MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Delhi Rains: ఢిల్లీలో రాళ్లవాన.. భీకర గాలులు.. విరిగిన చెట్లు, నిలిచిన విమాన సేవలు (ఫొటోలు)

Delhi Rains: ఢిల్లీలో రాళ్లవాన.. భీకర గాలులు.. విరిగిన చెట్లు, నిలిచిన విమాన సేవలు (ఫొటోలు)

ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం ఉన్నట్టుండి అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వాన పడింది. భీకరంగా గాలులూ వీచాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమాన సేవలూ కొద్ది కాలం నిలిచిపోయాయి. బలమైన గాలులకు రోడ్లపై కార్లు కూడా వణికిపోయాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.  

1 Min read
Author : Mahesh K
| Updated : May 30 2022, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
delhi rains

delhi rains

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని రోజులుగా దేశాన్ని అట్టుడుకించిన టెంపరేచర్లు ఒక్కసారిగా ఈ రోజు సాయంత్రం పడిపోయాయి. సుమారు 4.30 గంటల ప్రాంతంలో రాజధానిలో చిక్కనైన మేఘాలు కమ్ముకువచ్చాయి. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అనంతరం.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రాళ్ల వాన పడింది. చాలా వేగంతో బలమైన గాలులు వీచాయి. వడగండ్ల వాన, భీకర గాలుల కారణంగా ఢిల్లీలో విమాన సేవలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. రోడ్లపైనా అడ్డదిడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ సేవలూ నిలిచిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
delhi rains

delhi rains

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ వర్షం కురియడంతో వాతావరణం విమాన సేవలకు ప్రతికూలంగా మారింది. ఫలితంగా ఫ్లైట్ టైమింగ్స్ మారిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్లూ ఈ విషయాన్ని వెల్లడించాయి. వర్షం, ఉరుములు, మెరుపుల, వడగండ్ల కారణంగా తమ విమాన సేవలకు అంతరాయం కలుగవచ్చని ఇండిగో ట్వీట్ చేసింది. కాబట్టి, ప్రయాణికులు కాస్త ఎక్కువ సమయాన్నే ఫ్లైట్ ట్రావెల్ కోసం కేటాయించుకోవాలని సూచించింది.

34
delhi rains

delhi rains

గాలులు కూడా తీవ్రంగా వీయడంతో రోడ్లపై వాహనాలు వణికిపోయాయి. ఢిల్లీలో అక్కడక్కడ బలమైన గాలుల కారణంగా రోడ్లపై ఊగిపోతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

44
delhi rains

delhi rains

ఢిల్లీలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఈ రోజు అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని పేర్కొంది.

About the Author

MK
Mahesh K
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved