మారిషస్‌లో ల్యాండ్ అయిన మోదీ.. ప్రధానికి అపూర్వ స్వాగతం. (ఫొటోలు)
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిషస్‌లో పర్యటనకు బయలు దేరి వెళ్లారు. మంగళవారం ప్రధాని ఆ దేశానికి చేరుకున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజరయ్యేందుకు మోదీ వెళ్లారు. మార్చి 12వ తేదీన జరిగే ఈ వేడులకు హాజరుకానున్నారు.
ఉదయం 6 గంటలకు ప్రధాని మోదీ మారిషస్ లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ప్రముఖులు స్వాగతం పలికారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ ఆయనకు పూలమాల వేసి ఆహ్వానించారు. రామ్‌గులామ్‌తో పాటు డిప్యూటీ పీఎం, మారిషస్ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి తదితరులు పాల్గొన్నారు.
200 మంది ప్రముఖులు
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, దౌత్యవేత్తలు, మత పెద్దలతో సహా మొత్తం 200 మంది ప్రముఖులు హాజరయ్యారు.
మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌లో ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. ఆయన రెండు రోజుల పర్యటన కోసం సోమవారం రాత్రి మారిషస్ బయలుదేరారు. మార్చి 12న జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ప్రధానమంత్రిగా మోదీ మారిషన్ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఇంతకుముందు మోదీ 2015లో మారిషస్ వెళ్లారు.
ఈ పర్యటన "భారత్-మారిషస్ సంబంధాలను బలోపేతం చేయడానికి" ఉపయోగపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
"భారత్-మారిషస్ సంబంధాలను బలోపేతం చేస్తున్నాం! ప్రదాని మారిషస్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మారిషస్ నాయకులు, ప్రముఖులతో సమావేశమవుతారు" అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Xలో పోస్ట్ చేశారు.
విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోదీని చూసేందుకు మారిషస్ లో ఉంటున్న భారతీయులు పెద్ద ఎత్తున వచ్చారు.
భారతీయ సమాజ సభ్యుడు శరద్ బర్న్‌వాల్ మాట్లాడుతూ "మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఉదయం నుంచే ఇక్కడకు చేరుకున్నాం. భారత్, మారిషస్ మధ్య స్నేహం ఎప్పుడూ గొప్పగా ఉంది. పీఎం మోదీ పర్యటన తర్వాత సంబంధాలు మరింత బలపడతాయి" అన్నారు.