MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?

విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?

విజయ్‌ సేతుపతి చివరగా `మహారాజా` చిత్రంతో అలరించారు. ఇప్పుడు `ఏస్‌` మూవీతో వస్తున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

4 Min read
Author : Aithagoni Raju
Published : May 23 2025, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్‌ సేతుపతి `ఏస్‌`తో మరోసారి అదరగొట్టాడా?
Image Credit : x

విజయ్‌ సేతుపతి `ఏస్‌`తో మరోసారి అదరగొట్టాడా?

విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్‌గా, ఇంకోవైపు బలమైన కీలక పాత్రల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. చివరగా ఆయన తెలుగు ఆడియెన్స్ ని `మహారాజా` చిత్రంతో అలరించారు. ఇప్పుడు `ఏస్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. 

స్వీయ దర్శకత్వంలో 7సీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై లి పతాకంపై అరుముగ కుమార్‌ ఈ మూవీని నిర్మించడం విశేషం. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యోగిబాబు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(మే 23న) విడుదలైంది. మరి మూవీ ఎలా ఉంది? విజయ్‌ సేతుపతి మరోసారి అదరగొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`ఏస్‌` మూవీ స్టోరీ ఇదే
Image Credit : x

`ఏస్‌` మూవీ స్టోరీ ఇదే

బోల్ట్‌ కాశీ(విజయ్‌ సేతుపతి) తన గతాన్ని వదిలేసి, పేరు మార్చుకుని ఈ సారి బుద్దిగా ఉండాలని, ఏదైనా పని చేసి బతకాలని చెప్పి మలేషియా వెళ్తాడు. అక్కడ సేతు(యోగిబాబు) పరిచయం అవుతాడు. పని కోసం వచ్చింది తనే అని భావించి అతన్ని తనతోపాటు తీసుకెళ్తాడు సేతు. బోల్డ్ కాశీ కూడా ఆయన వెంట వెళ్తాడు, చెప్పిన పని చేస్తాడు. 

కాశీ దొంగ అని ఆయన ఒకరి పర్సు కొట్టేయడం చూసిన రుక్కు(రుక్మిణి వసంత్‌) భావిస్తుంది. ఆ పర్సు ఎందుకు కొట్టేశానో రుక్కుకి చెప్పే ప్రయత్నం చేస్తాడు కాశీ. ఈ క్రమంలో వీరిద్దరు బాగా క్లోజ్‌ అవుతారు. తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. ప్రేమలో పడతారు. రుక్కుకి ఇంట్లో సమస్యలుంటాయి. వాళ్ల స్టెప్‌ ఫాదర్‌ రాజదురై(బబ్లూ పృథ్వీ) తనని వేధిస్తుంటాడు, తన అమ్మని పెళ్లి చేసుకున్నందుకు ఆమె ఇంటిని కబ్జా చేసి, ఇబ్బంది పెడుతుంటాడు. 

ఆ ఇంటిని వదిలేయాలంటే ఒక మిలియన్‌ మలేషియా డబ్బు కావాలంటాడు. అందుకోసం రోజూ కష్టపడుతుంది రుక్కు. మరోవైపు సేతు ఇష్టపడ్డ అమ్మాయి షాలినికి తన షాప్‌ సొంతం చేసుకోవడానికి ఒక మిలియన్‌ మనీ కావాల్సి వస్తుంది. అయితే రుక్కు కష్టాలు తీర్చేందుకు అప్పు కోసం పెద్ద స్మగ్లర్‌ ధర్మ(బీఎస్‌ అవినాష్‌) వద్దకు వెళితే అక్కడ జూదం ఆడి ఐదు లక్షలు అప్పు చేస్తాడు కాశీ. 

దీంతో ఆ అప్పు తీర్చాల్సి వస్తుంది. ఇవన్నీ పీకలమీదకు వస్తాయి. చేసేదేం లేక బ్యాంక్‌ దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటాడు కాశీ. సేతుతో కలిసి ప్లాన్‌ చేస్తాడు. మొత్తానికి డబ్బు కొట్టేస్తారు. కానీ పోలీసులు వెంబడిస్తారు. ఓ పోలీస్‌ కాశీని చూస్తాడు. మరి కాశీ పోలీసులకు దొరికాడా? రుక్కు కష్టాలు తీరాయా? షాలినీకి షాప్‌ సొంతమైందా? సేతు కోటీశ్వరుడు అయ్యాడా? ఇంతకి కాశీ ఎవరు? సేతు ఏం చేస్తుంటాడు? రాజదురై నుంచి రుక్కు ఎలా బయటపడింది? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
70 ఏళ్ల హీరోతో 40 ఏళ్ల త్రిష ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ పై విమర్శలు, క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Related image2
అందరూ ఫ్లాప్ అనుకున్నారు, వరుసగా 3 షోలు చూసిన నాగార్జున చెల్లెలు.. కట్ చేస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
36
`ఏస్‌` మూవీ విశ్లేషణః
Image Credit : x

`ఏస్‌` మూవీ విశ్లేషణః

మనీ చుట్టూ తిరిగే క్రైమ్‌ కామెడీ మూవీ ఇది. తెలుగులో ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. డబ్బు కోసం రెండు మూడు గ్యాంగ్‌లు ప్రయత్నించడం, హీరో గ్యాంగ్‌ డబ్బు కాజేయడం, పట్టుకునేందుకు విలన్స్ గ్యాంగ్‌ ప్రయత్నించడం చాలా సినిమాల్లో చూశాం. ఇందులోనూ కాస్త అటు ఇటుగానే చూపించారు.

 అయితే ఈ సినిమాలో లవర్‌ కోసం దొంగగా మారతాడు హీరో. కానీ అనుకోని చిక్కుల్లో పడతాడు. ఒక సమస్య నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే, మరో చిక్కుల్లో పడటం జరుగుతుంటుంది. ఈక్రమంలో పుట్టే కామెడీ, ఉత్కంఠ భరిత సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. కథగా రొటీన్‌గానే అనిపించింది. తెరకెక్కించిన తీరు, స్క్రీన్‌ ప్లే నడిపించిన తీరు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 

రియాలిటీగా చూపిస్తూనే ఫన్‌ క్రియేట్‌ చేసిన తీరు బాగుంది. జనరల్‌గా ఇలాంటి సినిమాల్లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో డ్రామాకి ఎక్కువగా స్కోప్‌ ఇవ్వకుండా, సహజంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇది జెన్యూన్‌ అటెంప్ట్ లా ఉండటం విశేషం.

 అందుకే ఫన్‌ సీన్లు కూడా సహజంగా వర్కౌట్‌అయ్యింది. కామెడీ వర్కౌట్‌ అయ్యింది. అలాగని హిలేరియస్‌ కామెడీగా ఉండదు. సందర్భానుసారంగా ఫన్‌, సీరియస్‌ నెస్‌, యాక్షన్‌, ఇన్నోసెన్సీని జోడించి తెరకెక్కించిన తీరు బాగుంది. అదే ఇందులో స్పెషాలిటి.

46
`ఏస్‌` మూవీలో హైలైట్స్, మైనస్‌లు
Image Credit : x

`ఏస్‌` మూవీలో హైలైట్స్, మైనస్‌లు

ఇక ఫస్టాఫ్‌ ప్రారంభంలో విజయ్‌, రుక్మిణి వసంత్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ కొత్తగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ప్రేమలో పడేంత వరకు కలిసి తిరిగేంత వరకు బాగానే ఉంది. కానీ హీరోయిన్‌ కష్టాలు బయటకు చెప్పినప్పుడు, అసలు విషయం హీరోకి తెలిసినప్పుడు ఆమె కోసం తాను డబ్బు ప్రయత్నాల్లో ఉండటం వంటి సీన్లు కథని మరోవైపు తీసుకెళ్తాయి.

 కంప్లీట్‌గా ట్రాక్‌ మారింది. దీంతో కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్లు, విలన్‌తో పేకాట ఆడి డబ్బులు గెలిచే సీన్లు హైప్‌ ఇచ్చేలా ఉన్నాయి. కానీ అంతలోనే డల్‌ చేశారు. బ్యాంక్‌ రాబరీ చేసే సీన్లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లు మళ్లీ కాస్త డల్‌గా అనిపిస్తుంటాయి. 

క్రైమ్‌ సీన్‌లోకి బబ్లూ పృథ్వీరాజ్‌ పాత్ర ఎంట్రీతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మరోవైపు విలన్‌ బ్యాచ్‌ వీరి కోసం వెతకడం వంటి సీన్లు క్యూరియాసిటీని కలిగిస్తాయి. క్లైమాక్స్ సస్పెన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్తుంది. కాకపోతే ఇంకా బాగా డీల్‌ చేయాల్సింది అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక సినిమాలో యోగిబాబు కామెడీ హైలైట్‌. 

ఆయన చేసే పొరపాట్లు, నోరు జారే పనులు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. విలన్స్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయనపై వచ్చే సీన్లు కూడా కడుపుబ్బ నవ్విస్తాయి. ఓ రకంగా యోగిబాబు చాలా వరకు సినిమాని నడిపించారు. ఆయన కామెడీనే సినిమాకి హైలైట్‌ గా నిలిచింది.

56
విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ నటీనటులు ప్రదర్శన
Image Credit : x

విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ నటీనటులు ప్రదర్శన

బోల్ట్ కాశీ పాత్రలో విజయ్‌ సేతుపతి మరోసారి అదరగొట్టాడు. కాకపోతే ఇందులో చాలా సెటిల్డ్ గా చేశాడు. తనదైన స్టయిల్‌లో కూల్‌గా మ్యాజిక్‌ చేశారు. అయితే విజయ్‌ సేతుపతి నుంచి ఊహించిన ఎలిమెంట్లు ఇందులో తగ్గాయనిపిస్తుంది. 

ఇక రుక్కు పాత్రలో రుక్మిణి వసంత్‌ బాగా చేసింది. సీరియస్‌గా కనిపిస్తూ అదరగొట్టింది. సీరియస్‌ లుక్‌లోనూ అందంగా ఉంది. ఆడియెన్స్ ని మాయ చేసింది. షాలిని పాత్రలో దివ్య పిళ్లై మెప్పించింది. ఆమె పాత్రకు మంచి ప్రయారిటీనే దక్కింది. 

యోగిబాబు సినిమాకి మరో హీరో అని చెప్పాలి. ఆయన కామెడీ మీదనే సినిమా నడిచింది. చాలా చోట్ల సినిమా డౌన్‌ అవుతున్న సమయంలో యోగిబాబు లేపే ప్రయత్నం చేశారు. ఇక ధర్మ పాత్రలో బీఎస్‌ అవినాష్‌ బాగా చేశాడు. విలనిజం చూపించారు. ఆయన విలనిజాన్ని కామెడీగా చూపించడం విశేషం. రాజదురై పాత్రలో బబ్లూ పృథ్వీ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. కథలో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. మిగిలిన ఆర్టిస్టులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

66
విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ టెక్నీషియన్ల పనితీరు
Image Credit : x

విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ టెక్నీషియన్ల పనితీరు

కెమెరామెన్‌ కరణ్‌ బి రావత్‌ విజువల్స్ బాగున్నాయి. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం ఫర్వాలేదు. పాటలు బాగున్నాయి. కానీ సామ్‌ సీఎస్‌ బీజీఎం కొత్తగా అనిపించలేదు. చాలా సీన్లల్లో ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో చూసిన బీజీఎం వినిపిస్తుంది. కొత్తదనం ఏమాత్రం కనిపించలేదు. 

ఫెన్సీ ఆలివర్‌ ఎడిటింగ్‌ కూడా ఇంకా బాగా చేయాల్సింది. కొన్ని సీన్లు కట్‌ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అరుముగ కుమార్‌ రాసుకున్న కథలో కొంత కొత్తదనం లోపించినా, తెరకెక్కించిన తీరు బాగుంది. యాక్షన్‌ సీన్లు, క్రైమ్‌ సీన్లలోనూ కామెడీని మిక్స్ చేసిన తీరు, దాన్ని తెరపై అంతే సహజంగా ఆవిష్కరించిన తీరు బాగుంది. 

కానీ మరింత గ్రిప్పింగ్‌గా, ఇంకాస్త ట్విస్ట్ లు, టర్న్ లతో కథని నడిపిస్తే సినిమా అదిరిపోయేది. ఇలాంటి కొన్ని అంశాలు పక్కన పెడితే, విజయ్‌, రుక్మిణి లవ్‌ ట్రాక్‌ని, థ్రిల్లర్‌ సీన్లని, కామెడీని బాగా ఎంజయ్‌ చేయోచ్చు.

ఫైనల్‌గాః టైమ్‌ పాస్‌కి నవ్వుకునే `ఏస్‌`.

రేటింగ్‌ః 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
సినిమా సమీక్షలు
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image3
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Related Stories
Recommended image1
70 ఏళ్ల హీరోతో 40 ఏళ్ల త్రిష ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ పై విమర్శలు, క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Recommended image2
అందరూ ఫ్లాప్ అనుకున్నారు, వరుసగా 3 షోలు చూసిన నాగార్జున చెల్లెలు.. కట్ చేస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved