Delhi Election Results : కేజ్రీవాల్ ని మన కవితమ్మే ముంచేసిందా?
Kavitha is the Reason for Kejriwal's Defeat : డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇందుకు తెలంగాణ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత ప్రధాన కారణమయ్యారు.. ఎలాగంటే...

delhi election results 2025
Delhi Elections 2025 : దేశ రాజధాని డిల్లీలో ఇక డబుల్ ఇంజన్ సర్కార్ నడవనుంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో వరుస విజయాలతో మూడోసారి డిల్లీ పీఠమెక్కిన బిజెపి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత డిల్లీ అసెంబ్లీలో కాషాయ జెండా ఎగరబోతోంది. దశాబ్ద కాలంగా అధికారం చేలాయించిన ఆప్ ను డిల్లీ ప్రజలు ఊడ్చిపడేసారు.
అయితే ఆప్ ఘోర పరాజయానికి కేజ్రీవాల్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. మరీముఖ్యంగా డిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్ ఓటమిలో కీలకపాత్ర పోషిందనే చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే ఈ కేసులో ప్రధాన పాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమనే చెప్పుకోవచ్చు.
Kalvakuntla kavitha
ఆప్ ఓటమిలో కేసీఆర్ కూతురు కవిత పాత్ర :
కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంచేసిన అన్నా హజారే శిష్యుడిగా వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ను డిల్లీ ప్రజలు ఎంతగానో నమ్మారు. అవినీతి రహిత పాలన అందిస్తాడని విశ్వసించి వరుసగా 12 ఏళ్లు అధికారం కట్టబెట్టారు.
అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆప్ ప్రభుత్వం లిక్కర్ స్కాం కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఈ స్కాం జరిగిందని బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేజ్రీవాల్ తో పాటు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఈ లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలా అవినీతి రహిత పోరాటంనుండి వచ్చిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ డిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వున్నాయి. లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర వుందని... సౌత్ గ్రూప్ గా ఏర్పడి వందలకోట్ల రూపాయలు డిల్లీలోని ఆప్ ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పడంలో కవిత కీలకంగా వ్యవహరించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్దారించాయి. ఈ వ్యవహారంలో కవితను కూడా అరెస్ట్ చేసారు.
ఇలా ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన డిల్లీ మధ్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి తాజాగా డిల్లీ ఎన్నికల పలితాలు ఆప్ కు వ్యతిరేకంగా రావడంలో ఆమె కూడా ఓ కారణమని చెప్పవచ్చు. బిజెపి నాయకులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టులనే కాదు కవిత అరెస్ట్ ను కూడా డిల్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. ఆమె ఆప్ కు ఎన్నికోట్లు ఇచ్చిందో చూడండి అంటూ ఆప్ అవినీతిని హైలైట్ చేయడంలో కవిత పేరును వాడుకున్నారు. ఈ ప్రచారం బిజెపికి కలిసివచ్చింది.
Arvind Kejriwal and Manish Sisodia lost
డిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అందరూ ఓడారు...
డిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా వుండగానే అరెస్టయ్యారు. అంతకుముందే డిప్యూటీ సీఎంగా వున్న మనీష్ సిసోడియా, మంత్రిగా వున్న సత్యేంద్ర జైన్ కూడా అరెస్టయ్యారు. ఇలా మధ్యం కుంభకోణంలో అరెస్టయి తమ పదవులను కోల్పోవడమే కాదు జైలుజీవితం గడపాల్సి వచ్చింది.
అయితే ఈ ఎన్నికల్లో తమ అరెస్ట్ ను సానుభూతిగా మార్చుకునే ప్రయత్నంచేసారు ఈ ముగ్గురు నేతలు. కానీ ప్రజలు వారిని నమ్మలేదు... వారిపై ఏమాత్రం సానుభూతి చూపలేదు. దీంతో లిక్కర్ స్కాంలో అరెస్టయిన ముగ్గురు ఆప్ నేతల ఓటమిపాలయ్యారు.
డిల్లీ మధ్యం కుంభకోణంలో కేజ్రీవాల్ దాదాపు 5 నెలలు జైల్లో వున్నారు. ఇక సిసోడియా, సత్యేంద్ర జైన్ రెండేళ్లపాటు జైలుజీవితం గడిపారు. ఇలా జైలుకు వెళ్లివచ్చిన ముగ్గురిలో కేజ్రీవాల్ న్యూడిల్లీ, సిసోడియా జంగ్ పురా, సత్యేంద్ర జైన్ షత్పుర పుర నుండి పోటీచేసారు.కానీ ఆ నియోజకవర్గాల ప్రజలు వారిని ఓడించారు.