New Year : ఈ న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అవుతుందేంట్రా బాబు... ఇంతకూ ఏమిటీ WTF?
ఈ నూతన సంవత్సరాదిని ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతున్నారా? అయితే ఈ ఇయర్ WTF తో ఆరంభమవుతుండటం చాలామందికి ఆందోళన కలిగిస్తోంది. ఇంతకూ ఇదేంటో తెలుసా?
New Year
New Year : మరో నెలరోజుల్లో 2024 కు స్వస్తి పలికి 2025 లోకి అడుగు పెట్టబోతున్నాం. అంటే పాతబడ్డ సంవత్సరంలోంచి సరికొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎన్నో కలలు, మరెన్నో ప్లాన్స్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతిఒక్కరూ సిద్దమవుతున్నారు. కానీ ఈ న్యూ ఇయర్ ఆరంభమే యువతను నిరాశపర్చేలా వుంది.
డిసెంబర్ 31న వేడుకలు జరుపుతూ న్యూ ఇయర్ కు స్వాగతం పలకాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా యువత ఈ సెలబ్రేషన్స్ ను గట్టిగా ప్లాన్ చేస్తారు. కొందరు పబ్బుల్లో, మరికొందరు వేడుకలు అట్టహాసంగా జరిగే విదేశాల్లో, ఇంకొందరు రిసార్టులు, లగ్జరీ హోటల్స్ లో నూతర సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. వీరిలో స్టూడెంట్స్, ఉద్యోగులే అధికంగా వుంటారు.
అయితే ఈ సంవత్సరం ఎటూ కాకుండా వారం మధ్యలో వస్తోంది... ఈ జనవరి 1 బుధవారం. ఈరోజు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది కాబట్టి స్టూడెంట్స్ సంగతి ఓకే...మరి ఉద్యోగుల పరిస్థితే అర్థంకాకుండా వుంది. డిసెంబర్ 31న వేడుకలు జరుపుకుని జనవరి 1న ఆఫీసులకు వెళ్లాల్సి వుంది. దీంతో ఈ ఇయర్ ఇలా స్టార్ట్ అయ్యిందేంట్రా బాబు అంటున్నారు యువత.
బుధవారం న్యూ ఇయర్ స్టార్ట్ అయితే ఏమవుతుంది :
2025 సరిగ్గా వారం మధ్యలో ఆరంభం అవుతోంది. అంటే జనవరి 1 బుధవారం, జనవరి 2 గురువారం, జరవరి 3 గురువారం వర్కింగ్ డేస్. ఉద్యోగాలు చేసేవారు ఈ రోజులను చాలా భారంగా బావిస్తారు. ఎందుకంటే ఇవి అటే వీకెండ్ కావు... ఇటు వీక్ ఆరంభంలో వచ్చేవి కాదు... సరిగ్గా వారం మధ్యలో వుంటాయి. అందువల్లే ఈ బుధ, గురు,శుక్ర (WTF) వారాలు భారంగా గడుస్తాయి. ఈసారి న్యూ ఇయర్ కూడా ఇదే రోజుల్లో రావడం యువతలో చర్చనీయాంశంగా మారింది.
ఇలా వీక్ మధ్యలో న్యూఇయర్ ప్రారంభం కావడంపై యువతల చర్చ సాగుతోంది. ఎక్స్ వేదికన ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. 'ఈ న్యూ ఇయర్ 'WTF' తో ప్రారంభం అవుతున్నందుకు మీరు కూడా ఆందోళన చెందుతున్నారా'' అంటూ ట్వీట్ చేసాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రతి న్యూఇయర్ ముందు సంవత్సరం కంటే బాగుండాలని ప్రతిఒక్కరం కోరుకుంటాం... కానీ వచ్చే సంవత్సరం మరింత దారుణంగా వుంటుంది... ఈ ఇయర్ కూడా అలాగే వుంటుందని ఆరంభంలోనే అర్థమవుతోందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ఇక మరో నెటిజన్ ''ఖచ్చితంగా మేము ఆందోళన చెందుతున్నాం'' అంటూ రియాక్ట్ అయ్యాడు.
women calender
2020 కూడా ఇలాగే ప్రారంభం :
సరిగ్గా ఇప్పటిలాగే 2020 సంవత్సరం ప్రారంభమైంది. ఆ ఏడాది జనవరి 1 బుధవారమే వచ్చింది. అంటే ఆ ఇయర్ కూడా WTF అంటే వర్కింగ్ డేస్ తోనే ప్రారంభమయ్యిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా WTF తో ప్రారంభమైన 2020లోనే కరోనా మహమ్మారి వ్యాపించింది. ఈ ఇయర్ లాక్ డౌన్, క్వారంటైన్లు, భారీ చావులతో ముగిసింది. ఆ సంవత్సరం ఎంత భారంగా గడిచిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ అలాగే ఇయర్ ప్రారంభం అవుతోంది. ఇప్పుడేం జరుగుతుందో అంటే కొందరు నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.
జనవరి ఎందుకంత ప్రత్యేకం :
ఆరంభమే బాగుంటే ఆ ఏడాదంతా బాగుంటుందని చాలామంది నమ్ముతారు... అందువల్లే జనవరి నెలను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మంచి జోష్ తో జరుపుకుని మిగతా రోజులు కూడా ఇలాగే వుండాలని కోరుకుంటారు. ఇక కొత్త సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు... వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించేది జనవరిలోనే.
ఇక కొత్త సంవత్సరంలో కొత్త పనులు చేయాలని నిశ్చయించుకునేవారు చాలామందే వుంటారు. కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ , యోగా, వాకింగ్ వంటివి చేయడం, ఆహార అలవాట్లను మార్చుకోవడం చేస్తుంటారు. మరికొందరు కెరీర్ గురించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా న్యూ ఇయర్ లో తమ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఈ న్యూ ఇయర్ కొద్దిగా భారంగా ఆరంభం అవుతోంది ... కానీ ఈ ఇయర్ మొత్తం ఇలాగే వుండకుండా వుంటే బాగుంటుంది. హాయిగా, ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ న్యూ ఇయర్ ఆనందాన్ని పంచాలని కోరుకుందాం.