MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Jharkhand Assembly Election Results 2024 : హేమంతా మజాకా..! జార్ఖండ్ లో 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ విజయం

Jharkhand Assembly Election Results 2024 : హేమంతా మజాకా..! జార్ఖండ్ లో 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ విజయం

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు తలకిందులయ్యాయి. అంచనాలను మించి అద్భుత ప్రదర్శన కనబర్చిన హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని, పాలనా పగ్గాలను అందుకోబోతున్నారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Nov 23 2024, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Jharkhand Assembly Election Results 2024

Jharkhand Assembly Election Results 2024

Jharkhand Assembly Election Results 2024 : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హేమంత్ సోరేన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లలో విజయం దిశగా అడుగులు వేస్తోంది... ఇందులో ఇప్పటికే 7 స్థానాల్లో విజయం సాధించి మరో 27 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

అయితే 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్ లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించేలా కనిపించడంలేదు. కానీ జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసాయి. కాబట్టి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్న 16 స్థానాలను కలుపుకుంటే ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటుంది. దీంతో మరోసారి హేమంత్ సోరేన్ కు సీఎం పదవి ఖాయంగా కనిపిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Jharkhand Assembly Election Results 2024

Jharkhand Assembly Election Results 2024

జార్ఖండ్ ఫలితాలు ఇలా వున్నాయి :

జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) - 27 స్థానాల్లో ఆధిక్యం - 7 చోట్ల విజయం - మొత్తం 34 స్థానాల్లో గెలుపు అవకాశం 

భారతీయ జనతా పార్టీ (బిజెపి) - 19 స్థానాల్లో ఆధిక్యం - 1 చోట విజయం - మొత్తం 20 స్థానాలకు గెలుచుకునే అవకాశం 

కాంగ్రెస్ పార్టీ - 15 చోట్ల ఆధిక్యం - ఒకచోట విజయం - మొత్తం 16 స్థానాలను గెలుచుకునే అవకాశం 

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) - 4 చోట్ల ఆధిక్యం 

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్-లెనినిస్ట్) ‌- ఒకచోట ఆధిక్యం - ఒకచోట విజయం (2 స్థానాలను గెలుచుకునే అవకాశం)

33
Jharkhand Assembly Election Results 2024

Jharkhand Assembly Election Results 2024

హేమంత్ సోరెన్ రికార్డ్ బ్రేక్ విజయం : 

జార్ఖండ్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వం మారడం ఖాయం... గత 24 ఏళ్లుగా ఇదే జరిగింది. కానీ తాజాగా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఈ రికార్డును బద్దలుగొట్టింది. వరుసగా రెండోసారి హేమంత్ పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు. 

జార్ఖండ్ లోని మొత్తం 81 సీట్లకు గాను ఇండియా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి కేవలం 25 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. కాబట్టి హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ జనతా పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved