MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • వీడసలు భర్తేనా..! హనీమూన్ వీడియోలతో కట్టుకున్న భార్యకే బ్లాక్ మెయిల్

వీడసలు భర్తేనా..! హనీమూన్ వీడియోలతో కట్టుకున్న భార్యకే బ్లాక్ మెయిల్

మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాదు బెడ్రూంలో ఏకాంతంగా వుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించి కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో నీచుడు. ఈ దారుణం ఐటీ సిటీ బెంగళూరులో వెలుగుచూసింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 08 2023, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bangalore

Bangalore

బెంగళూరు :  తానో పెద్ద బిల్డర్ అని బిల్డప్ ఇచ్చి పెళ్లిచేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఎలాగూ తన బండారం బయపడుతుందని తెలుసు... అయినా భార్య ఏం చేయకుండా వుండేందుకు ఏ భర్తా చేయనకూడని పని చేసాడు. హనీ మూన్ సమయంలో భార్యతో ఏకాంతంగా గడుపుతూ అదంతా రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియోలతో కట్టుకున్న భార్యనే ఈ నీచుడు బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bangalore

Bangalore

వివరాల్లోకి వెళితే... గతేడాది నవంబర్ లో ఓ యువతి పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంది. పెళ్లికి ముందు తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానని... సొంతంగా నిర్మాణ సంస్థ వుందని కుటుంబసభ్యులను నమ్మించి యువతి పెళ్లాడాడు. తీరా పెళ్లి తర్వాత అతడికి ఏ వ్యాపారమూ లేదని... పెళ్ళికోసమే ఇలా అబద్దాలు ఆడి మోసం చేసినట్లు బయటపడింది. 

36
Bangalore

Bangalore

భర్త మోసం గురించి తెలిసినా 28ఏళ్ళ ఈ వివాహిత ఇంతకాలం బయటపెట్టలేదు. అయితే భర్త వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఆమె ఇక భరించలేకపోయింది.  భర్త చేసిన మోసం, ఇంతకాలం అతడి బ్లాక్ మెయిల్ తో ఎంతలా నరకం అనుభవించిందో మొత్తం బయటపెట్టింది. బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 

46
Bangalore

Bangalore

తాను పెద్ద బిల్డర్ ను అని బిల్డప్ ఇచ్చి పెళ్లిచేసుకున్న భర్త హనీమూన్ కోసం థాయ్ లాండ్ తీసుకెళ్ళాడని తెలిపింది. అక్కడ మద్యం తాగించి, నీలి చిత్రాలు చూపించాడని... ఇలా బెడ్రూంలో జరిగిందంతా రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించాడని బాధిత మహిళ వివరించింది. ఈ వీడియోలతో ఇంతకాలంగా తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడంటూ వివాహిత ఫిర్యాదులో పేర్కొంది. 

56
Bangalore

Bangalore

భర్తకు ఏ వ్యాపారమూ,  ఉద్యోగమూ లేదని తెలిసి నిలదీయగా హనీమూన్ సమయంలో తీసిన వీడియోలు చూపించి తననే బెదిరించాడని వివాహిత పేర్కొంది. అంతేకాదు పెళ్ళి సమయంలో ఇచ్చిన కట్నం కాకుండా మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. ఉద్యోగం చేసే తనకు ప్రతి నెలా వచ్చే జీతం మొత్తాన్ని లాక్కునేవాడని ఆమె తెలిపింది. అతడు చెప్పినట్లు వినకుంటే హనీమూన్ వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించేవాడని... అందువల్లే ఇంతకాలం ఎంతలా వేధిస్తున్నా సహించానని వివాహిత తెలిపింది. 
 

66
Bangalore

Bangalore

అయితే ఇటీవల అతడి వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఇక భరించలేక వివాహిత పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది కాలంగా తాను అనుభవిస్తున్న నరకాన్ని పోలీసులకు వివరించింది. దీంతో సదరు భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బెంగళూరు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
Recommended image2
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image3
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved