- Home
- Entertainment
- ఫోటోలు అడిగిన పూరీ జగన్నాథ్ కి అనుష్క ఏం ఇచ్చిందో తెలుసా? డైరెక్టర్‌కి ఫ్యూజుల్ ఎగిరిపోయాయి
ఫోటోలు అడిగిన పూరీ జగన్నాథ్ కి అనుష్క ఏం ఇచ్చిందో తెలుసా? డైరెక్టర్‌కి ఫ్యూజుల్ ఎగిరిపోయాయి
అనుష్క శెట్టి రేపు(శుక్రవారం) తన 44వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూరీ ఫ్యూజులు ఎగిరిపోయే పని చేసింది అనుష్క.

`ఘాటి`తో డిజప్పాయింట్ చేసిన అనుష్క
స్వీటి అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఆమె ఇటీవల `ఘాటి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఓల్డ్ కాన్సెప్ట్ తో సినిమా ఉండటంతో ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. దీంతో స్వీటి అభిమానులను మరోసారి డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం ఆమె చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. నాగార్జున వందవ చిత్రంలో నటించబోతుందనే వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పూరీ జగన్నాథ్‌కి నో చెప్పిన అనుష్క
ఇదిలా ఉంటే అనుష్క కెరీర్ బిగినింగ్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెరీర్ బిగినింగ్ లో తాను చేసిన పని బయటపెట్టింది అనుష్క. ఎంతటి అమాయకంగా వ్యవహరించిందో వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకు `సూపర్`లో నటించే ఆఫర్ వచ్చింది. పూరీ జగన్నాథ్ ఆమెని చూసి ఫిదా అయ్యారు. తన సినిమాకి బాగా సెట్ అవుతారని భావించారు. అనుష్క యోగా గురువు ద్వారా ఆమెని సంప్రదిస్తే మొదట నో చెప్పిందట. చాలా సార్లు ప్రయత్నించినా రిజెక్ట్ చేసిందట.
అనుష్క చేసిన పనికి పూరీ జగన్నాథ్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయి
ఇలా లాభం లేదని చెప్పి ఏకంగా ఇంటికే వెళ్లారట. అనుష్కని డైరెక్ట్ గా చూసిన పూరీ జగన్నాథ్ ఆమెకి ఇంప్రెస్ అయ్యారు. అమాయకత్వమే ఆయనకు బాగా నచ్చింది. దీంతో సినిమాల్లో బాగా సూట్ అవుతుందనుకున్నారు. మాట్లాడి ఒప్పించిన తర్వాత దర్శకుడు పూరీ అనుష్కని ఫోటోలు అడిగారట. నాగార్జునకి చూపించేందుకు ఫోటోలు కావాలని అడిగితే ఆమె పాస్‌ఫోటో ఇచ్చిందట. ఆ ఫోటోని చూసి పూరీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫోటోలు అడిగితే ఇది ఇచ్చిందేంటని ఆశ్చర్యపోయారట. అప్పటి వరకు తనవద్ద వేరే ఫోటోలు లేవట. దీంతో ఆ ఫోటోని, ఆమెని విచిత్రంగా చూశాడట దర్శకుడు. అప్పుడు తనకు ఏం అర్థం కాలేదని తెలిపింది. ఆ ఫోటోనే తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ముంబాయికి పిలిపించి ఫోటో షూట్ చేశారు. కనీసం కెమెరాకి ఫోజులివ్వడం కూడా రాలేదట. కెమెరా టీమ్ వివరించారని, అలా ప్రతిదీ తాను నేర్చుకున్నట్టు తెలిపింది అనుష్క. సినిమా అనేది తనకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పింది.
తొలి చిత్రంలోనే బోల్డ్ రోల్ చేసిన అనుష్క
అలా తన సినిమా ఎంట్రీ జరిగిందని అనుష్క వెల్లడించింది. తానెప్పుడూ సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. కనీసం సినిమాలు కూడా చూడలేదు. ఇప్పుడు సినిమాలే ప్రపంచం అయిపోయిందని, ఇంతటి గుర్తింపు, అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది అనుష్క. యాంకర్ ప్రదీప్‌కి ఇచ్చిన కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనుష్క `సూపర్` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బోల్డ్ రోల్ చేసింది. తాను స్వతహాగా చాలా స్వీటి. కానీ ఇందులో బోల్డ్ రోల్ చేయాల్సి వచ్చింది. అది మరో కొత్త అనుభవం అని చెప్పింది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా అనుష్క శెట్టి
అలా నాగార్జున, పూరీల ఒత్తిడి, ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని దున్నేస్తోంది అనుష్క. ప్రారంభంలో రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు చేసింది. నాగార్జున, బాలయ్య, వెంకటేష్, ప్రభాస్, రవితేజ, గోపీచంద్, మంచు విష్ణు వంటి వారితో కలిసి నటించింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత `అరుంధతి` చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు టర్న్ తీసుకుంది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ట్రెండ్‌కి తెరలేపింది. `భాగమతి`, `బాహుబలి` వంటి చిత్రాలతో అలరించింది. చివరగా ఆమె `ఘాటి`లో మెరిసిన విషయం తెలిసిందే.