చంద్రబాబు విలవిల: కేసుల చిక్కుల్లో కొమ్ములు తిరిగిన నేతలు
ఆంధ్రాప్రదేశ్ లో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగనున్నాయనే సంకేతాలు మనకు కనబడుతున్నాయి. జగన్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ ఎంక్వయిరీ అనడం దగ్గరి నుండి... రోజా అచ్చెన్నాయుడు అరెస్టు కేవలం ట్రైలర్ మాత్రమే అనడం వరకు అనేక సంకేతాలు మనకు కనబడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికళకు మరో నాలుగేళ్ల దూరం ఉన్నప్పటికీ... సమీపంలో ఎన్నికలున్న పశ్చిమబెంగాల్ కన్నా రాజకీయ వాతావరణం హీట్ ఎక్కిపోయి ఉంది. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ అరెస్టులతో అసలే కాకమీదున్న ఏపీ రాజకీయం అట్టుడికిపోతుంది.
ఆంధ్రాప్రదేశ్ లో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగనున్నాయనే సంకేతాలు మనకు కనబడుతున్నాయి. జగన్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ ఎంక్వయిరీ అనడం దగ్గరి నుండి... రోజా అచ్చెన్నాయుడు అరెస్టు కేవలం ట్రైలర్ మాత్రమే అనడం వరకు అనేక సంకేతాలు మనకు కనబడుతున్నాయి.
అరెస్టులు స్కాములు చేసినవారిని కదా అరెస్ట్ చేస్తుంది, అని అనొచ్చు. అది నిజమే. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారిలో అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కాం లో, జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడు అస్మిత రెడ్డిని నకిలీ ధ్రువపత్రాలు చూపించారు అనే కారణంతో.
కానీ ఇలాంటి ఆరోపణలు ఉన్న ఎందరో నేతలు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు వైసీపీలోనో టీడీపీలోనే చేరిపోతే.... పూర్తిగా ఈ కేసులు ఉండవు. టీడీపీలో కేసులు ఎదుర్కున్న సీనియర్లు బీజేపీలోకి వెళ్లి ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఈ అరెస్టులు రైటా రాంగా అనే విషయాలను పక్కకుపెడితే... రానున్న రోజుల్లో మరింతమంది నేతల చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకోనుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదయింది( ఆయన తప్పు చేసి ఉంటే..అతడికి కఠిన శిక్ష పడవలిసిందే). ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఎవరెవరు చంద్రబాబుకి దగ్గరగా ఉన్నారు. ఎవరెవరి చుట్టూ ఉచ్చు బిగుసుకోనుందనే విషయం ఒకసారి చూద్దాం.
అచ్చెన్నాయుడు
పైల్స్ ఆపరేషన్ జరిగిందని చెబుతున్న కూడా వినకుండా ఆయనను అరెస్ట్ చేసి దాదాపుగా 600 కిలోమీటర్లు ప్రయాణం చేపించారు. ఆయనకు ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ ఆగడంలేదు. మరోసారి సర్జరీ కూడా చేస్తామని అంటున్నారు. ఆయన ఈఎస్ఐ స్కాం లో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నారని అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి
తండ్రి తనయులు ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సుల్లో బిఎస్ 3 వాహనాలను బిఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేపించారని, వాటిని వేరే వారికి కూడా అమ్మారని వారిపై అభియోగాలు నమోదవడంతో వారిని అరెస్ట్ చేసారు.
చింతమనేని ప్రభాకర్
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి బడా అరెస్ట్ అంటే చింతమనేని ప్రభాకర్ అని చెప్పవచ్చు. దాదాపుగా రెండు నెలల పైచిలుకు రోజులు ఆయన జైలు లో ఉన్నారు. ఆ తరువాత తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్ కి నిరసన తెలుపుతుండగా మరోసారి అరెస్ట్ చేసారు.
నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప, టీడీపీ హయాంలో డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసారు. ఆయనపై తాజాగా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.
యనమల రామకృష్ణుడు
టీడీపీ సీనియర్ నేత మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మీద కూడా అట్రాసిటీ కేసు నమోదయింది. యనమల, చినరాజప్ప ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనంతలక్షి కుమారుడి పెళ్ళికి హాజరయినందుకు కేసులు నమోదయ్యాయి. అనంతలక్ష్మి తన కుమారుడికి దొంగతనంగా రెండవపెల్లి చేయాలనీ చూసిందని ఆమె కొడుకు, పెళ్ళికొడుకు అయిన రాధాకృష్ణ మొదటి భార్య పోలీసులను తీసుకొని అక్కడకు చేరుకుంది. ఆ పెళ్ళికి హాజరయినందుకు వీరిరువురిపై కేసు నమోదయింది. అతడి మొదటి భార్య ఈ ఇద్దరు మాజీ మంత్రులపై తనను అడ్డుతొలిగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో అనంతలక్ష్మికి సహకరిస్తున్నారని కేసు పెట్టింది.
అయ్యన్నపాత్రుడు
తనను అసభ్యకరంగా దుర్భాషలాడారని అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 354a,500,504,506,509,505b సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్నపాత్రుడిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి.
కాగా, మున్సిపల్ కమిషనర్ ను దూషించిన అయ్యన్నను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేశాయి. ఆయన ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు.