జాతీయ జెండా విషయంలో ఈ తప్పులు చేస్తే.. జైలుకు వెళ్లాల్సిందే.
జాతీయ జెండా గుర్తురాగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 14వ తేదీ, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన జాతీయ జెండాను ఎగరవేస్తుంటాం. అయితే జాతీయ జెండా విషయంలో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని మీకు తెలుసా.? ఇంతకీ ఆ తప్పులు ఏంటంటే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
1950 జనవరి 26వ తేదీ నుంచి భారతదేశంలో సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా రిపబ్లిక్ డేని నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణమైన ఎందో త్యాగమూర్తులను స్మరించుకుంటాం. జాతీయ జెండాను సెల్యూట్ చేస్తాం. 1921లో పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించగా అప్పట్లో అది జాతీయ కాంగ్రెస్ జెండాగా చెలామణిలో ఉండేది.
బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత ఫ్లాగ్ కమిటీ జాతీయ కాంగ్రెస్ జెండాలో స్వల్ప మార్పులు చేసింది. జెండా మధ్యలోని రాట్నం స్థానంలో 24 ఆకులు ధర్మచక్రం పెట్టి జాతీయ జెండాను రూపొందించింది. జులై 22న అధికారికంగా బాబూ రాజేంద్రప్రసాద్‌కు ఆ జెండాను అందించింది. అప్పటి నుంచి ఇదే జెండాను అమల్లోకి తీసుకొచ్చారు. ఎంతో గౌరవించే జాతీయ జెండా విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటంటే..
* జెండాను ఎగరవేసే సమయంలో చెప్పులు ధరించకూడదని చెబుతారు. అలాగే ఎలాంటి శబ్ధాలు చేయకూడదు.
* జాతీయ పతాకాన్ని ఖాదీ, చేనేత వస్త్రాలతో మాత్రమే తయారు చేయాలి. నూలు, పత్తి, ఉన్ని ముడి పదార్థాలుగా వాడొచ్చు.
* జాతీయ జెండా పొడవు, వెడల్పుల పరిమాణం కచ్చితంగా 3:2 నిష్పత్తిలో ఉండాలి.
* సూర్యోదయం తర్వాత జెండాను ఎవరవేస్తారు. అయితే సూర్యస్తమాయానికి ముందే కిందికి దించాలి. స్కూళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా చేయాలి.
* జాతీయ జెండాను ఇతర వస్తువులతో తయారు చేస్తూ మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
* జాతీయ జెండాకు సమానంగా కానీ, ఎత్తులో కానీ ఇతర జెండాలు ఎగరవేయకూడదు. రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జెండాలు ఎగరవేసే సమయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
* జాతీయ జెండాను నెల మీద కానీ, నీటి మీద కానీ పడనీయకూడదు.
* జాతీయ జెండాపై ఎలాంటి రాతలు రాయకూడదు.
* జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో ఎడమ చేతితో తాడు లాగుతూ కుడి చేత్తో జెండాను పైకి లేపాలి.
* జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం నేరంగా పరిగణిస్తారు.
* జాతీయ జెండా చిరిగా, కాలినా నేరంగా పరిగణిస్తారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ల వాహనాల్లో తప్ప ఎవరి వాహనాల్లో త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించకూడదు.