త్వరలో అందుబాటులోకి జైకోవ్-డి.. 12-18 యేళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. !
గుజరాత్ కేంద్రంగా ఉన్న జైడస్ క్యాడిలా సంస్థ కరోనాను ఎదుర్కొనేందుకు డీఎన్ఏ సాంకేతికతో ‘జైకోవ్-డి’ టీకాను తయారు చేసింది. ఇది మూడు డోసుల టీకా. ఇటీవలే 28 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి.

కరోనాను అంతం చేసేందుకు విస్తృత టీకాలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నా టీకా దిగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

అతి త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం కంపెనీ గురువారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డిసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.

అతి త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం కంపెనీ గురువారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డిసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.

గుజరాత్ కేంద్రంగా ఉన్న జైడస్ క్యాడిలా సంస్థ కరోనాను ఎదుర్కొనేందుకు డీఎన్ఏ సాంకేతికతో ‘జైకోవ్-డి’ టీకాను తయారు చేసింది. ఇది మూడు డోసుల టీకా. ఇటీవలే 28 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి.

గుజరాత్ కేంద్రంగా ఉన్న జైడస్ క్యాడిలా సంస్థ కరోనాను ఎదుర్కొనేందుకు డీఎన్ఏ సాంకేతికతో ‘జైకోవ్-డి’ టీకాను తయారు చేసింది. ఇది మూడు డోసుల టీకా. ఇటీవలే 28 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి.

మూడో దశలో 12 నుంచి 18 ఏళ్ల వయసున్న వెయ్యి మందిపై కూడా ఈ టీకాను ప్రయోగించారు. ఈ ప్రయోగాల ఫలితాలతో నేడు డిసీజీఐకు దరఖాస్తు చేసుకుంది.

ఈ అధ్యయనం "దేశంలో COVID-19 సెకండ్ వేవ్ పీక్ లో ఉన్నప్పుడు చేశాం. కొత్త మ్యూటెంట్ల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా సామర్థవంతంగా పనిచేస్తుంది" అని జైడస్ ఒక ప్రకటనలో తెలిపారు.

12,000 అంతకంటే పైబడిన వారికి ఈ టీకా అందించేలా వినియోగ అనుమతులు ఇవ్వాలని కోరింది. అత్యవసర అనుమతి లభించిన తర్వాత ఏడాదికి 12 కోట్ల ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.

జైకోవ్-డి పీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది. అంతేకాక దేశంలో అందుబాటులోకి వచ్చే ఐదో టీకా కానుంది. ఇప్పటికే స్వదేశీ టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇటీవల మోడెర్నా టీకాకు కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దేశీయ ఫార్మా సంస్థ సిప్లా మోడెర్నా టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోనుంది.