MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియోను.. ఆమె భర్తకు పంపి బ్లాక్ మెయిల్.. తట్టుకోలేక ఆ యువతి చేసిన పని...

ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియోను.. ఆమె భర్తకు పంపి బ్లాక్ మెయిల్.. తట్టుకోలేక ఆ యువతి చేసిన పని...

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తామిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను భర్తకు పంపడంతో మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 21 2023, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తమిళనాడు : వివాహేతర సంబంధాలు అనేక నేరాలకు దారితీస్తున్న ఘటనలు ఎన్ని చూస్తున్నా కూడా.. సమాజంలో మార్పు రావడం లేదు.  క్షణికావేశంలో వివాహేతర సంబంధాలు పెట్టుకుని.. తమ జీవితాలతో పాటు తమన నమ్ముకున్న వారి జీవితాలను కూడా కష్టాల మయం చేస్తున్నారు. అలాంటి ఓ ఘటనే తమిళనాడులోని తిరువొత్తియూరులో వెలుగు చూసింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెడితే..  బీహార్ కు చెందిన  బిక్కు కుమార్, బీరెత్తి కుమారి  దంపతులు. వీరు రెండేళ్ల క్రితం కోవై జిల్లా అన్ననూరు సమీపంలోని కెంపనాయకన్ పాళయంకు  వచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు. 

35

ఈ క్రమంలోనే బీరెత్తి కుమారికి ఆ ప్రాంతంలోనే నివసించే తేని జిల్లాకు చెందిన పాండీ మురుగన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.  అది కాలక్రమేనా వివాహేతర సంబంధంగా మారింది. అయితే,   పాండిమురుగన్ బీరెత్తి కుమారికి వెన్నుపోటు పొడిచాడు. ఆమెతో..  శారీరక సంబంధం పెట్టుకుని.. తామిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అది మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను బీరెత్తి కుమారి భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు.  

45

దీంతో బిక్కు కుమార్  భార్యను నిలదీశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈనెల 17వ తేదీన జిల్లాలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నివాసాన్ని మార్చి కోవై గణేషన్ పురంలో  కాపురం పెట్టారు. అయినా కూడా పాండిమురుగన్ వదలలేదు. మరోసారి  ఆ వీడియో పంపి బ్లాక్ మెయిల్ చేశాడు.  

55

దీంతో బీరెత్తి కుమారి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో అన్ననూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi: మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన జంత‌ర్‌మంత‌ర్‌.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
Recommended image2
ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
Recommended image3
Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved