MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మీ కూతురు కోసం రూ.5,000 దాచండి... ఏకంగా రూ.25,000,00 పైగా పొందండి...

మీ కూతురు కోసం రూ.5,000 దాచండి... ఏకంగా రూ.25,000,00 పైగా పొందండి...

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం అద్భుతమైన పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం కింద అమ్మాయిల పేరెంట్స్ వందలు, వేలల్లో పొదుపుచేసి లక్షల్లో రిటర్న్స్ పొందవచ్చు. ఎలాగో ఈ కథనం చదివి తెలుసుకొండి... 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 06 2024, 08:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana : రాతి యుగం నుండి రాకెట్ యుగానికి చేరుకున్నాడు మనిషి. ఆ ఆటవిక కాలంనుండి ఈ ఆధునిక కాలానికి చేరుకునే పరిణామక్రమంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలా మహిళల పరిస్థితి కూడా చాలా మారింది... ఒకప్పుడు ఒంటింటికే పరిమితమైన మగువలు ఇప్పుడు మగాళ్లతో సమానస్థాయికి చేరుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు... ఇలా అదీఇదని కాదు ప్రతి రంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు. ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

అయితే కాలం ఎంత మారినా కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ మహిళను భారంగానే భావిస్తుంటారు. లింగ వివక్ష చూపిస్తూ మగపిల్లలను చదవించడం, ఉద్యోగాలు చేయిస్తూ... ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేసే అనేక కుటుంబాలు మన సమాజంలో కనిపిస్తుంటాయి. అంతేకాదు ఎప్పుడెప్పుడు ఆడపిల్లకు పెళ్లిచేసి భారం దింపుకుందామా అనుకునే తల్లిదండ్రులు వున్నారు. చివరకు ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులో పిండాన్ని, పురిటి బిడ్డను చంపిన సంఘటనలు అనేకం.

313
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

అయితే ఆడపిల్లలపై వివక్షకు ప్రధాన కారణం వారి పెళ్లి ఖర్చు. అమ్మాయి అయితే కట్నం ఇవ్వాలని, అబ్బాయి అయితే కట్నం వస్తుందనే భావన సమాజంలో బలంగా పాతుకుపోయింది. అలాగే అమ్మాయిల చదువును కూడా కొందరు భారంగా భావిస్తుంటారు. ఇలా అమ్మాయిలను తల్లిదండ్రలు భారంగా కాకుండా వరంగా భావించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసమే భాగంగానే ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ది యోజన స్కీం ను తీసుకువచ్చింది నరేంద్ర మోదీ సర్కారు.
 

413
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

ఏమిటీ పథకం : 

ఆడపిల్లలకు అండగా భారత ప్రభుత్వం 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదంతో అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే అమ్మాయిల చదువు, పెళ్లి వంటివి తల్లిదండ్రుల భారంగా బావించకూడదనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన ఈ  పథకాన్ని అమ్మాయిల తల్లిదండ్రులు ఏదయినా గుర్తింపుపొందిన బ్యాంకులు, పోస్టాఫిసుల ద్వారా పొందవచ్చు. 
 

513
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

అమ్మాయి చిన్నపుడే తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ పొదుపు ఖాతా తెరిచి అందులో ప్రతినెలా కొంతమొత్తంలో డబ్బులు పొదుపు చేయవచ్చు. ఇలా 18 ఏళ్ల పాటు ప్రతినెలా కొంతమొత్తం పొదుపుచేస్తే... సరిగ్గా మీ అమ్మాయి చదువు లేదంటే పెళ్లి సమయంలో భారీ మొత్తంలో రిటర్న్స్ పొందవచ్చు. 
 

613
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

ఇలా ఓ జంటకు ఇద్దరు ఆడపిల్లలుంటే ఇద్దరి పేరిటా సుకన్య సమృద్ది యోజన కింద పొదుపు చేయవచ్చు. అంతకంటే ఎక్కువమంది ఆడపిల్లలుంటే ఈ పథకం వర్తించదు. అయితే కవల పిల్లలను కలిగిన తల్లిదండ్రులకు కాస్త మినహాయింపు వుంటుంది. 
 

713
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

ఈ పథకంలో ఎలా చేరాలి ? 

సుకన్య యోజన సమృద్ది యోజన పథకం కింద డబ్బులు పొదుపు చేయాలనుకునే పేరెంట్స్ సమీపంలోని బ్యాంకు లేదంటే పోస్టాఫీసును సందర్శించండి. అక్కడ సుకన్య సమృద్ది యోజన ఫారం అందుబాటులో వుంటుంది. అందులో అడిగిన సమాచారాన్ని ఇవ్వండి. అలాగే ఆమ్మాయి భర్త్ సర్టిఫికేట్, ఏదయినా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి), నివాస రుజువు పత్రాలు జతచేసి అందించాలి. 

813
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

ప్రయోజనాలు : 

బ్యాంకు లేదా పోస్టాఫీస్ సిబ్బంది మీ దరఖాస్తును స్వీకరించి అన్ని సరిగ్గా వున్నాయంటే ఓ పొదుపు ఖాతాను ఓపెన్ చేస్తారు. ఇందులో ప్రతినెలా కొంతమొత్తం జమ చేయాలి. కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 లను ప్రతి నెలా జమ చేయవచ్చు. ఇలా 15 ఏళ్లపాటు పొదుపు చేయాలి... 21 ఏళ్ల తర్వాత మనం డబ్బులను పొందవచ్చు. అసలుతో పాటు భారీ వడ్డీ కలిసి మనకు తిరిగివస్తుంది. 
 

913
sukanya samriddhi yojana

sukanya samriddhi yojana

ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈ పథకం ద్వారా అధిక రాబడి పొందవచ్చు. అంటే మనం దాచుకున్న డబ్బులకు ఏడాదికి 8 శాతానికి పైగా వడ్డీ వస్తుంది.  ఈ పథకంలో చేరే సమయంలో అమ్మాయిల వయసు పదేళ్లలోపు వుండాలి... అంటే పదేళ్లలోపు ఏ వయసులో అయినా పొదుపు ఖాతా తెరవచ్చు. ఏదయినా అవసరాల కోసం 18 ఏళ్ల తర్వాత కొంతమొత్తంలో డబ్బులు పొందవచ్చు. 
 

1013
sukanya samriddhi yojana

sukanya samriddhi yojana

సుకన్య ఖాతాలో పొదుపుచేసిన డబ్బులతో పాటు వడ్డీకి కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే డబ్బులకు కూడా ఎలాంటి ట్యాక్స్ వుండదు. ఇలా సుకన్య పథకం ద్వారా డబ్బులు పొదుపుచేసి పన్నులనుండి మినహాయింపు పొందవచ్చు. 

1113
sukanya samriddhi yojana

sukanya samriddhi yojana

ఎంత పొదుపు చేస్తే ఎంతొస్తుంది : 

సుకన్య సమృద్ది యోజన పథకంలో ప్రతినెలా రూ.250 నుండి రూ.1,50,000 వరకు పొదుపు చేయవచ్చు. అయితే మీరు ఎంత పొదుపు చేస్తే మెచ్యూరిటీ సయానికి ఎంత వస్తుందో కొన్నిలెక్కలు చూద్దాం.

1213
sukanya samriddhi yojana

sukanya samriddhi yojana

ప్రతినెలా వెయ్యి జమచేస్తే : 

మీ కూతురు భవిష్యత్ కోసం తెరిచిన సుకన్య ఖాతాలో ప్రతినెలా వెయ్యి రూపాయలు జమ చేసారనుకొండి సంవత్సరానికి రూ.12 వేలు అవుతుంది. 15 సంవత్సరాలకు రూ.1,80,000 జమ అవుతాయి. వడ్డీ దాదాపు 3 లక్షలకు పైగా వస్తుంది. మొత్తంగా మెచ్యూరిటీ సమయానికి మీరు రూ.5 లక్షలకు పైగా డబ్బులు పొందవచ్చు. 

1313
sukanya samriddhi yojana

sukanya samriddhi yojana

ఇలా ప్రతి నెలా రెండువేలు జమచేస్తే దాదాపు రూ.10 లక్షలు, మూడువేలు జమచేస్తే దాదాపు రూ.15 లక్షలు, నాలుగువేలు జమచేస్తే దాదాపు రూ.20 లక్షల వరకు పొందవచ్చు. ఇక ప్రతినెలా ఐదువేలు జమ చేసారనుకొండి ఏడాదికి రూ.60 వేలు, 15 ఏళ్లకు రూ.9 లక్షలు జమ అవుతాయి. వడ్డీతో కలుపుకుంటే మెచ్యూరిటీ సమయానికి రూ.25 లక్షల వరకు పొందవచ్చు. అయితే ప్రభుత్వం వడ్డీరేట్లలో మార్పులు చేస్తే ఈ లెక్కల్లో మార్పులు వుంటాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways: రూ. 1628 కోట్ల బిగ్ ప్రాజెక్టు.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి.. రౌఘాట్‌కు రైల్వే కనెక్టివిటీ
Recommended image2
PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు.. దీపావళికి ముందు గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి
Recommended image3
భారత్‌లో సీజేపీ నిరసనలపై స్పందించిన అమెరికా .. విదేశాంగ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved