చంద్రబాబు టీడీపీకి జగన్ అసలుకే ఎసరు, వారసత్వానికీ గండి

First Published 23, Jun 2020, 7:10 PM

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కి ఒకింత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందంటే... అది అమరావతి ప్రాంతం నుండే. ఆ రాజధాని రైతుల ఉద్యమమే ఒకరకంగా చతికిలపడ్డ టీడీపీకి ఊపిరిలు ఊదింది. ఆ ఉద్యమాన్ని పట్టుకొనే టీడీపీ రాజకీయ యవనికపై మరల నిలబడింది.

ఆంధ్రప్రదేశ్ లో అందరూ అనుకుంటున్నట్టే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజనపై ఫోకస్ పెట్టారు. ఎప్పటినుండో అందరూ అనుకుంటున్నట్టే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయడానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.

తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 25 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పటినుండో కూడా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని జగన్ సర్కార్ చెబుతూనే ఉంది. ఎప్పటినుండో ఊరిస్తున్న ఈ విషయానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది.

పరిపాలనావికేంద్రీకరణ పేరుతో ఎప్పటినుండో జగన్ మోహన్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మూడు రాజధానుల ఏర్పాటులో ఈ జిల్లాల విభజన ఒక ముందడుగుగా చూడవలిసి ఉంటుంది.

అమరావతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆ ప్రాంత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రజలు, రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమాలను చేస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ వల్ల నిషేధాజ్ఞలు అమల్లో ఉంది నిరసనలు బయటకు కనబడం లేదు కానీ... అక్కడ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి.

ఇక ఈ జిల్లాల విభజనను జగన్ తనకు అనుకూలంగా, రాజధాని ప్రాంత రైతులను శాంతింపజేయడానికి, టీడీపీని భూస్థాపితం చేయడానికి ఒకటే ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు.

ఇక ఈ జిల్లాల విభజనను జగన్ తనకు అనుకూలంగా, రాజధాని ప్రాంత రైతులను శాంతింపజేయడానికి, టీడీపీని భూస్థాపితం చేయడానికి ఒకటే ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు.

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కి ఒకింత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందంటే... అది అమరావతి ప్రాంతం నుండే. ఆ రాజధాని రైతుల ఉద్యమమే ఒకరకంగా చతికిలపడ్డ టీడీపీకి ఊపిరిలు ఊదింది. ఆ ఉద్యమాన్ని పట్టుకొనే టీడీపీ రాజకీయ యవనికపై మరల నిలబడింది.

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కి ఒకింత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందంటే... అది అమరావతి ప్రాంతం నుండే. ఆ రాజధాని రైతుల ఉద్యమమే ఒకరకంగా చతికిలపడ్డ టీడీపీకి ఊపిరిలు ఊదింది. ఆ ఉద్యమాన్ని పట్టుకొనే టీడీపీ రాజకీయ యవనికపై మరల నిలబడింది.

అలాంటి ఈ రాజధాని విషయాన్ని గనుక చల్లార్చగలిగితే ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటుగా, ప్రతిపక్ష టీడీపీని తుడిచిపెట్టేయొచ్చు. ఇప్పటికే టీడీపీ అరెస్టుల వ్యవహారం, నాయకులు పార్టీని వీడడం ఇలాంటి సంఘటనల వల్ల కకావికలమై ఉంది. ఇప్పుడు టీడీపీ పై జగన్ మరో అస్త్రాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు.

జిల్లాల విభజన ఖాయం అని తేలింది. ఇప్పుడు జిల్లాల పేర్లద్వారా టీడీపీ వారసత్వాన్ని కూకటివేళ్ళతోసహా పెకలించివేసే ప్రయత్నాన్ని చేస్తున్నాడు జగన్. కృష్ణ జిల్లాను మచిలీపట్టణం, విజయవాడ అని రెండు జిల్లాలుగా పార్లమెంటు నియోజికవర్గాల వారీగా విభజించనున్న విషయం తెలిసిందే.

కృష్ణాజిల్లాలోనే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించారు. ఆయన జన్మించిన నిమ్మకూరు ఊరు జిల్లాల విభజన సమయంలో మచిలీపట్టణం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఆ జిల్లాకు ఎన్టీఆర్ అనే పేరును పెట్టాలని అనుకుంటున్నారు జగన్. అలానే అరకు ప్రాంతానికి మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పేరు మీద నామకరణం చేయాలనీ అనుకుంటున్నారు.

టీడీపీ ఇంకా అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ వారసత్వ పునాదుల మీదే నడుస్తుంది ఇప్పుడు ఆ పునాదులను కదిలించాలని చూస్తున్నాడు జగన్. రాజధాని ప్రాంతంలో మిగిలిన అన్ని నిర్మాణాలను పూర్తిచేసి అమరావతిని తాము చిన్నచూపు చూడడంలేదని ఒక సంకేతాన్ని ఇవ్వాలనుకుంటుందే. అందుకోసమనే మంత్రుల ప్రకటనలు, పర్యటనలు.

ఎన్టీఆర్ పేరుతోనే టీడీపీ వారసత్వానికి గండికొట్టడానికి జగన్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కనబడుతుంది. చూడాలి ఈ ప్లాన్ ఎంతమేర సఫలీకృతమవుతుందో...! అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.

loader