MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • IIT Baba హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?

IIT Baba హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?

రూ.35 లక్షల శాలరీ జాబ్ వదులుకుని ఆధ్యాత్మిక మార్గం పట్టి వైరల్ అయిన 'ఐఐటీ బాబా' అభయ్ సింగ్ గుర్తున్నాడా..? ఇప్పుడతను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంజినీర్ ప్రతీకను వివాహం చేసుకున్నాడు. ఇంతకీ వాళ్ల లవ్‌స్టోరీ ఎలా మొదలైందో చూద్దాం…

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 07 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓ ఇంటివాడైన ఐఐటి బాబా..
Image Credit : X

ఓ ఇంటివాడైన ఐఐటి బాబా..

 గతేడాది జరిగిన ప్రయాగరాజ్ మహా కుంభమేళా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కుంభమేళాలో మెరిసిన మొనాలిసా ఇటీవలే ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కుంభమేళా ద్వారా గుర్తింపుపొందిన 'ఐఐటీ బాబా' కూడా వార్తల్లో నిలిచారు.

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలో చదివి, రూ.35 లక్షల జీతం గత జాబ్ చేస్తూ సడన్ గా ఆధ్యాత్మిక బాట పట్టిన అభయ్ సింగ్ ప్రయాగరాజ్ లో కనిపించాడు. కాషాయ వస్త్రాల్లో బాబాగా కనిపించిన అతడు ఇప్పుడు బెంగళూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్లీ వార్తల్లో నిలిచాడు.

ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ చదివిన అభయ్ సింగ్, హరియాణాలోని ఝజ్జర్ వాసి. మహాకుంభ్‌లో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఇతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్నుంచి ఇతను ఐఐటీ బాబాగా ఫేమస్ అయ్యాడు. అయితే కుంభమేళా తర్వాత అభయ్ సింగ్ ఎక్కడా కనిపించలేదు. కానీ సడన్ పెళ్లి చేసుకోవడంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐఐటి నుండి బాబా వరకు..
Image Credit : twitter

ఐఐటి నుండి బాబా వరకు..

అభయ్ సింగ్ చిన్నప్పటి నుంచీ టాపర్. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లో 93%, 12వ తరగతిలో 92.4% మార్కులు సాధించాడు. 2008లో జరిగిన ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 731వ ర్యాంక్ (AIR) సాధించి, ఐఐటీ బాంబేలో సీటు సంపాదించాడు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, కెనడాలో మూడేళ్లు ఉద్యోగం చేశాడు. అక్కడ అతని వార్షిక జీతం రూ.36 లక్షలు. కానీ, అతనికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది.

Related Articles

Related image1
ఐఐటీ నుండి సిబిఐ చీఫ్ వరకు.. ప్రవీణ్ సూద్ ఇన్స్ఫైరింగ్ జర్నీ
Related image2
ఆల్క‌హాల్ నిషేధంతో స‌మాజంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయి.? ఐఐటీ అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
35
ఆద్యాత్మిక బాటలో అభయ్ సింగ్
Image Credit : X

ఆద్యాత్మిక బాటలో అభయ్ సింగ్

కెనడాలో మూడేళ్లు ఉద్యోగం చేశాక, అజయ్ సింగ్‌కు ఆధ్యాత్మికతపై మనసు మళ్లింది. భౌతిక సుఖాలు, సంపద నిజమైన సంతృప్తిని ఇవ్వవని అతను నమ్మాడు. అందుకే అన్నింటినీ వదిలేసి, అంతర్గత శాంతిని వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
45
అభయ్ సింగ్ పెళ్లి..
Image Credit : X

అభయ్ సింగ్ పెళ్లి..

అయితే అభయ్ సింగ్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరుకు చెందిన ఇంజినీర్ ప్రతీకను అతను వివాహం చేసుకున్నాడు. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? ప్రేమ ఎలా మొదలైంది? అనే ప్రశ్నలకు ఈ జంటే సమాధానం ఇచ్చింది. 

గత ఏడాదే వీళ్లిద్దరూ కలుసుకున్నారు. 2025 ప్రారంభంలో కోయంబత్తూర్‌లోని సద్గురు ఆదియోగి ఆశ్రమంలో వీరిద్దరూ మొదటిసారి కలిశారు. ఇద్దరికీ ఆధ్యాత్మిక భావాలు ఉండటంతో స్నేహితులయ్యారు. ఆ స్నేహమే ప్రేమగా మారింది.

55
Image Credit : X

గత ఫిబ్రవరి 15న, మహాశివరాత్రి రోజున హిమాచల్ ప్రదేశ్‌లో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఎనిమిది నెలల తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి బంధంతో ముగించారు. అభయ్ సింగ్ చాలా సింపుల్ వ్యక్తి అని అతని భార్య ప్రతీక చెప్పింది. "అతను చాలా నిజాయితీపరుడు. మేమిద్దరం కలిసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తాం. భవిష్యత్తులో 'శ్రీ విశ్వవిద్యాలయం' పేరుతో ఓ యూనివర్సిటీని స్థాపించాలని ఆలోచిస్తున్నాం" అని ప్రతీక తెలిపింది.  

పెళ్లి తర్వాత ఐఐటీ బాబా తన భార్య ప్రతీకతో కలిసి సొంతూరు ఝజ్జర్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ అతని తల్లి, కోడలికి హారతి ఇచ్చి, స్వీట్లు తినిపించి స్వాగతం పలికింది. వారిని చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు చుట్టుపక్కల జనం పెద్ద సంఖ్యలో వచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
ఐఐటీ నుండి సిబిఐ చీఫ్ వరకు.. ప్రవీణ్ సూద్ ఇన్స్ఫైరింగ్ జర్నీ
Recommended image2
ఆల్క‌హాల్ నిషేధంతో స‌మాజంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయి.? ఐఐటీ అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved