- Home
- National
- Indian Law : పెళ్లాం వేరేవాడితో అక్రమ సంబంధం పెట్టుకుని బిడ్డను కంటే.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? లా ఏం చెబుతోంది?
Indian Law : పెళ్లాం వేరేవాడితో అక్రమ సంబంధం పెట్టుకుని బిడ్డను కంటే.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? లా ఏం చెబుతోంది?
Indian Law : ఈ కలికాలంలో వివాహేతర సంబంధాల ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో భార్య భర్తతో కాకుండా తన ప్రియుడితో పిల్లల్ని కంటే ఆ మగాడి పరిస్థితి ఏంటి? లా ఏం చెబుతోంది? అనేది తెలుసుకుందాం.

భార్యాభర్తల బంధం ఇంత బలహీనమా...
Indian Law : ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధానికే మచ్చతెచ్చే అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గతంలో భార్యను చంపిన భర్త, కోడలిని హింసించి హతమార్చిన అత్తింటివారు... ఇలాంటి వార్తలు కనిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది... ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య... ఇలాంటి ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నారు. చివరకు పెళ్లి చేసుకోవాలంటేనే యువకులు భయపడే పరిస్థితి నెలకొంది... నేటి యువతుల తీరుపై సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది.
నేటి యువతరం ప్రేమలో మునిగిపోవడం చాలా సాధారణ విషయంగా మారింది... కానీ కొందరు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడుతున్నారు. ఇలాంటివారిలోనే కొందరు కట్టుకున్నవారికి మోసంచేస్తూ మాజీ ప్రియుడు లేదా ప్రేయసితో రిలేషన్ కొనసాగిస్తుంటారు. ఇలా జీవిత భాగస్వామిని మోసం చేసి వివాహేతర సంబంధాన్ని కొనసాగించడమే కాదు కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా నేటితరం మహిళలు ప్రియుడి మోజులో భర్తలను అత్యంత పాశవికంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి.
ఆ బిడ్డకు తండ్రి ఎవరు?
అయితే కొన్నిసార్లు భర్తతో కాకుండా ప్రియుడితో అక్రమ సంబంధం కారణంగా కొందరు మహిళలు తల్లులు అవుతున్నారు. ఈ విషయం ఆ భర్తకు తెలిస్తే ఏం చేయాలి? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? సదరు భర్త పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి కేసుల్లో లా ఏం చెబుతుంది? ఇక్కడ తెలుసుకుందాం.
భార్య ప్రియుడితో కలిసుంటే పరిస్థితేంటి?
ఇటీవలకాలంలో భార్యాభర్తల బంధం బాగా బలహీనం అయిపోయింది... ఇద్దరిమధ్య అప్యాయత అనురాగాలు లేకపోగా ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి ఈ బంధం దిగజారింది. చివరకు ఇద్దరూ కలిసుంటూనే మరొకరితో రిలేషన్ కొనసాగిస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. గతంలో ఇలా పెళ్లి తర్వాత భర్తగానీ, భార్యగానీ మరొకరితో రిలేషన్ లో ఉంటే 3 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు దీన్ని రద్దుచేసింది... ఇద్దరు ఆడామగ ఇష్టపూర్వకంగా రిలేషన్ లో ఉంటే తప్పుకాదని... దీన్ని నేరంగా పరిగణించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం చెబుతోంది.
కోర్టు ఖర్చులకు భర్తే డబ్బులివ్వాలి..
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే తనతో కాకుండా భార్య వేరేవాడితో ఉన్నా సదరు భర్త ఏం చేయలేని పరిస్థితి. చివరికి ఆమె ప్రియుడితో కలిసుంటూ కూడా భర్తనుండి మెయింటెనెన్స్ డబ్బులు పొందవచ్చు. ఈ విడాకుల కోసం న్యాయపోరాటం చేసే సమయంలోనూ సదరు భర్త ఆమెకు లిటికేషన్ ఎక్స్ పెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
వేరేవాడితో భార్య బిడ్డను కంటే ఆ భర్త పరిస్థితేంటి?
తాజాగా ప్రముఖ హిందీ పాడ్ కాస్టర్ రాజ్ శమాని ఓ న్యాయవాదిని పాప్ కాస్ట్ చేశాడు. ఇందులో భార్యభర్తల వివాదాల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇందులోనే తనవద్దకు వచ్చిన ఓ కేసు గురించి సదరు లాయర్ వివరించారు. భర్తతో కాకుండా భార్య వేరేవాడితో బిడ్డను కన్నా అతడి పరిస్థితి ఎలా ఉంటుందో వివరించారు.
''ఓ మహిళ నావద్దకు భర్త మెయింటెనెన్స్ ఇవ్వట్లేదని వచ్చింది... దీంతో ఆమె తరపున న్యాయస్థానంలో మెయింటెన్స్ పిటిషన్ దాఖలుచేశాను. తర్వాత ఆమె భర్త వచ్చి ఏ బిడ్డకోసం అయితే భార్య మెయింటెనెన్స్ కోరుతుందో అతడు తనకు పుట్టలేదని చెప్పాడు. ఆమె కూడా దీన్ని ఒప్పుకుంది. తన స్నేహితుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాను.. అతడి ద్వారా ఈ బిడ్డను కన్నానని చెప్పింది. దీంతో ఆ భర్త తాను ఇక మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదుకదా'' అన్నాడని సదరు లాయర్ తెలిపారు.
కానీ ఇక్కడ లా ఏం చెబుతుందంటే ఈ భార్యాభర్తలు ఇప్పటికీ కలిసే ఉన్నారు... కాబట్టి ఆ బిడ్డకు తండ్రి భర్తే అవుతాడు... ఆమె ప్రియుడు కాదు. కాబట్టి ఆ బిడ్డ పాలన పోషణ కోసం ఆ తల్లికి సదరు భర్త మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాల్సిందే... తన బిడ్డ కాదని తెలిసినా. ఆ బిడ్డ తనకు పుట్టలేదని తేల్చడానికి అతడికి ఎలాంటి అవకాశం లేదు... డిఎన్ఏ పరీక్షను కూడా న్యాయస్థానం అంగీకరించదని లాయర్ తెలిపారు. ఇలా భార్య తన భర్తతో కాకుండా మరొకడితో బిడ్డను కన్నా ఆ బిడ్డకు భర్తే తండ్రి. ఇదే లా చెబుతోందని లాయర్ చెప్పారు.