MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కూతురి ప్రేమను కాదన్నందుకు తల్లిని హత్య చేసిన ప్రియుడు...

కూతురి ప్రేమను కాదన్నందుకు తల్లిని హత్య చేసిన ప్రియుడు...

వయసులో పెద్దవాడితో కూతురు ప్రేమలో పడడం తల్లి ఇష్టపడలేదు. దీంతో కోపానికి వచ్చిన ఆ ప్రియుడు ఆ తల్లినే హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 10 2023, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉత్తర ప్రదేశ్ : ప్రేమను నిరాకరిస్తే ప్రియురాలినో, ప్రియుడినో చంపడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో.. తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిని దారుణంగా చంపేశాడు ఓ ప్రేమికుడు. తమ ప్రేమకు అడ్డు చెబుతోంది అన్న కోపంతో ప్రియురాలి తల్లిని ఓ యువకుడు పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపేశాడు. అయితే తల్లిని ఇలా చంపడం వెనక ఆమె మైనర్ కూతురు పాత్ర కూడా ఉందని ప్రాథమిక అంచనాలో పోలీసులు గమనించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్  ఆగ్రాలోని భావన అరోమా హౌసింగ్ సొసైటీ పరిధిలో ఈ దారుణం జరిగింది.  మృతురాలు అంజలి బజాజ్. బుధవారం రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదు. ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్  దంపతులు.  వీరికి ఓ కుమార్తె ఉంది. ఉదిత్ బజాజ్ ఫుట్వేర్ వ్యాపారి.  ఉత్తరప్రదేశ్ లోని సికంద్రా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి నుంచి భార్య కనిపించడం లేదంటూ ఉదిత్ ఫిర్యాదు చేశాడు 

35

సమీపంలోని మహాదేవ్ ఆలయానికి వెళ్లిన అంజలి మళ్లీ తిరిగి రాలేదని తన ఫిర్యాదులో ఉదిత్  తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని మహాదేవ్ ఆలయ సమీపంలో కనిపెట్టారు. గుడికని వెళ్లిన తన భార్య శవంగా మారడం.. అసలు ఆమెను ఎవరు? ఎందుకు? చంపారో తెలియక ఉదిత్ దిగ్భ్రాంతికి  గురయ్యాడు.  అయితే పోలీసుల దర్యాప్తులో అంజలిని చంపింది.. కూతురి ప్రియుడుగా తేలింది. 

45

దీని గురించి వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.  కుమార్తె తల్లిని మహాదేవ్ ఆలయానికి వచ్చేలా చేసింది.  ఆమెకు తోడుగా తండ్రి కూడా వచ్చాడు. దీంతో తన తెలివిని ఉపయోగించి తండ్రికి ఫోన్ చేసి ఆయన మరోచోటికి వెళ్లేలా చేసింది కూతురు. అలా కాసేపు తర్వాత తిరిగి వచ్చేసరికి ఆలయం దగ్గర భార్య కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. భార్య మృతి వెనక కూతురి హస్తం ఉందని తెలియడంతో షాక్ అయ్యాడు. 

55

తన టీనేజ్ కూతురు వయసులో చాలా పెద్దవాడైన ప్రాకర్  గుప్తాతో  ప్రేమలో పడింది. ఈ ప్రేమను అంజలి ఒప్పుకోలేదు.దీంతో అంజలి మీద కోపం పెంచుకున్న ప్రాకర్ ఆమెను హత్య చేశాడు. ఈ హత్యలో ప్రాకర్ తో పాటు అతని స్నేహితుడు,  అంజలి కూతురు పాత్రలు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం గాలిస్తున్నారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Recommended image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
Recommended image3
Now Playing
CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved