్వం వదిలేయొద్దని బోండా ఉమా కోరినప్పటికీ....అందులోని మర్మమేమిటో ఆయన వ్యాఖ్యలను పూర్తిగా విన్నవారికందరికీ అర్థమయిపోతుంది.
ముద్రగడ ,కాడినెత్తేయడం, బోండా ఉమా ప్రకటనల తరువాత కాపు నాయకులంతా అలెర్ట్ అయ్యారు. ముద్రగడ తిరిగి కాపు ఉద్యమాన్ని కొనసాగిస్తారని అంటున్నారు వారు. ఈ నేపథ్యంలో అసలు కాపు ఉద్యమానికి ఈ సమయంలో ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన కాపు నాయకులంతా కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాము.
తాజాగా జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ప్రారంభించింది మొదలు ఈ దఫా కాపు ఉద్యమం ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ రెండు దఫాలు లేఖలు రాయడం, ఆ తరువాత జరిగిన సంఘటనల నేపథ్యంలో ఊపందుకుంది. ఆ తరువాతి ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లలో కాపులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మిగిలిన నోటిఫికేషన్ల విడుదలకు ముందే కాపు రేజర్వేషన్లపై తేల్చుకోవాలని యువత పట్టుబట్టడం అన్ని వెరసి కాపు ఉద్యమం ఈ తారాస్థాయికి చేరుకుంది.
ఇదిలా ఉంచితే.... ముద్రగడ కాడెత్తేయడంపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఆయన ఇప్పుడు కాపు ఉద్యమం నుండి తప్పుకోవడం అంటే జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది కలగకుండా కాపు తలనొప్పులు తలెత్తకుండా చూడడమే అని అంటున్నారు. ఆయన జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక, ఇబ్బంది కలిగించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అంటున్నారు.
అందుకు వారు కొన్ని ప్రూఫ్స్ ని కూడా చూపెడుతున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం పొలిటికల్ కెరీర్ ని వారు ఒక సారి పరిశీలించమని కోరుతున్నారు. వాస్తవానికి ముద్రగడ కెరీర్ ని పరిశీలిస్తే ఆయన టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలతో కూడా నడిచారు. రెండు పార్టీల తరుఫున కూడా గెలుపొందారు. ఉద్యమ నాయకుడన్న తరువాత అందరితో కలిసి పనిచేయడం తథ్యం. అలా అంటే కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ ఇద్దరితో కూడా కలిసి నడిచారు.
ఇక ప్రస్తుత ప్రతిపక్షాల ఆరోపణను గనుక పరిశీలిస్తే.... ఆయన టీడీపీ హయాంలో కాపు రేజర్వేషన్లపై గళమెత్తారు. అప్పట్లో తుని వద్ద రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పంటించిన ఘటన గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడును గద్దె దింపడం కోసం అలా చేసారు అనేది వారి వాదన.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆయన కనీసం కాపు రేజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదని, అయన ఒక రెండు మార్లు లేఖలు రాసి ఇప్పుడు ఏకంగా కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్టు చెప్పడం జగన్ సర్కారుకు మేలు చేయడమే అని అంటున్నారు.
ముద్రగడ వర్గం వారు వాదిస్తున్న అంశం ఏమిటంటే.....జగన్ ఎలాగూ రేజర్వేషన్లను ఇవ్వడం లేదుఅనే విషయాన్నీ చెప్పాడు కాబట్టి జగన్ ని అడిగి ఏం ప్రయోజనం అని అంటున్నారు. జగన్ మానిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి ఇవ్వరు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
దీనిపైన్నే ఇప్పుడు కొందరు కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేనిఫెస్టోలోని అంశంగా కాకుండా కాపుల ఆత్మగిఉరవ అంశంగా దీన్ని పరిగణించాలని వారు కోరుతున్నారు. పద్మనాభం అనే నాయకుడి నేతృత్వంలో అందరం కలిసి పోరాడుదామని అంటున్నారు. జగన్ మానిఫెస్టోలో లేని అంశాలను అమలు చేస్తున్నారు. ఉన్న అంశాలను తొలిగిస్తున్నారని అంటున్నారు. రాజధాని అంశాన్ని అందుకు ఉదాహరణగా చూపెడుతున్నారు.
రాష్ట్రంలో తెలంగాణ నుంచి విడిపోయాక 16 శాతంగా ఉన్న కాపులు ఇప్పుడు 25 శాతం జనాభాకు చేరుకున్నారు. వారి సామాజికవర్గం ఇప్పుడు సంఖ్యాపరంగా కూడా బలంగానే ఉన్నప్పుడు రాజకీయంగా పవర్ సాధించకపోవడంపై కాపులు అసంతృప్తిగా ఉన్నారు.
రాజకీయంగా అటుంచితే ఇప్పుడు ఉద్యోగాల్లోనయినా తమకు ఒకింత మొబిలిటీ దొరికి ఆర్ధిక స్థిరత్వంవైపుగా వెళ్లగలుగుతామనేది వారి వాదన. కాపుల్లో వ్యవసాయ భూములు కలిగిన ఆసాములు తక్కువ. రైతుకూలీలు, సన్నకారు రైతులు అధికం. కాపులు కమ్మలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే వారు రేజర్వేషన్ల కోసం పట్టుపడుతున్నారు.
ముఖ్యంగా కాపు యువత ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. కాపులకు రేజర్వేషన్లను సాధించుకునేందుకు వారంతా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఉద్యమం ఇప్పుడు ఏ రాజకీయ రంగు పులుముకున్న కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. జగన్ నోటిఫికేషన్ల భర్తీ నేపథ్యంలో ఇది మరింతగా ఉధృతమవడం తథ్యం.