KGF Chapter 2: 'కేజీయఫ్: ఛాప్టర్2' రివ్యూ
తొలి భాగానికి సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘కేజీయఫ్-2’. మరి ఆ ఎక్సెపెక్టేషన్స్ ని అందుకుందా? గరుడను చంపిన తర్వాత రాఖీభాయ్ కేజీయఫ్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు?
ఈ మధ్యకాలంలో బాహుబలి చిత్రం తర్వాత ఆ స్దాయిలో సీక్వెల్ రిలీజ్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది కేజీఎఫ్ 2 నే. సైలెంట్ గా వచ్చి భాక్సాఫీస్ దగ్గర వైలెంట్ గా కలెక్షన్స్ వసూలు చేసిన కేజీఎఫ్ కు సీక్వెల్ కావటంతో ఈ సినిమా కోసం మాస్,క్లాస్ అని తేడాలేకుండా జనం వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. దాంతో ట్రైలర్ రాకుండానే ఈ సినిమాకు అంచనాలు పెరిగిపోయాయి. (KGF Chapter 2 movie review)యష్ పోస్టర్ పడగానే సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దానికి తోడు సంజయ్ దత్ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాలో కనిపించటం కూడా కలిసి వచ్చింది. అయితే అదే సమయంలో ఈ పెరిగిన ఎక్సపెక్టేషన్స్ కు తగినట్లు సినిమాని నెక్ట్స్ లెవిల్ లో తీసుకెళ్లాల్సిన భాధ్యత దర్శకుడు ప్రశాంత్ నీల్ పై పడింది. ఏ మాత్రం ఫార్ట్ వన్ కు దగ్గరలో లేకపోయినా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ఈ విషయం అర్దం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎలా తీర్చిదిద్దారు. ఈ సీక్వెల్ లో ఈ కథకు ముగింపు ఇచ్చారా..అసలు ఈ సారి చెప్పిన కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
ఈ కథ చెప్పుకునే ముందు ఫస్ట్ పార్ట్ లో ఏమి జరిగిందో ఓ సారి గుర్తు చేసుకోవాలి. రాకీ కేజీఎఫ్ బంగారు గనుల్లోపనిచేసే కార్మికులకు దేవుడిగా మారుతాడు. వారిని హింసించి, వారి ప్రాణాలను తీసేవాళ్లను దారుణంగా చంపేస్తాడు. ఆ బంగారు గనుల యజమాని అయిన గరుడను సైతం వదిలిపెట్టడు. చివరకు కేజీఎఫ్ రాకీ సొంతమవుతుంది. అక్కడి నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2 మొదలవుతుంది. (KGF Chapter 2 movie review)
ఈ కథను నేరేట్ చేస్తున్న జర్నలిస్ట్ ఆనంద్ కు హార్ట్ స్ట్రోక్ రావటంతో ఆయన కుమారుడు వాసిరాజు విజియేంద్ర (ప్రకాష్ రాజ్) నేరేషన్ కంటిన్యూ చేస్తాడు. ఇప్పటి కథలో కేజీఎఫ్ పై చాలా మంది కన్ను ఉంది. (KGF Chapter 2 movie review) వాళ్లంతా ఇప్పుడు రాకీని అడ్డు తొలిగించి ఆ గనులు సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు రాకీ తో రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ తదితరులు వెంట ఉంటారు. కానీ రాకీ వీళ్లలో ఎవరినీ నమ్మడు.. వీళ్లను ఓ కంట కనిపెడుతూనే కేజీఎఫ్ లో సెటిల్ అయిపోతాడు.
అప్పుడు అత్యంత క్రూరుడైన అథీరా (సంజయ్ దత్) రంగంలోకి దూకుతాడు. అథీరా అండతో కేజీఎఫ్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు ప్రత్యర్దులు. మరో ప్రక్క ప్రభుత్వం సైతం కేజీఎఫ్ గనులలో ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేస్తూంటుంది. (KGF Chapter 2 movie review)భారత ప్రధాని రమీకా సేన్ (రవీనా టండన్) సైతం సీన్ లోకి వస్తుంది. రానీ సామ్రాజ్యాన్ని కూల్చాలని నిర్ణయం చేస్తుంది. ఓ ప్రక్కన అధీరా, మరో ప్రక్క దేశ ప్రధాని ఇలా రెండు పెద్ద శక్తులతో రాఖీ బాయ్ ఎలా పోరాడాడు. అధీరా పై విజయం సాధించాడా..? రమీకా సేన్ ప్రభుత్వం ఊరుకుందా.? ముగింపేంటి అనే వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను చూడాల్సిందే.
ఎలా ఉంది...
యాక్షన్ ,క్రైమ్ ఉండే సినిమాలు ఏ మాత్రం ఓ పద్దతిగా ఉన్నా భాక్సీఫీస్ దాన్ని హత్తుకుంటుంది. దానిపై కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కేజీఎఫ్ పార్ట్ వన్ కు అదే జరిగింది. సినిమాలో విపరీతమైన క్రైమ్, యాక్షన్ ఎపిసోడ్స్ జనాలకు తెగ నచ్చేసాయి. ఈ విషయాన్ని గమనించి దర్శకుడు కేజీఎఫ్ మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్‌లో వయొలెన్స్, యాక్షన్ మోతాదు పెంచాడు. హీరోకు ఓ ప్రక్కన క్రూరమైన అధీరాతో పోరాటం, మరో ప్రక్క దేశ ప్రధానితోనే వైరం అనే రెండు పెద్ద ఛాలెంజ్ లు ఎదురుగా పెట్టాడు. (KGF Chapter 2 movie review)దాంతో హీరోయిజం ఎలివేట్ చేయటానికి రెట్టింపు అయ్యింది. ఫస్ట్ ఫార్ట్ లో సామాన్యుడు ...అసమాన్యుడు అవటం చూపెడితే..సెకండ్ పార్ట్ లో అసమాన్యుడు ....అసాధ్యుడు అవటం ఓ లెజండ్ గా కీర్తింపబడటం గమనించవచ్చు.
హీరో క్యారక్టర్ గ్రోత్ ,ఆర్క్ అందుకు ఎంచుకున్న సీన్స్ సినిమాని మాస్ కు మరింత దగ్గర చేసాయి. అయితే ఫస్ట్ పార్ట్ లో కనిపించే ఎమోషన్ డెప్త్ ఇందులో మనకు కనపడుదు. తల్లి సెంటిమెంట్ సీన్స్ వస్తూంటాయి కానీ మనకేమీ ...పెద్దగా అనిపించలేదు. చూసిందే మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. దానికి తోడు స్క్రీన్ ప్లే చాలా గందళగోళంగా ఉంటుంది. తెరపై వరసపెట్టి యాక్షన్ సీన్స్ జరుగుతూంటాయి. కానీ ఒకదానికొకటి లింక్ గా కనపడవు. (KGF Chapter 2 movie review)ముఖ్యంగా ఫస్టాఫ్ లో డైరక్టర్ ...హీరో ఎలివేషన్స్ మీద ఎక్కువ శ్రద్ద పెట్టారు. అది సినిమాకు ప్లస్ అయ్యింది..మైనస్ కూడా అయ్యింది. ఇంటర్వెల్ మాత్రం మళ్లీట్రాక్ లో కి వచ్చారు. అక్కడిదాకా పెద్ద గా ఏమీ జరుగుతున్నట్లు అనిపించదు. సెకండాఫ్ లో మాస్ ఎలివేషన్స్ , ట్విస్ట్ లు ఉన్నంతలో ఉత్సాహపరుస్తాయి. కొంత ఓవర్ గా,ఓవర్ డోస్ గా అనిపించినా కేజీఎఫ్ కు ఇది చెల్లుబాటులే అని సరిపెట్టుకుంటాము. ప్రీ క్లైమాక్స్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వకపోయినా క్లైమాక్స్ మాత్రం మళ్లీ లేచి కూర్చో పెట్టింది.
అయితే ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ ఇవ్వదు. ఫస్ట్ పార్ట్ నాటికి ఈ సినిమాపై ఏ ఎక్సపెక్టేషన్స్ లేవు. అప్పటికి అధి తెరపై మహాద్బుతం. అయితే ఆల్రెడీ కేజీఎఫ్ ని,రాకీ భాయ్ ని చూసేస కాబట్టి ఇంకా ఏదన్నా కొత్తదనం ఎక్సపెక్ట్ చేస్తాం. అది ఈ సినిమా ఇవ్వదు. (KGF Chapter 2 movie review)అలాగే అధీరాగా సంజయ్ దత్ అంత క్రూరత్వం చూపలేకపోయాడు. రాకీ భాయ్ ముందు తేలిపోయాడు. దాంతో ఆ సీన్స్ పెద్దగా కాంప్లిక్ట్స్ రైజ్ కాలేదు. ఏదైమైనా ఫ్యామిలీలకు దూరంగా, మాస్ కు దగ్గరగా ఈ సినిమా రూపొందింది.
గ్రాండియర్ గా కనిపించే ఎపిసోడ్స్ నచ్చుతాయి. అలాగే ఈ సినిమాలో ఏకంగా ప్రధానికే హీరో వెళ్లి వార్నింగ్ ఇవ్వటం, పార్లమెంట్ లో అందరూ చూస్తూండగా వెళ్లి ప్రధాని ఎదురుగా ఓ ఎంపీని చంపేయటం వంటి ఎపిసోడ్స్ ఎంత సినిమా అనుకుని చూసినా మనస్సు ఒప్పుకోదు. (KGF Chapter 2 movie review)అంత తెలివైన రాకీ భాయ్...దేశ ప్రధానిని ఎదిరిస్తే ఏం జరుగుతుందా ఊహించలేడా?బిల్డప్ సీన్స్ కు అయినా ఓ హద్దు ఉండాలి కదా అనిపిస్తుంది.
ఎవరెలా చేసారు
ఈ పార్ట్ లో యష్.. రాకీ పాత్రలో జీవించాడనే చెప్పాలి. అయితే ధనుష్ కు డబ్బింగ్ చెప్పేవాళ్ళ చేత చెప్పించినట్లున్నారు. ధనుషే మాట్లాడుతున్నట్లు చాలా సార్లు అనిపించింది. అధీరా పాత్రలో సంజయ్ దత్ ఓకే అనిపించారు. వయస్సు మీద పడిన విషయం స్పష్టం అవుతోంది. (KGF Chapter 2 movie review)ఎంత లుక్ మార్చినా ముఖంలో ఆ ఇబ్బంది కనపడుతోంది. వీరితోపాటు శ్రీనిధి శెట్టి, ప్రధానిగా రవీనా టాండన్, సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్, అనంత్ నాగ్ పాత్రలో ప్రకాశ్ రాజ్ లు ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు.
టెక్నికల్ గా ...
డైరక్టర్ ప్రతీ సీన్ ని క్లైమాక్స్ లా ఊహించి తీసారని అర్దమవుతుంది. అలాగే హీరో కనపడిన ప్రతీసారి ఓ ఇంట్రడక్షన్ సీన్ అన్నట్లు ఎలివేషన్స్,బిల్డప్ లు ఇచ్చారు. అలాగే బాహుబలి మాహాష్మతి సామ్రాజ్యంలా...కేజీఎఫ్.. నరాచీ సామ్రాజ్యం కూడ కొన్నాళ్లు గుర్తుండిపోయే విజువల్స్ తో తీర్చి దిద్దారు. (KGF Chapter 2 movie review)అందుకు టెక్నికల్ టీమ్ బాగా సహకరించిందనటంలో సందేహం లేదు. అసలు ఓ కన్నడ సినిమా ఈ స్దాయిలో ఉంటుందని అసలు ఊహించం.
రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియోటర్ నుంచి బయిటకు వచ్చినా చెవుల్లో వినపడుతుంది. తమన్ కు తమ్ముడిలా ఉన్నాడు. భువన్ గౌడ కెమెరా వర్క్ అయితే హాలీవుడ్ స్దాయిని తలపించింది. తెలుగు డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ కాస్త కన్ఫూజన్ క్రియేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓ రేంజిలో ఉన్నాయి. స్క్రిప్టులో గందరగోళం తగ్గిస్తే ఇంకాస్త బాగుండేది.
ప్లస్ లు
యష్ స్టైల్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ లు
స్క్రీన్ ప్లే
లెంగ్త్
ఎమోషనల్ డెప్త్ లేకపోవటం
వీక్ విలనీ
తేలిపోయిన విఎఫ్ ఎక్స్ షాట్స్
ఫైనల్ థాట్
నిర్మాతకు ఈ సినిమా కేజీఎఫ్ (బంగారు గనే)..చూసేవాళ్లకు మాత్రం బిల్డప్ లు,ఎలివేషన్స్ గని
(KGF Chapter 2 movie review)
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.75
తెర వెనక..ముందు
నటీనటులు: యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, ఈశ్వరిరావు, అచ్యుత్‌కుమార్, మాళవిక అవినాశ్ తదితరులు;
సంగీతం: రవి బస్రూర్; (KGF Chapter 2 movie review)
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ;
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి;
నిర్మాత: విజయ్ కిరంగదూర్;
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్;
విడుదల: 14-04-2022