- Home
- National
- భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చి.. మూడు ముక్కలు చేసి.. మూడు చోట్ల విసిరేసిన ప్రియురాలు...
భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చి.. మూడు ముక్కలు చేసి.. మూడు చోట్ల విసిరేసిన ప్రియురాలు...
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని భర్తతో కలిసి దారుణంగా హతమార్చింది ఓ మహిళ. ఆ తరువాత మృతదేహాన్నిమూడు ముక్కలుగా చేసి.. మూడు వేర్వేరు చోట్ల పడేశారు.

ఝార్ఖండ్ : ఓ వ్యక్తిని అతికిరాతంకంగా నరికి చంపాడు మరో వ్యక్తి. తన భార్యతో బాధితుడైన వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. అనే కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఝార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో ఈ ఘటన కలకలం రేపింది. కమలాకాంత్ సాగర్, కుష్బూ సాగర్ దంపతులు.
వీరు అక్కడి సోనారి ప్రాంతానికి చెందిన వారు. విక్కీ అలియాస్ దమ్రుధర్ మహంతి ఒడిశాలోని రాయరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతనితో కుష్బూ సాగర్ కు పరిచయం ఏర్పడింది. విక్కీకి కూడా వివాహం అయ్యింది.
అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతను కనిపించకుండా పోయాడు. కొద్దిరోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ విక్కీ భార్య ఇనుశ్రీ మహంతి రాయిరంగపూర్ పోలీసులకు ఈనెల 13వ తేదీన ఫిర్యాదు చేసింది.
एक महीने पहले महिला दिल्ली से मायके (आगरा) रहने आई थी। बेटे को मां के पास छोड़ महिला ने ससुराल जाने की बात कही। दिल्ली के लिए एक कैब भी बुक कराई। लेकिन वो अपने ससुराल नहीं पहुंची।
విచారణలో భాగంగా వారికి మహంతి, కుష్బూ సాగర్ ల మధ్య సంబంధం గురించి తెలిసింది. దీంతో పోలీసులు కమలాకాంత్ సాగర్, కుష్బూ సాగర్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
పోలీసుల విచారణలో దమ్రుదర్ మహంతిని తామే హత్య చేసినట్లు భార్యాభర్తలిద్దరూ అంగీకరించారు. ఆ తర్వాత తాము పట్టు పడకుండా ఉండాలని.. మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికామని చెప్పారు.
తల, మొండెం, కాళ్లను మూడు వేరు వేరు సంచుల్లో పెట్టామని.. వాటిని ఆ తర్వాత మూడు వేరువేరు చోట్ల పడేసినట్లుగా వారు చెప్పుకొచ్చారు. దీంతో ఆ భార్యాభర్తలు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు… దమ్రుదర్ మహంతి శరీర భాగాల కోసం వెతుకుతున్నారు.