MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • బిపర్ జాయ్ తుపాను : గుజరాత్‌లో తీరం దాటి, విధ్వంసం.. రాజస్థాన్‌ దిశగా ప్రయాణం..

బిపర్ జాయ్ తుపాను : గుజరాత్‌లో తీరం దాటి, విధ్వంసం.. రాజస్థాన్‌ దిశగా ప్రయాణం..

గుజరాత్‌లోని బిపార్‌జోయ్ ప్రభావిత ప్రాంతాలలో దాదాపు 99 రైళ్లు రద్దు చేయడం లేదా షార్ట్ టెర్మినేట్ అవుతాయని పశ్చిమ రైల్వే తెలిపింది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 16 2023, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

న్యూఢిల్లీ : 'అతి తీవ్రమైన' తుఫాను బిపార్జోయ్ గురువారం గుజరాత్‌లో తీరాన్ని తాకడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి, కనీసం ఇద్దరు మరణించారు, 22 మంది గాయపడ్డారు. రాజస్థాన్ మీదుగా ఈ సాయంత్రం తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

210

తుపాన్ కు సంబంధించిన 10 అప్‌డేట్‌లు ఇవి..

ల్యాండ్ ఫాల్ తర్వాత బిపార్జోయ్ తుఫాను తీవ్రత 'అతి తీవ్రమైన' కేటగిరీ నుండి 'తీవ్రత'కి తగ్గిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. "తుఫాను ఇప్పుడు సముద్రం మీది నుండి సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమైంది. తుఫాను తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గింది" అని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.

310

భారీ వర్షంతో పాటు ఈదురు గాలులతో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో 524 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల కాపరి, అతని కుమారుడు మరణించారు.

410

10 రోజులకు పైగా అరేబియా సముద్రాన్ని అతలాకుతలం చేసి.. గురువారం సాయంత్రం 125 - 140 కి.మీ.ల మధ్య వేగంతో గాలులతో గుజరాత్‌లోని జాఖౌ పోర్ట్ సమీపంలో బీపర్జోయ్ తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత చాలా గంటల తర్వాత, శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు బలాన్ని కోల్పోవడం ప్రారంభించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

510

తుఫాను వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ ఎం మోహపాత్ర తెలిపారు.

అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం, చెట్లు, కొమ్మలు పడిపోవడం గురించి ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
 

610
Cyclone Biparjoy

Cyclone Biparjoy

అంతకుముందు రోజు, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో టెలిఫోనిక్ సంభాషించారు. తుఫాను తీరం దాటడంతో పరిస్థితిని సమీక్షించారు. గిర్ ఫారెస్ట్‌లో సింహాలు సహా వన్యప్రాణుల భద్రత ఏర్పాట్ల వివరాలను కూడా ప్రధాని మోదీ అడిగారు.

710

94,000 మంది ప్రజలు తీరప్రాంతం, లోతట్టు ప్రాంతాల నుండి ఆశ్రయం పొందారని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. తుపాను ప్రభావం రైళ్ల రాకపోకలపైనా పడింది. గుజరాత్‌లోని బిపార్‌జోయ్ ప్రభావిత ప్రాంతాలలో నడుస్తున్న దాదాపు 99 రైళ్లు రద్దు చేయబడతాయని లేదా షార్ట్ టెర్మినేట్ అవుతాయని పశ్చిమ రైల్వే తెలిపింది.
 

810

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 18 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎడిఆర్ఎఫ్) 12 బృందాలు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలు తీరప్రాంత జిల్లాల్లో ఉన్నాయి.

910

రేపటి వరకు చేపలవేట నిలిపివేయబడింది. ఓడరేవులు మూసేశారు. ఓడలకు లంగర్లు వేశారు. రెండు ప్రసిద్ధ ఆలయాలు.. దేవభూమి ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయం.. గురువారం మూసివేశారు.

1010

గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు శుక్రవారం వరకు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో విమానాశ్రయాన్ని నడపడానికి అవసరమైన డీజిల్‌, పెట్రోలు నిల్వ ఉంచినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Recommended image2
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో
Recommended image3
Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved