MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అరెస్ట్... ఎందుకో తెలుసా?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అరెస్ట్... ఎందుకో తెలుసా?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసారు. ఎందుకో తెలుసా?   

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 06 2025, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tamilisai Soundararajan Arrest

Tamilisai Soundararajan Arrest

తమిళనాడులో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే దీనిని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సమాన విద్య ప్రజల హక్కు పేరుతో తమిళనాడులో మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బీజేపీ తరపున సంతకాల ఉద్యమం ప్రారంభమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తమిళిసై సౌందరరాజన్ అరెస్ట్

తమిళిసై సౌందరరాజన్ అరెస్ట్

ఈ క్రమంలో మూడు భాషల విధానానికి మద్దతుగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో చెన్నై ఎంజీఆర్ నగర్ మార్కెట్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. తమిళ విద్యా సంస్థల్లో హిందీ భాషకు మద్దతుగా ప్రజల నుంచి సంతకాలు తీసుకున్నారు.

అయితే ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోలేదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా కార్యక్రమం నిర్వహిస్తున్నారని పోలీసులు తమిళిసైని అడ్డుకున్నారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంతకాల ఉద్యమానికి పోలీసుల ముందస్తు అనుమతి లేని కారణంగా తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేయడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ అరెస్టును అన్నామలై ఖండించారు.

35
Tamilisai Soundararajan Arrest

Tamilisai Soundararajan Arrest

ఈ మేరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పేద, నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను, నచ్చిన భాషలను నేర్చుకునే అవకాశాన్ని అందించే జాతీయ విద్యా విధానాన్ని సమర్థిస్తూ, తమిళనాడు బీజేపీ తరపున జరుగుతున్న సంతకాల ఉద్యమాన్ని, చెన్నైలో ఈరోజు ప్రారంభించిన తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్, అక్క తమిళిసై సౌందరరానై అరెస్టు చేసింది తమిళనాడు పోలీసులు.

45
Tamilisai Soundararajan Arrest

Tamilisai Soundararajan Arrest

అరవై ఏళ్లుగా తమిళ భాషను వ్యాపారంగా మార్చి, ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే మూడు భాషల విధానాన్ని అనుమతించే డీఎంకే ద్వంద్వ నీతి ఈరోజు బట్టబయలైంది. డీఎంకే నాటకాన్ని ప్రజలు గ్రహించడం ప్రారంభించారని, మూడు భాషల విధానానికి భారీగా మద్దతు లభిస్తుండటంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భయంతో తడబడుతున్నారు. దాని ఫలితమే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న సంతకాల ఉద్యమాన్ని అడ్డుకోవడం, అరెస్టు చేయడమని అన్నామలై అన్నారు.

55
Annamalai

Annamalai

ఈ అరెస్టులకు తమిళనాడు బీజేపీ కార్యకర్తలు భయపడి వెనక్కి తగ్గరు. తమిళనాడులోని ప్రతి ఇంటికి వెళ్తాం. ముఖ్యమంత్రి గారూ, మీరు ఎంతమందిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేయగలరు? జాతీయ విద్యా విధానం మీ పార్టీలోని చివరి కార్యకర్తల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను, అనేక భాషలు నేర్చుకునే అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందిస్తుంది. దానిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అని అన్నామలై అన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
185
INDIND
(10.5 ov)54/1
IND need 132 runs in 235 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
టీవీ రంగంలో ఉద్యోగాలకు ముప్పు త‌ప్ప‌దా.. అదే జ‌రిగితే వేల మందిపై ప్రభావం
Recommended image2
రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు.. కాంగ్రెస్ సభపై బీజేపీ నేతల విమర్శలు
Recommended image3
Delhi: ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోన్న ఢిల్లీ.. దేశ రాజ‌ధానిలో అస‌లేం జ‌రుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved