స్లో పేస్ తోనే... సినిమా 'హత్య' (రివ్యూ )
విజయ్ ఆంటోని నటించిన తాజా సినిమా 'హత్య' (Hatya Telugu Movie). తమిళంలో 'కొలై'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా రివ్యూ .
Hatya Movie Review
‘డాక్టర్ సలీమ్’, ‘బిచ్చగాడు’ వంటి విభిన్నమైన చిత్రాలతో.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ హీరో విజయ్ ఆంటోని. ఈ మధ్యన వచ్చిన ‘బిచ్చగాడు-2’ కూడా బాగా ఆడింది. ఆ ఉత్సాహంలో ఇప్పుడాయన ‘హత్య’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో అలరించేందుకు మన ముందుకు వచ్చారు. ‘‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన డోరతీ కింగ్ హత్య ఘటన బేస్ చేసుకుని ఈ కథ రాసారు. దాదాపు వందేళ్ల క్రిందటి హత్య కేసు ఈ కాలం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా ఉంటుందా... అసలు ఆ హత్య కేసు లో విశేషం ఏమిటి..వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
ఇదో క్రైమ్ థ్రిల్లర్ కావటంతో పూర్తి వివరంగా కథ చెప్పలేము. కొన్ని కీ ఎలిమెంట్స్ ని దాటి పెట్టకపోతే చూసేవాళ్లకు ఇబ్బంది ఎదురౌతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్న స్టోరీ లైన్ ఇది.
రీసెంట్ గా ముంబై నుంచి హైదరాబాద్ కు షిప్ట్ అయిన మోడల్ లైల (మీనాక్షీ చౌదరి) . అందమైన ఈమెకు ఇంటా,బయిటా స్నేహితులే కానీ శత్రువులు ఉండరు. ఆమె ఓ రోజు తన ప్లాట్ లో హత్యకు గురి అయ్యి ఉంటుంది. తలుపు వేసింది వేసినట్లే ఉంటుంది. ఆమె ఇంట్లో ప్రవేశించి ఆమెను చంపిందెవరు... ఈ కేసుని ఐపీఎస్ సంధ్య (రితికా సింగ్)కి టేకప్ చేస్తుంది. కానీ ఓ పట్టాన ముందుకు వెళ్లదు. ఒక్క క్లూ కూడా కేసు ముడివిప్పేలా ఉండదు. అప్పుడు కాంప్లికేట్ గా మారిన ఈ కేసును ఛేదించేందుకు బ్రేక్ తీసుకుని ఉన్న ప్రెవేట్ డిటెక్టివ్ ని ఆమె రిక్వెస్ట్ చేస్తే రంగంలోకి దిగుతాడు. అతనే వినాయక్ (విజయ్ ఆంటోనీ). అతని సాయింతో నలుగురు అనుమానితుల పై దృష్టి పెడతారు. వాళ్లు ఆమె బాయ్ ఫ్రెండ్ సతీష్ (సిద్ధార్థ శంకర్), ముంబైలో మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ), ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం), అనాథ ఆశ్రమంలో ఆమెను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్)... వీళ్లలో సంధ్యను హత్య చేసింది ఎవరు? ఎవరికి మోటివ్ ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఎటువంటి ఛాలెంజ్ లు ఎదురయ్యాయి...వాటిని ఎలా పరిష్కరించి ముందుకు వెళ్లారు? అన్నదే ఈ సినిమాలో కీలకాంశం.
Vijay Antony Hatya
విశ్లేషణ
సినిమా ప్రారంభం చాలా ఇంట్రస్టింగ్ గా సెటప్ చేసారు. మంచి సస్పెన్స్, మర్డర్ మిస్టరీ చూడబోతున్నామనే ఫీల్ కలుగుతుంది. రాబోయే సీన్స్ లో అదిరపోయే ట్విస్ట్ లు, ఊహకు అందని మలుపులు ఉంటాయని ఉత్సాహపడతాము. అయితే ఆరంభ శూరత్వమే అని మెల్లిమెల్లిగా అర్దమవుతుంది. సినిమా ఎక్కడా సర్పైజ్ చేయదు. రైటింగ్ లో కానీ, ఇన్విస్టిగేషన్ ప్రాసెస్ లో కానీ రొటీన్ గా నడుస్తూంటుంది. ప్రిమైజ్ అదిరిపోయనప్పుడు మిగతా సినిమా కూడా అదే స్దాయిలో ఉంటుందని ఆశించటం అత్సాశ అని అర్దమవుతుంది. సినిమా పూర్తిగా చూసేక మనకు అర్దమయ్యే విషయం ఇది ఒక క్లైమాక్స్ ట్విస్ట్ పై ఆధారపడ్డ సినిమా అని. ఎక్కడో చివర్లో వచ్చే ట్విస్ట్ ని బలంగా నమ్మిన దర్శకుడు.. అది ఒక్కటి సరిపొతుందని భావించిననట్లు అర్ధమౌతూ వుంటుంది. అయితే ఒకప్పుడు జనాలకు ఆ ఓపిక ఉండేది. ఇప్పుడు కర్శర్ చేతిలో పట్టుకుని ముందుకు తోసుకుంటూ ఓటిటి సినిమాలు చూస్తున్న రోజులు ఇవి. ఇప్పుడు సినిమాని చూసే విధానం మారిపోయింది.
Hatya - Official Trailer
కేవలం ఒక ట్విస్ట్ ని నమ్ముకొని సినిమా అంతా సన్నివేశాలు పేర్చుకుంటూ వెళితే ఒక దశలో ప్రేక్షకుడికి .. ఆ లాస్ట్ లో వచ్చే మలుపు కోసం ఇంత డ్రామా ఎందుకనే ఆలోచన, విసుకు కలుగుతుంది. ఈ సినిమా లో కూడా అదే జరుగుతుంది. సక్సెస్ థ్రిల్లర్ జోనర్ సినిమా ని ఆ జానర్ లోనే ఉంచి డీల్ చేయాలనే విషయం మర్చిపోయారు. హీరో ఫ్యామిలీ సీన్స్ అవసరమా అనిపిస్తుంది. ఎవరు ఆ మోడల్ ని చంపడానికి ప్రయత్నించారనే గెస్సింగ్ నేపధ్యంలో ఇన్విస్టిగేషన్ ప్రాసెస్ ని నింపాదిగా చెప్పుకుంటూ వెళ్తాడు దర్శకుడు. దాంతో కథనం మరీ నీరసంగా సాగదీత ధోరణితో వుంటుంది. అయితే అసలు కథకు సంబంధం లేకుండా రోమాన్స్ లేకపోవటం ఒకటే ఈ సినిమాలో దర్శకుడు చేసిన మంచి పని. బహుశా ఈ జనరేషన్ ఇలాంటి రోమాన్స్ లేని నేరేషన్స్ కే ఇష్టపడుతుందనేది దర్శకుడి అర్దం చేసుకున్నాడు కావచ్చు. ఓ ప్రక్కన ఇన్విస్టిగేషన్ మరో ప్రక్క చనిపోయిన లీలా జీవితం నాన్ లీనయర్ స్క్రీన్ ప్లేలో చెప్పే ప్రయత్నం చేసారు. అది కొంతవరకూ బాగానే వరక్వుట్ అయ్యింది. అయితే ఇన్విస్టిగేషన్ ప్రక్కన పెట్టి లీడ్ క్యారక్టర్ ఎమోషనల్ డ్రైవ్ లోకి టర్న్ తీసుకున్నప్పుడే విసుగువస్తుంది. మనం ఏమి చూడటానికి వచ్చాము..ఏమి చూపెడుతున్నాడు అనిపిస్తుంది.
Plus Points:
ప్రారంభంలో సెటప్
ఆసక్తి కలిగించే క్లూలు
కెమెరా వర్క్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
Minus Points:
విసుగెత్తించేలా డిజైన్ చేసిన క్యారక్టర్స్
ట్విస్ట్ లును సరిగ్గా ప్లే చేయకపోవటం
క్లైమాక్స్
hatya
టెక్నికల్ గా...
సినిమాలో విజయ్ ఆంటోని డీసెంట్ గా ఉన్నారు. అయితే కొత్తగా ఆయన చేసిందేమీ లేదు గంభిరంగా ఉండటం తప్పించి. రితికా సింగ్..గుడ్..ఫిట్. మీనాక్షి చౌదరి నటన మాట పక్కన పెడితే గ్లామరస్ గా కనిపించారు.. మురళి శర్మ, సిద్దార్ద శంకర్ కూడా తమ పాత్రలకు ఫెరఫెక్ట్. అయితే మురళి శర్మకు వేరే వాళ్ల చేతే డబ్బింగ్ చెప్పించినట్లున్నారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
ఈ సినిమాలో అదిరిపోయే పాటలు అయితే లేవు.ఇలాంటి సినిమాలో ఎక్సపెక్ట్ చేయం కూడాను. నేపధ్య సంగీతం బాగుంది. దర్శకుడు కథ మీద కన్నా టెక్నికల్ బ్రిలియన్స్ మీద దృష్టి పెట్టాడు. కెమెరా వర్క్ డీసెంట్ గా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథకు తగ్గ ఖర్చు చేశారు. నాన్ లీనయర్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనుకుని చేస్తే అది వర్కవు్ కాలేదు. ఎడిటర్ కాస్తంత సినిమాను పరుగెత్తించి ఉంటే ఇన్విస్టిగేషన్ సంవత్సరాల తరబడి జరిగిన ఫీల్ వచ్చేది కాదు.
ఫైనల్ థాట్:
రైటింగ్ సరిగ్గా లేకపోతే ఎంత ఇంట్రస్టింగ్ ఐడియా అయినా , ఎంత టెక్నికల్ ఎక్సలెన్స్ తో డీల్ చేసినా కిల్ అయ్యిపోతుంది. ఈ సినిమాని రైటింగ్, స్లో నేరేషన్ హత్య చేసింది.
Rating:2.5
సూర్య ప్రకాష్ జోశ్యుల
Vijay Anthony
తెర వెనక..ముందు
నటీనటులు : విజయ్ ఆంటోనీ, మురళీ శర్మ, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు
ఛాయాగ్రహణం : శివకుమార్ విజయన్
సంగీతం : గిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాతలు : కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్
తెలుగులో విడుదల : గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్
రచన, దర్శకత్వం : బాలాజీ కుమార్
విడుదల తేదీ: జూలై 21, 2023