MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రష్మిక మందన్నా విశ్వరూపం చూపించిందా?

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రష్మిక మందన్నా విశ్వరూపం చూపించిందా?

రష్మిక మందన్నా, దీక్షిత్‌ శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్‌`. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో చూద్దాం. 

5 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 07 2025, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ది గర్ల్ ఫ్రెండ్‌ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

ది గర్ల్ ఫ్రెండ్‌ మూవీ రివ్యూ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మొదటిసారి నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్‌`. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో `దసరా` ఫేమ్‌ దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. రాహుల్‌ రవీంద్రన్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో ఇంటెన్స్ లవ్‌ స్టోరీగా తెరకెక్కించారు. ఈ మూవీకి మంచి బజ్‌ ఉంది. అల్లు అరవింద్‌తోపాటు చాలా మంది సెలబ్రిటీలు మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నేడు శుక్రవారం(నవంబర్‌ 7)న విడుదలయ్యింది. ముందుగా మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రసాద్‌ ఐమాక్స్ లో వీక్షించాను. మరి టీమ్‌ చెప్పినట్టుగానే సినిమా ఆకట్టుకుంటుందా? రష్మిక మందన్నా విశ్వరూపం చూపించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ కథ ఏంటంటే?

భూమి(రష్మిక మందన్నా) సిటీలోని రామలింగయ్య కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుతుంటుంది. ఊరు నుంచి వచ్చిన ఆమె కాలేజీ హాస్టల్‌లోనే ఉంటుంది. భవిష్యత్‌లో బుక్స్ రాయాలనేది తన కోరిక. వచ్చిన కొత్తలోనే ఓ రోజు రాత్రి ఫ్రెండ్‌తో కలిసి ప్రయాణిస్తూ రాంగ్‌ రూట్‌లో వెళ్లి కారుని యాక్సిడెంట్‌ చేస్తారు. అతను భూమిపై అరుస్తుంటాడు. ఆ సమయంలోనే పక్కన వెళ్తున్న విక్రమ్‌(దీక్షిత్‌ శెట్టి), వారి ఫ్రెండ్స్ చూస్తారు. తమ కాలేజీ అమ్మాయిలు కావడంతో హెల్ప్ చేయడానికి వస్తారు. ఈ క్రమంలో ఆ కారు ఓనర్‌ ని కొడతారు. అతనొక పోలీస్‌. మరుసటి రోజు విక్రమ్‌ బ్యాచ్‌ని పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లి చితక్కొడతారు. ఈ విషయం తెలిసి, భూమి బాధపడుతుంది. గాయాలతో వచ్చిన విక్రమ్‌కి ఫస్ట్ ఎయిడ్‌ చేస్తుంది. ఆమె కేరింగ్‌ చూసిన విక్రమ్‌ తన అమ్మలా కేర్‌ చేస్తుందని ఫిదా అయిపోతాడు.  వెంటపడుతుంటాడు. ఈ ప్రాసెస్‌లో తను కూడా విక్రమ్‌కి పడిపోతుంది. ఇద్దరు కలుస్తారు. కిస్‌ చేసుకుంటారు. ఆ ప్రేమలో చాలా దూరం వెళ్తారు. విక్రమ్‌ చాలా డామినేటింగ్‌ పర్సన్‌. అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటాడు. ఎప్పుడూ భూమి తన వెంటే ఉండాలని కోరుకుంటాడు. దీంతో భూమి కొంత ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో మరో ఫ్రెండ్‌ దుర్గా(అను ఇమ్మాన్యుయెల్‌) ఇదే విషయం చెబుతుంది. అతను నీకు కరెక్ట్ కాదని, దీంతో ఆలోచనలో పడుతుంది భూమి. ఈ అయోమయంలో ఉన్న సమయంలోనే విక్రమ్‌ని భూమి రూమ్‌లో చూస్తారు వాళ్ల నాన్న(రావు రమేష్‌). ఆమె రూమ్‌లో విక్రమ్‌ ని చూసి షాక్‌ అవుతాడు. అతన్ని కొడతాడు. కాలేజీలో పెద్ద గొడవ అవుతుంది. ప్రేమికుడా? తండ్రినా ? అనే పరిస్థితిలో కాలేజీ కోసం తండ్రి మాటని కాదంటుంది. దీంతో ఆయన భూమిని వదిలి వెళ్లిపోతాడు. మరోవైపు విక్రమ్‌ భూమిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతాడు. ఈ క్రమంలో భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? విక్రమ్‌తో భూమికి సమస్య ఏంటి?   తండ్రిని భూమి కలుసుకుందా? ఆమె గతం ఏంటి?  లవర్‌, నాన్న ఇద్దరిలో భూమి ఎవరిని ఎంచుకుంది? చివరికి ఈ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
ఫోటోలు అడిగిన పూరీ జగన్నాథ్‌ కి అనుష్క ఏం ఇచ్చిందో తెలుసా? డైరెక్టర్‌కి ఫ్యూజుల్‌ ఎగిరిపోయాయి
Related image2
`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీ రివ్యూ, రేటింగ్‌.. తిరువీర్‌ మూవీ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యిందా?
36
`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ విశ్లేషణ

లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ తెలుగులో అడపాదడపా వస్తుంటాయి. అందులో ఆకట్టుకునే మూవీస్‌ ఒకటి అర మాత్రమే ఉంటాయి. అయితే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ కమర్షియల్‌ మూవీస్‌ ఉంటాయి. కాన్సెప్ట్ చిత్రాలుంటాయి. మహిళా సాధికారత అనే అంశాన్ని చర్చించే చిత్రాలుంటాయి. అవి చాలా అరుదుగానే వస్తుంటాయి. అలాంటి మూవీనే `ది గర్ల్ ఫ్రెండ్‌`. మహిళ స్వేచ్ఛ, వారి స్వాతంత్య్రం ప్రధానంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. మగాళ్ల వెనకాల ఉండటం కాదు, తామే ముందుండి, స్వేచ్ఛగా జీవించడం, నచ్చిన పని చేస్తూ, నచ్చిన జీవితాన్ని గడిపే స్వేచ్ఛ ఉండాలనేది ఈ మూవీ ద్వారా చెప్పాడు దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. సినిమా రష్మిక కాలేజీకి ఎంట్రీ నుంచి ప్రారంభమవుతుంది. మొదట్లో చాలా సిన్సియర్‌గా చదువుపైనే దృష్టి పెట్టడం, ఆ తర్వాత నెమ్మదిగా విక్రమ్‌కి పడిపోవడం, ఇంతలోనే కాలేజీ మొత్తం చర్చనీయాంశంగా మారడం, అట్నుంచి విక్రమ్‌ తో కలిసి తిరగడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సాగుతుంది. 

సెకండాఫ్‌లో సంఘర్షణకు గురి కావడం, తాను వెళ్తున్న దారి కరెక్టేనా అనేది, తనకు విక్రమ్‌ కరెక్టేనా అనేది తనని తాను చెక్‌ చేసుకోవడం, ఇంతలో తనే రియలైజేషన్‌ కావడం, తండ్రి వచ్చి గొడవ చేయడం దీంతో కథ, రష్మిక లైఫ్‌ కాంప్లికేటెడ్‌గా మారుతుంది. ఊహించని పరిణామాలు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇటు ప్రేమించిన వాడి డామినేషన్‌, అటు పెంచిన తండ్రి డామినేషన్‌ ఇద్దరి మధ్య తాను నలగడం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. ఎమోషనల్‌ టచ్‌ ఇస్తూనే లవ్‌ ట్రాక్‌, యూత్‌ఫుల్‌ డైలాగ్‌లతో అలరిస్తుంది. సెకండాఫ్‌లోనే అసలు కథ ఉంటుంది, అసలు డ్రామా నడుస్తుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. పైకి చూడ్డానికి రెగ్యూలర్‌ లవ్‌ కమర్షియల్‌ మూవీ అనిపించినా, అంతర్లీనంగా చాలా ఎమోషన్‌ ఉంది. అమ్మాయి పెయిన్‌ ఉంటుంది. అదే మూవీ కోర్‌ పాయింట్‌. ఆ పాయింట్ చెప్పే విషయంలో కొన్ని చోట్ల హైలో, మరికొన్ని చోట్ల లో అయ్యింది. సినిమా పడుతూ లేస్తూ సాగింది.   హీరోయిన్‌ ప్రియుడి నుంచి స్వేచ్ఛని పొందలేకపోతుంది, తండ్రి నుంచి కూడా అదే జరుగుతుంది. దీంతో ఇద్దరినీ ఎదురించి తానేంటో చూపించాలనుకోవడం, ఆ బంధాలు అనే బంధనాలను తెంచుకుని తానేంటో చూపించేందుకు ఓ లేడీ చేసిన సాహనం, తిరుగుబాటు అదిరిపోయింది. క్లైమాక్స్ లో గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఆడది అంటే మగవాడికి సేవలు మాత్రమే చేసేది కాదు, తనకంటూ ఓ లైఫ్‌ ఉంటుందని, దాన్ని గౌరవించాలని చెప్పే చిత్రమిది. ఆ సందేశాన్ని అందించడంతో దర్శకుడు సక్సెస్‌ అయ్యారు. దాన్ని అంతే బాగా తన పాత్ర ద్వారా ఆవిష్కరించడంలో రష్మిక సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. మహిళ స్వేచ్ఛని ఆవిష్కరించే ఈ మూవీ లేడీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

46
`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ ప్లస్‌ లు మైనస్‌లు
Image Credit : Asianet News

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ ప్లస్‌ లు మైనస్‌లు

ప్లస్‌ లు చూస్తే, రష్మిక మందన్నా, దీక్షిత్‌, మెయిన్‌ కాస్టింగ్‌ నటన. ఎమోషన్స్, ఇంటెన్సిటీ బాగా కుదిరింది. అదే సమయంలో మహిళలకు సంబంధించి చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మ్యూజిక్‌ మరో అసెట్‌గా చెప్పొచ్చు. కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. డైలాగ్స్ అదిరిపోయాయి.

మైనస్‌లు చెప్పాల్సి వస్తే.. మూవీ స్టార్ట్ అయిన కాసేపు తర్వాత డల్‌ అనిపిస్తుంది. కొన్ని సార్లు లేస్తుంది, మళ్లీ పడిపోతుంది. మధ్య మధ్యలో ఎమోషనల్‌ కనెక్షన్‌ మిస్‌ అవుతుంది. అబ్బాయిల పాత్రలను చూపించే క్రమంలో కొంత క్లారిటీ మిస్‌ అయ్యింది. కొన్ని సీన్లతోపాటు, కన్‌ క్లూజన్‌ ఊహించినట్టుగానే ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు.

56
`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ నటీనటుల ప్రదర్శన
Image Credit : Asianet News

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ నటీనటుల ప్రదర్శన

రష్మిక మందన్నా భూమి పాత్రలో జీవించింది. ప్రాణం పోసింది. అదరగొట్టింది. ఫన్నీగా కనిపిస్తూనే రెచ్చిపోయింది. విశ్వరూపం చూపించింది. సెటిల్డ్ గా చేసి ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వాహ్‌ అనిపించింది. ఇందులో ఆమెది ది బెస్ట్ యాక్టింగ్‌ అని చెప్పొచ్చు. దీక్షిత్‌ శెట్టి సైతం చాలా బాగా చేశాడు. చాలా సార్లు వాహ్‌ అనిపించాడు. ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. రావు రమేష్‌ తండ్రిగా రెచ్చిపోయాడు. మరోవైపు లెక్చరర్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.

66
`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ టెక్నీషియన్ల పనితీరు
Image Credit : Asianet News

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ టెక్నీషియన్ల పనితీరు

ఈ చిత్రానికి అబ్దుల్‌ హేషామ్‌ అందించిన సంగీతం బిగ్‌ అసెట్‌. థ్రిల్లర్‌ సినిమాని తలపించేలా కొట్టాడు. పాటలు ఇప్పటికే సూపర్‌ హిట్‌. బిజీఎం కూడా అదిరిపోయింది. కెమెరా వర్క్ సూపర్బ్ అనిచెప్పొచ్చు. ఎడిటింగ్‌ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమా చాలా చోట్ల పడుతూ, లేస్తూ వచ్చింది. ఆయా చోట్ల ట్రిమ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌.. మహిళల స్వేచ్ఛకి సంబంధించి చెప్పిన పాయింట్‌ బాగుంది. దాన్ని చూపించిన తీరు బాగుంది.   సినిమాని కూడా ఇంటెన్సిటీతో నడొపించిన తీరు బాగుంది. అయితే ఈ చిత్రం ఏ సెంటర్లకి పరిమితమయ్యే మూవీలా ఉంది. బీ, సీ సెంటర్లకిది ఏ మేరకు వెళ్తుందనేది ప్రశ్న.

ఫైనల్‌గా.. మహిళలు చూడాల్సిన మూవీ. మగాళ్లు తెలుసుకోవాల్సిన పాయింట్‌. పైనల్‌గా హృదయాన్ని హత్తుకునే చిత్రం.

రేటింగ్‌ః 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Related Stories
Recommended image1
ఫోటోలు అడిగిన పూరీ జగన్నాథ్‌ కి అనుష్క ఏం ఇచ్చిందో తెలుసా? డైరెక్టర్‌కి ఫ్యూజుల్‌ ఎగిరిపోయాయి
Recommended image2
`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీ రివ్యూ, రేటింగ్‌.. తిరువీర్‌ మూవీ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved