MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • 'పోతుగడ్డ' (ఈటీవి విన్) ఓటిటి రివ్యూ

'పోతుగడ్డ' (ఈటీవి విన్) ఓటిటి రివ్యూ

కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమ, రాజకీయాలు, డబ్బు.. ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో ట్విస్టులు, టర్న్ లు ఆసక్తికరంగా ఉంటాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 31 2025, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Thriller drama, Pothugadda, Etv win Ott

Thriller drama, Pothugadda, Etv win Ott

థ్రిల్లర్ సినిమాలు సరిగ్గా డీల్ చేస్తే  బోర్ కొట్టవు. అందులోనూ  క్రైమ్ కలిసినప్పుడు అవి మరింత కిక్ ఇస్తాయి.   అందుకేనేమో ఓటిటిలు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ వైపై మ్రొగ్గు చూపుతూంటాయి. తాజాగా ఈ జోనర్ లోనే తెలుగు నుంచి ఓ  విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటిటిలోకి  స్ట్రీమింగ్కి వచ్చింది. పోతుగ‌డ్డ (Pothugadda)టైటిల్ తో రూపొందిన ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా, నిజంగానే థ్రిల్ ని పంచగలిగిందా వంటి విశేషాలు చూద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Thriller drama, Pothugadda, Etv win Ott

Thriller drama, Pothugadda, Etv win Ott


'పోతుగడ్డ'   కథేంటంటే:

అది ఎలక్షన్ సమయం.  కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నిక‌లుకు రంగం సిద్దమవుతుంది.  పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న పోతుగ‌డ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే స‌ముద్ర‌ (ఆడుకాలం న‌రేన్‌) ఎలాగైనా మరోసారి సీట్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంటాడు.  మరో ప్రక్క అతన్ని ఎలాగైనా ఓడించి ఎమ్మల్ేయ అవ్వాలని భాస్క‌ర్ (శ‌త్రు) నిర్ణ‌యించుకుంటాడు. ఇద్దరూ పోటా పోటీగా ఉంటారు. భాస్కర్ డబ్బుని వెదజల్లి గెలవాలని,  ఎన్నిక‌ల ముందు నుంచే కూడబెట్టడం మొదలుపెడతాడు.

అయితే, సముద్ర తక్కువవాడేం కాదు.  మహిళలు, యూత్ ఓట్లకు గాలం వేయడానికి కూతురు గీత (విస్మయ శ్రీ)ని రంగంలోకి దింపాలనుకుంటాడు. ఆమెను పార్టీలో 'జిల్లా యూత్ ప్రెసిడెంట్' చేస్తాడు సముద్ర. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గీతకు రాజకీయాలు అంటే నచ్చవు.   తాను ప్రేమించిన అబ్బాయితో కృష్ణ (ఫృథ్వీ దండ‌మూడి) క‌లిసి పారిపోవాల‌ని ప్లాన్ వేస్తుంది. ఆ క్రమంలో ఓ ప్లాన్ వేసుకుని  ఒకరోజు గీత, కృష్ణ ఇద్దరు కలిసి బస్సులో పారిపోతారు. 

ఆ విషయం సముద్రకు తెలిసి తన మనుష్యులను వాళ్లను పట్టుకోమని, అవసరమైతే చంపేయమని పురమాయిస్తాడు. మ రో ప్రక్క వాళ్లు ఎక్కిన   అదే బస్సులో భాస్క‌ర్ తను పంచాల్సిన యాభై కోట్ల  డబ్బుని కూడా  దాచిపెడతాడు. ఆ విషయం పోలిస్ లకు తెలుస్తుంది. అప్పుడు ఏమైంది. ఆ జంట ప్రేమ గెలిచిందా. ఆ డబ్బు విషయం బయిటకు వచ్చిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 

34
Thriller drama, Pothugadda, Etv win Ott

Thriller drama, Pothugadda, Etv win Ott


ఎలా ఉంది 

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ ఈ  సినిమా పేరుకే  యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కానీ అంత థ్రిల్స్ ఏమి లేవు. పరువు హత్య నేపథ్యంలో ఇంతకు ముందు చూసిన కథల్ని అటు ఇటు చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు.  ముఖ్యంగా సినిమాలో కోర్ ఎమోషన్ ని సరిగ్గా రిజిస్టర్ చెయ్యలేదు. వాళ్ల ప్రేమ గెలివటం ముఖ్యమా..లేక రాజకీయాలా అనేది క్లారిటీగా రన్ చెప్పలేకపోయారు. ఇంటెన్స్ గానీ, ఎమోషనల్ డెప్త్ గానీ లేకపోవటమే సినిమాకు మైనస్ గా మారింది. సినిమాని ఎత్తుకున్న విధానం ప్రెష్ గానే అనిపించినా, బస్ లోనే ఎక్కువ సేపు నడవటంతో విసుగు అనిపిస్తుంది. అయితే ఓటిటిలో కాబట్టి ఓ లుక్కేయచ్చు
 

44
Thriller drama, Pothugadda, Etv win Ott

Thriller drama, Pothugadda, Etv win Ott

ఎవరెలా చేసారు

ఉన్నంతలో   రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా పనితనం .. మార్కస్ నేపథ్య సంగీతం .. శివకిరణ్ ఎడిటింగ్ ప్లస్ లుగా నిలిచాయి. ఆడుకాలం నరేన్, శత్రు తమ అనుభవంతో లాగేసారు.  ప్రేమికులుగా   పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ చూడటానికి బాగానే ఉన్నా, కథలో కీలకం కాలేకపోయారు. ఎమోషన్ రిజిస్టర్ చేయలేకపోయారు.

ఎక్కడ చూడచ్చు

మూవీ పోతుగ‌డ్డ (Pothugadda). ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved