MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • బెంగళూరు ఆడి కారు యాక్సిడెంట్ : అతివేగమా, మద్యంమత్తా.. అసలేం జరిగింది? అన్నీ అనుమానాలే...

బెంగళూరు ఆడి కారు యాక్సిడెంట్ : అతివేగమా, మద్యంమత్తా.. అసలేం జరిగింది? అన్నీ అనుమానాలే...

బెంగళూరు రోడ్ల మీద 90-100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Sep 02 2021, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
DMK mla

DMK mla

కర్ణాటక : ఐటీ సిటీలో ఆడికారు దుర్ఘటనలో ఎమ్మెల్యే తనయుడు, మరో ఆరుగురు యువతీ యువకుల మరణం సంచలనాత్మకమయ్యింది. హై ఎండ్ కారుతో యువత సరదాలు కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఈ కేసులో కొత్త కొత్త అంశాలు నెమ్మదిగా వెలుగు చూస్తున్నాయి. కరుణాసాగర్, అతని స్నేహితులు మిడ్ నైట్ పార్టీ చేసుకుని జాలీ రైడ్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బెంగళూరు రోడ్ల మీద 90-100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగల, ఏంజీ రోడ్డు ఇందిరానగర హోటల్స్, పబ్ లను పరిశీలించాలని నిర్ణయించారు. కరుణాసాగర్ మిత్రబృందం ఎక్కడెక్కడ తిరిగిందో పసిగట్టేందుకు అక్కడి సీసీ కెమెరాల చిత్రాలను తనిఖీ చేయనున్నారు. యాక్సిడెంట్ జరిగిన చోట రోడ్డు కుడివైపుకు వంపు ఉండగా, కారు ఎడమవైపుకు నేరుగా దూసుకుపోయింది. అక్కడ కారును అదుపు చేయలేకపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కారు శిథిలాల్లో మూడు మొబైల్ ఫోన్లు లభించాయి. అన్ని ఫోన్ల తెరలు ముక్కలై ఉన్నాయి. వారి కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా ఎక్కడ విందు చేసుకున్నారో కూపీ లాగుతున్నారు. సుారు 30 మంది పోలీసులను ఇందుకు నియమించారు. మద్యం సేవించారా, లేదా అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మృతుల రక్త నమూనాలను సేకరించారా, లేదా అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మృతుల రక్తనమూనాలను  సేకరించి ల్యాబ్ కు పంపారు. ఒకటిరెండు రోజుల్లో నివేదిక అందే అవకాశం ఉంది. 

కారు నడిపిన కరుణాసాగర్ పోస్టుమార్టం నివేదిక కేసులో ముఖ్యమైనదని పోలీసులు తెలిపారు. అత్యంత వేగంగా డ్రైవింగ్ చేశారని కనబడుతున్ప్పటికీ అందుకు కారణాలేమిటీ అనేది ఈ నివేదికల ద్వారా తెలిసే అవకాశముంది. కరుణాసాగర్ ఎమ్మెల్యే కొడుకు కావడంతో ఇది ప్రాముఖ్యమైన కేసుగా మారింది. ప్రమాదస్థలికి ముందు సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్ ఈ ఆడికారునుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. దీనికి గమనించిన పోలీసులు కారును అడ్డగించడానికి వెళ్లగా వేగంగా వెళ్లిపోయిందని సమాచారం. 

34
DMK mla

DMK mla

కారులోనివారు మద్యం సేవించి ఉంటారన్న పోలీసుల అనుమానానికి సాక్ష్యాలు లభిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ ప్రారంభానికి ముందు ఇషితా, మరొక యువతి కోరమంగలలో ఓ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేశారు. సీసాలను బ్యాగ్ లో పెట్టుకుని బయలుదేరిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 

సోమవారం రాత్రి 8.19 నిమిషాలకు కోరమంగలలో ఉన్న జోలో పీజీ నుంచి ఇషితా, బిందు బయలుదేరారు. 8.39 నిమిషాలకు పీజీ నుంచి సోనీ వరల్డ్ కు వెళ్లే రోడ్డుకు చేరారు. పీజీ నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు నడుచుకుని వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. 

44
<p>dmk mla 2</p>

<p>dmk mla 2</p>

5వ క్రాస్ రోడ్డ నుంచి ఎడమ దిక్కు తిరిగి అక్కడినుంచి హైఫై మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. రాత్రి 8.30 నుంచి 8.44 వరకు మద్య దుకాణంలో కొనుగోలు చేశారు. 

అక్కడే పక్కనున్న పబ్ లోకి వెళ్లగా మరమ్మత్తులు చేస్తుండటంతో వెనక్కి వచ్చేశారు. ఇషికా, బిందు అక్కడినుంచి సోనీ వరల్డ్ మార్గంగా బయలుదేరారు. దుకాణాల వల్ల గల సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. అక్కడికి ఆడి కారు రాగా, కారులో వెళ్లిపోయారు. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved