వల్లభనేని వంశీకి కొత్త సెగ: వైఎస్ కు సన్నిహితుడు, జగన్ కు గన్నవరం చిక్కులు

First Published 28, Jul 2020, 12:37 PM

వల్లభనేని వంశీ ఎంట్రీని అడ్డుకున్న యార్లగడ్డకు జగన్ కృష్ణ జిల్లా సహకార బ్యాంకు  చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. యార్లగడ్డ కు నామినేటెడ్ పదవి దక్కటంతో తనకు ఇక లైన్ క్లియర్ అని వంశీ అనుకుంటున్న తరుణంలో దుట్టా రామచంద్రరావు అనూహ్యంగా తెరపైకి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ హాట్ గానే ఉంటాయి. ఎప్పటికప్పుడు నిత్య నూతన విషయాలు, వ్యవహారాలు వివాదాలతో..... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జర్నలిస్టులకు అవసరమైన సరంజామాని, ప్రజలకు అవసరమైన వినోదాన్ని అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది.

ఇప్పుడు తాజాగా గన్నవరం నియోజకవర్గ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ ని వీడి అనధికారికంగా వైసీపీలో చేరడంతో సహజంగానే ఆ నియోజకవర్గ విషయాలపై ఆసక్తి అధికం. ఇప్పుడు తాజాగా అక్కడ వైసీపీలో వంశీకి ఎదురవుతున్న ఇబ్బందులతో... అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి

వైసీపీలోకి పరోక్ష ఎంట్రీ ఇచ్చిన గన్నవరంలో గ్రౌండ్ సిద్ధం చేసుకుందామని భావించాడు. తొలుత వంశీకి యార్లగడ్డ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. యార్లగడ్డ గత ఎన్నికల్లో వంశీకి గట్టి పోటీనే ఇచ్చాడు. వంశి స్వల్ప మెజారిటీతో మాత్రమే అక్కడ విజ్జయం సాధించాడు.

వంశి పార్టీలోకి వస్తున్నాడన్న ఊహాగానాలు రాగానే యార్లగడ్డ తీవ్రంగా వ్యతిరేకించిన వైషయం తెలిసిందే. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆయన అనుచరులు ఆందోళన చేయడం అన్ని తెలిసినవే! ఆ తతంగం ఒక రెండు మూడు రోజులపాటు హై డ్రామాను తలపించింది కూడా.

ఇంతలా వల్లభనేని వంశీ ఎంట్రీని అడ్డుకున్న యార్లగడ్డకు జగన్ కృష్ణ జిల్లా సహకార బ్యాంకు  చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. యార్లగడ్డ కు నామినేటెడ్ పదవి దక్కటంతో తనకు ఇక లైన్ క్లియర్ అని వంశీ అనుకుంటున్న తరుణంలో దుట్టా రామచంద్రరావు అనూహ్యంగా తెరపైకి వచ్చారు.

పదేళ్ల నుంచి తాను పార్టీ జెండా మోస్తున్నట్లు ప్రకటించిన దుట్టా...  ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించేది లేదని అన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి మాదిరిగానే కొత్తగా చేరిన వారు కూడా పార్టీ కోసం పనిచేయాలని, అంతే కాని పెత్తనం చేస్తే సహించేది లేదని వంశీని ఉద్దేశించి హెచ్చరించారు.

ఎవరు ఈ దుట్టా..?

దుట్టా రామచంద్రరావు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. జగన్ పార్టీ పెట్టక వచ్చి చేరి పార్టీలోనే కొనసాగుతున్నాడు. జగన్ వెన్నంటే ఉన్నాడు. 2014లో గన్నవరం నుండి వైసీపీ టికెట్ పై పోటీ చేసి వంశీ చేతిలో ఓటమి చెందాడు.

2019 ఎన్నికలప్పుడు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని గ్రహించి దుట్టా పక్కకు తప్పుకున్నాడు.(దుట్టా కాపు సామాజికవర్గ నేత) యార్లగడ్డకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు యార్లగడ్డ ఓటమి చెందినప్పటికీ... వైసీపీ అధికారంలోకి రావడంతో మరోసారి నియోజకవర్గంలో యాక్టీవ్ కావాలని అనుకుంటున్నాడు దుట్టా.

దుట్టా ఇప్పుడు యాక్టీవ్ అవ్వాలని చూడడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది. దుట్టా అల్లుడు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన డాక్టర్ శివ భరత్ రెడ్డి గన్నవరం పై కన్నేశారు. ఆయన అక్కడ ఇప్పటికే అందరిని కలుపుకుంటూ, వంశి వ్యతిరేకులని ఏకం చేసే పనిలో పడ్డారు.

స్వతహాగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన భరత్ రెడ్డికి వైఎస్ కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఆయన అక్కడ రాజకీయ సమీకరణాల ఆధారంగా ముందుకు సాగుతున్నాడు. వైసీపీ అభిమానులను తన వైపుగా తిప్పుకునేందుకు మామ పాత పరిచయాలన్నిటినీ వాడుతున్నాడు.

ఇకపొతే గన్నవరంలో ఉప ఎన్నికలు అని ఎప్పటినుండో కూడా వార్తలు వినబడుతున్నప్పటికీ... వార్తలు రావడం, మరల కొద్ది రోజులకు అవి అంతర్ధానమవడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో దుట్టా తన వర్గీయులతో కలిసి గన్నవరం ఉప ఎన్నిక జరిగితే... ఆ టికెట్ తనకే ఇవ్వాలని పెద్దిరెద్దుని కలిసినట్టుగా తెలుస్తుంది.

భరత్ రెడ్డి వర్గీయులు గన్నవరం అంతటా కూడా ఉపఎన్నికల్లో వైసీపీ టికెట్ తమకే అనే మాటను జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వని వంశి, దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేకుండా ఉండిపోయాడు. వంశి వ్యతిరేక వర్గాన్ని ఏకం చేస్తూ, టికెట్ తమకే అని ప్రచారం చేసుకుంటూ భరత్ రెడ్డి వర్గీయులు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

మరోపక్క వంశీని సైతం వైసీపీ పక్కకు పెట్టలేని స్థితి. అలాగని దుత్తను సైడ్ చేయలేరు. అల్లుడి రాజకీయ భవితవ్యం కోసం, అల్లుడిని రాజకీయంగా నిలబెట్టాలని దుట్టా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కి ఈ వ్యవహారం ఒక తలనొప్పిగా తయారయింది.

గన్నవరంలో ఉప ఎన్నిక నిర్వహిస్తే, ఒకవర్గం ఇంకో వర్గానికి ఎంతమేర సహకరిస్తారు అన్న విషయం అర్థం కాకపోబట్టే జగన్ అక్కడ ఉప ఎన్నికపై ఎటు తేల్చలేకపోతున్నట్టుగా తెలియవస్తుంది. చూడాలి జగన్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో..!

loader