వారిద్దరి ఖాళీల భర్తీపై జగన్ ఆలోచన: విడదల రజని, రోజాలకు వరం?

First Published 25, Jun 2020, 7:11 AM

రాజ్యసభకు ఎన్నికైన నలుగురిలో పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణల గురించి ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ లో చర్చించుకుంటున్నారు. వారు రాజ్యసభకు వెళ్లడం గురించి కాకుండా... వారు రాజ్యసభకు వెళితే ఖాళీ అయ్యాయి మంత్రి పదవుల గురించి చర్చించుకుంటున్నారు అందరూ.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో ట్విస్టు, పూటకో మలుపులతో హాట్ హాట్ గా సాగుతోంది. అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారం నడుస్తుండగానే, రమేష్ కుమార్ వ్యవహారం, అది కొనసాగుతుండగానే రఘురామకృష్ణమరాజుకు నోటీసులు. అన్ని వెరసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ గురూ అంటున్నారు!

ఈ అన్ని వ్యవహారాల మధ్య ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు ముగిసాయి. రాజ్యసభకు ఎన్నికయ్యే నలుగురి పేర్లను జగన్ ఎప్పుడో ఫైనలైజ్ చేసినప్పటికీ... కరోనా వైరస్ వల్ల వీరి ఎన్నిక వాయిదా పడింది. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో వారు రాజ్యసభకు అధికారికంగా ఎన్నికయ్యారు.

ఈ రాజ్యసభకు ఎన్నికైన నలుగురిలో పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణల గురించి ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ లో చర్చించుకుంటున్నారు. వారు రాజ్యసభకు వెళ్లడం గురించి కాకుండా... వారు రాజ్యసభకు వెళితే ఖాళీ అయ్యాయి మంత్రి పదవుల గురించి చర్చించుకుంటున్నారు అందరూ.

ఇక ఆశావాహులకైతే కొదవే లేదు. అందరూ కూడా తమకు ఒక్క అవకాశం అంటూ అధినేతను అడుగుతూనే ఉన్నారు. అధినేత దృష్టిలో పడడానికి విశ్వప్రయత్నమే చేస్తున్నారు. దీనితో ఈ పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకులు సామాజికవర్గాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా లెక్కలుగడుతున్నారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చెందినవారే. జగన్ తన మంత్రివర్గంలో అన్ని కులాలకు సమప్రాధాన్యత ఇచ్చారు కులసమీకరణల ఆధారంగానే పూర్తి మంత్రివర్గ కూర్పు జరిగింది.

ఇప్పుడు ఇదద్రు మంత్రులు బయటకు వెళుతుండడంతో.... ఎమ్మెల్యేలు తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. కులాలవారీగా ఎవరి సమీకరణాలు వారు వేసుకుంటున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి అని చర్చించుకునేముందు ఎవరెవరు ఆశావహులు ఉన్నారో చూద్దాము.

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, నెల్లూరు జిల్లా పెద్దారెడ్లు ( ఆనం,కోటంరెడ్డి,నల్లపురెడ్డి), మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, అంబటి రాంబాబుల పేర్లు  వినబడుతున్నాయి.

jagan

jagan

వీరిరువురికి మంత్రిపదవులు ఇవ్వడానికి కారణం.... వైఎస్ కుటుంబానికి వారు నమ్మకస్తులుగా అన్ని పరిస్థితుల్లోనూ జగన్ తో పాటుగా ఉన్నారు. మోపిదేవి జైలుకు కూడా వెళ్ళాడు అందుకే వారి మంత్రి పదవులకు గండం వచ్చినా వారిని రాజ్యసభకు పంపిస్తున్నాడు.

పిల్లి సుభాష్ చంద్ర బోస్ ని గనుక తీసుకుంటే... ఆయన రామచంద్రపురం నియోజకవర్గం నుండి గతంలో గెలిచారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లానుండి పినిపి విశ్వరూప్, తానేటి వనిత, కురసాల కన్నబాబు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించకపోయినా, జిల్లాకు ఒక మంత్రి బెర్తు పోయినా ఇప్పటికిప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు ఏమి మారవు.

ఇక మోపిదేవి విషయానికి వస్తే... ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. గుంటూరు జిల్లా నుండి ఇప్పుడు మోపిదేవి వెళ్లిపోవటంతో ఒక్కరు మాత్రమే మంత్రి ఉంటారు. ప్రత్తిపాడు నుండి మేకతోటి సుచరిత హోమ్ మంత్రిగా కొనసాగుతున్నారు. దానికి తోడు గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు గుంటూరు జిల్లా నుండి ఒకరికి మంత్రి పదవిని జగన్ ఖచ్చితంగా ఇచ్చే ఆస్కారం ఉంది.

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఈ మోపిదేవి ఖాళీ చేసిన బెర్తు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కూడా జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు, ఆయన కంట్లో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒకరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఒకరు. ఆయన మాచర్ల పరిధిలోని అన్ని స్థానాలను పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలనీ తీవ్రంగానే ప్రయత్నం చేసి జగన్ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నం చేసారు. బోండా ఉమా, బుద్ధ వెంకన్నలపై దాడి జరిగింది కూడా ఇక్కడే.

ఇక మరో వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. జగన్ తొలి కేబినెట్ లోనే మంత్రి పదవిని ఆశించారు ఆళ్ళ. నారా లోకేష్ ను ఓడించిన జైంట్ కిల్లర్ గా రెండవసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు ఆళ్ళ. అయినా ఆ ఛాన్స్ మిస్ అయింది. కోర్టులో కేసులు వేయడం మొదలు ప్రజావేదికను కూల్చడం వరకు అన్ని తానై ముందుంటున్నాడు ఆర్కే. ఈసారి అమరావతి వివాదం కూడా తోడవడంతో ఆ విధంగానయినా ఆ ప్రాంతం వాడిని కాబట్టి మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నాడు. అంతే కాకుండా జగన్ ఆర్కేకు మంత్రిపదవి ఇస్తాను అని మాటిచ్చారు.

కాకపోతే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఆయన అన్న అయోధ్య రామిరెడ్డికి తాజాగా జగన్ రాజ్యసభ బెర్తును ఇచ్చారు. ఇలా రాజైసభ బెర్తును కట్టబెట్టడం వల్ల ఏమైనా తన అమాత్య పదవికి భంగం కలుగుతుందేమోనని చిన్న టెన్షన్ మాత్రం పడుతున్నారు.

ఇక మూడవ వ్యక్తి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని. ఈమె కూడా ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించి జైంట్ కిల్లర్ గానే అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఈమె చాలా తెలివిగా ఎప్పటి నుండో పావులు కదుపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ప్రభలను ఏర్పాటు చేసే విషయం తెలిసిందే. ఆ ప్రభల విషయంలో ఆమె టీడీపీ వారిని బలంగా టార్గెట్ చేసారు అని అంటున్నారు. తద్వారా ఆమె జగన్ దృష్టిని ఆకర్షించారు. జగన్ దృష్టిలో బలమైన ముద్రని వేసుకోగలిగారు.

ఇక పిల్లి ఖాళీ చేస్తున్నది కేవలం మంత్రి పదవి మాత్రమే కాదు. అది ఉపముఖ్యమంత్రి పదవి కూడా. జగన్ తన ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను సామాజిక వర్గీకరణల ఆధారంగానే తీసుకున్నారు. ఇప్పుడు పిల్లి బయటకు వెళ్లడంతో బీసీ ఉపముఖ్యమంత్రి పోస్టు ఖాళీ అవుతుంది. దానితో విడదల రజిని తనకు మంత్రి పదవి గ్యారంటీ అని సంతోష పడుతున్నారు. ఆమె బీసీ అవడం, గుంటూరు జిల్లాకు చెందిన నేత అవడం వల్ల తనకు పదవి ఖాయం అని అంటున్నారు. పోటీ పడుతున్న మిగిలిన వారంతా అగ్రవర్ణాలు కావడంతో ఆమె తనకు లైన్ క్లియర్ అని భావిస్తున్నారట.

ఇది గుంటూరు జిల్లా పరిస్థితి. ఇక ఖాళీ అవుతున్న మరో మంత్రి పదవి కోసం రోజా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆమెకు జగన్ కు ఇప్పటికే సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమెఅసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని బాగానే కార్నర్ చేసింది. మంత్రివర్గం ఏర్పడేటప్పుడే రోజాకు మంత్రిపదవి గ్యారంటీ అని చర్చ జరిగింది. కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆమెకు లభించలేదు.

తొలుత ఒకింత గుర్రుగా ఉన్నట్టు అనిపించినా జగన్ ను కలిసి ఆ తరువాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఆమెకు ఇచ్చిన తరువాత ఆమె కొంత శాంతించింది. మంత్రి పదవి కోసం తన ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టేసింది కూడా. ఇక మిగిలిన వారంతా తమ తమ ప్రయత్నాలను చేసుకుంటున్నారు.

పిల్లి సుభాష్ చంద్ర బోస్ స్థానాన్ని కూడా బీసీ తోనే నింపాలి అనుకుంటే.... తమకు అవకాశం లభిస్తుందని మరికొందరు లెక్కలు వేసుకుంటున్నారు.

loader