MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • ఏంటీ..! సాంబార్ ఇండ్లీ గోవా టూరిజంనే కుప్పకూలుస్తోందా!!

ఏంటీ..! సాంబార్ ఇండ్లీ గోవా టూరిజంనే కుప్పకూలుస్తోందా!!

గోవాలో ఇటీవల కాలంలో టూరిజం బాగా పడిపోతోందని... ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఇలా టూరిజం దెబ్బతినడానికి సాంబార్ ఇడ్లీ కారణమంటున్నారు ఓ బిజెపి ఎమ్మెల్యే. ఆయన లాజిక్ ఏంటో తెలుసా?   

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 28 2025, 08:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Goa Tourism

Goa Tourism

 సాంబార్ ఇడ్లీ తమిళనాడులో చాలా ఫేమస్ వంటకం. దీన్ని తమిళులు లొట్టలేసుకుంటూ తింటారు. అయితే ఈ ఇడ్లీని దేశం మొత్తానికి పరిచయం చేసారు తమిళులు... ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా టిఫిన్ అనగానే ఇడ్లీ పేరు వినిపిస్తోంది. గోవాలో కూడా సాంబార్ ఇడ్లీ హోటల్లు వెలిసాయి. 

అయితే ఇలా ఇడ్లీ సాంబార్ అమ్మడం వల్ల గోవాకు వచ్చే విదేశీ పర్యాటకులు తగ్గిపోయారని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో బాంబు పేల్చారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Goa Tourism

Goa Tourism

కలంగుట్ ప్రాంతంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైఖేల్ లోబో మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతాలకు విదేశీ పర్యాటకుల రాక తగ్గితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించదని అన్నారు. అక్కడి స్థానిక పాలకులు, వ్యాపారులు, ప్రజలే పర్యాటకులు తగ్గడానికి కారణమని అన్నారు. గోవా ప్రజలు తమ సొంత సముద్ర తీర ప్రాంతాలను ఇతర రాష్ట్రాల వారికి అద్దెకు ఇవ్వడం బాధాకరమని లోబో అన్నారు.

 

34
Goa Tourism

Goa Tourism

గోవాలో ఇడ్లీ సాంబార్ వివాదం

బెంగళూరుకు చెందిన వాళ్లు గోవాకు వచ్చి వడ పావ్ అమ్ముతున్నారు. కొందరు ఇక్కడ ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. అందుకే గత రెండేళ్లుగా గోవాకు అంతర్జాతీయ పర్యాటకుల రాక తగ్గిందని ఆయన చెప్పారు. ఇలా గోవాలోకి ప్రవేశించిన ఇతర ఆహార పదార్థాలే రాష్ట్రంలో పర్యాటకుల రాకను ప్రభావితం చేసాయని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు.

ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే భారత పర్యటనకు వచ్చేవారు గోవా కంటే ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. గోవా పర్యాటక శాఖతో పాటు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్లు విదేశీ పర్యాటకుల రాక తగ్గడానికి కారణం... వీళ్లు ఈ విషయం తెలుసుకోవాలని అన్నారు. 

44
Goa Tourism

Goa Tourism

యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల పర్యాటకులు గోవాకు రావడం లేదని... పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల పర్యాటకులు కూడా గోవాకు రావడం ఆపేశారని లోబో అన్నారు. ఇక్కడ మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే పర్యాటక రంగం మరింత వెనక్కి పోతుందని లోబో హెచ్చరించారు. అంతేకాదు గోవాలో ఇడ్లీ సాంబార్ అమ్మడం ఆపేయాలని కూడా ఆయన మాట్లాడారు. ఆయన మాటలకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image3
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved