MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • MTB Shimla 2023: 2 రోజుల మౌంటైన్ బైకింగ్ రేసు.. మొత్తం 88 మంది రైడర్లలో 11-65 ఏండ్ల వారు.. ప్రత్యేకత ఏమిటంటే?

MTB Shimla 2023: 2 రోజుల మౌంటైన్ బైకింగ్ రేసు.. మొత్తం 88 మంది రైడర్లలో 11-65 ఏండ్ల వారు.. ప్రత్యేకత ఏమిటంటే?

MTB Shimla 2023: ఎంటీఎం సిమ్లా-2023 మౌంటైన్ బైకింగ్ రేసులో పాల్గొనేవారు ప్రతిరోజూ సుమారు 65 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మొదటి రోజు రిడ్జ్ మైదానం నుంచి రేసు ప్రారంభ‌మైన రేసు.. కుఫ్రి మీదుగా మషోబ్రాకు చేరుకుంటుంది. రెండో రోజు పాటర్ హిల్స్ లో రేసు ముగుస్తుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2023, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

MTB Shimla 2023: సిమ్లాలోని చారిత్రాత్మక రిడ్జ్ మైదానం నుంచి శుక్రవారం ప్రారంభం కానున్న మౌంటెన్ బైకింగ్ (ఎంటీబీ సిమ్లా) పదో ఎడిషన్ లో మొత్తం 88 మంది రైడర్లు పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మౌంటెన్ బైకింగ్ రేసును సాయంత్రం 4 గంటలకు హిమాచల్ ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనిరుధ్ సింగ్ ఠాకూర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎంటీఎం సిమ్లా-2023 మౌంటైన్ బైకింగ్ రేసులో పాల్గొనేవారు ప్రతిరోజూ సుమారు 65 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మొదటి రోజు రిడ్జ్ మైదానం నుంచి రేసు ప్రారంభ‌మై.. కుఫ్రి మీదుగా మషోబ్రాకు చేరుకుంటారు. రెండో రోజు పాటర్ హిల్స్ లో రేసు ముగుస్తుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

36

మొత్తం 88 మంది బైక్ రైడ‌ర్ల‌లో 11 మంది మహిళలు పాల్గొంటున్నార‌నీ, ఇది చాలా మంచి సంఖ్య అని ఎంటీబీ సిమ్లా ఆర్గనైజర్ ఆశిష్ సూద్ ఏషియానెట్ న్యూస్ కు  తెలిపారు. 'ఈ రేసులో మాకు అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. కార్పొరేట్ ప్రపంచం, స్టూడెంట్ కమ్యూనిటీ, బిజినెస్ క్లాస్, ప్రొఫెషనల్స్ నుంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు' అని సూద్ తెలిపారు.

46
MTB Himachal Janjehli Cycling 2022

MTB Himachal Janjehli Cycling 2022

ఈ ఎంటీఎం సిమ్లా-2023 మౌంటైన్ బైకింగ్ కేసులో పాలుపంచుకుంటున్న అతిపెద్ద రైడర్ వయస్సు 65 సంవత్సరాలు కాగా, అతి పిన్న వయస్కుడి వయస్సు 11 సంవత్సరాలని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. సిమ్లాకు చెందిన మహేశ్వర్ దత్ వార్తాపత్రిక విక్రేతగా పనిచేస్తున్నాడు. 50 ఏళ్లు పైబడిన వారు ఏడుగురు ఉన్నారని తెలిపారు.

56

జాతీయ చాంపియన్, 3 సార్లు గోల్డ్ మెడలిస్ట్ అయిన సునీత శ్రేష్ఠ, అండర్-19 మాజీ జాతీయ స్వర్ణ పతక విజేత హీరో యాక్షన్ టీమ్ కు చెందిన అక్షిత్ గౌర్, ఎస్ఎస్బీకి చెందిన ఇసాక్ రాయ్ ఈ రేసులో పాల్గొంటున్నారు. వీరితో పాటు అస్సాంకు చెందిన మౌంటైన్ బైకింగ్ ఛాంపియన్ ప్రహ్లాద్, చెన్నై, జైపూర్ జట్లు కూడా రేసులో పాల్గొంటున్నాయి.

66

42 ఏళ్ల ఛాంపియన్ రైడర్, పర్యావరణవేత్త అనుపమ కూడా రేసులో పాల్గొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గోవా, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా పంజాబ్, చండీగఢ్, అస్సాం సహా 12 రాష్ట్రాల నుంచి రైడర్లు వస్తున్నారని సూద్ తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Recommended image2
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Recommended image3
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved