జార్ఖండ్ లో బిజెపి ఓటమి: కేసీఆర్, జగన్ లకు ఊరట

First Published 25, Dec 2019, 3:00 PM

జార్ఖండ్ ఎన్నికల ఫలితం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు కాస్త  ఊరట అందించింది. ఈ రాష్ట్రాల్లో బిజెపి చాపకింద నీరులా పాకుదామన్న ప్రయత్నాలకు జార్ఖండ్ ఫలితం అడ్డుకట్టలా నిలిచే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల  సీఎంలు జగన్, కేసీఆర్ లకు మంచి ఊరట లభించినట్లయ్యింది.  

హైదరాబాద్: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఓటమితో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాస్తా ఊరట లభించినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కుని బలం పుంజుకుందామనే వ్యూహం నుంచి బిజెపి వెనక్కి తగ్గవచ్చునని భావిస్తున్నారు. దాంతో కేసీఆర్, జగన్ లకు ఊరట లభిస్తుందని అంటున్నారు. (Jagan, KCR)

తనకు భారీగా బలం ఉన్న ఉత్తర భారతదేశానికి చెందిన ఐదు రాష్ట్రాల్లో బిజెపి అధికారం కోల్పోయింది. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల బలం వల్ల బిజెపి బలం పుంజుకోలేకపోతోంది. దాంతో భవిష్యత్తులో వాటిపై ఆధారపడాల్సిన పరిస్థితి బిజెపికి వచ్చిందని అంటున్నారు.  (Amit Shah)

వచ్చే ఏడాది దాదాపు 80 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. వారిలో ఎక్కువ మంది బిజెపికి చెందినవారే. దానివల్ల రాజ్యసభలో బిజెపి బలం మరింత తగ్గే అవకాశం ఉంది. టీఆర్ఎస్, వైసిపీ బలాలు పెరుగుతాయి. దాంతో రాజ్యసభలో ఆ రెండు పార్టీల మద్దతు బిజెపికి చాలా అవసరం. (KCR< Jagan)

ఆ పరిణామాల నేపథ్యంలో కెసీఆర్, జగన్ ల పట్ల బిజెపి తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి బిజెపి ప్రయత్నాలు సాగించడం ప్రారంభించింది. రెండు అధికార పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారాలని చూసింది. అయితే, తెలంగాణ బిజెపి కాంగ్రెసు, ఏపీలో తెలుగుదేశం బలంగా ఉన్నాయి.

దానికితోడు, వచ్చే లోకసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెసును ఎదుర్కోవడానికి బిజెపికి టీఆర్ఎస్, వైసీపీల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ఏపీలో బిజెపికి ప్రత్యామ్నాయం ఉంది. పవన్ కల్యాణ్ జనసేన, చంద్రబాబు టీడీపీలతో కలిసి వైసీపీని ఎదుర్కోవడానికి బిజెపి ప్రయత్నించవచ్చు.

తెలంగాణ, ఏపీలకు సంబంధించిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి.బిజెపికి మద్దతు ఇవ్వడానికి వైసీపీ, టీఆర్ఎస్ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తేనే బిజెపితో కలిసి పనిచేస్తామని వైసిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. అయితే, కేసీఆర్, జగన్ అంశాలవారీగా బిజెపికి కేంద్రంలో మద్దతు ఇస్తున్నారు.

loader