MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • ‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ

‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ

ఈ సినిమా కథేంటి..డైరక్టర్ చెప్పదలుచుకున్నదేమిటి...సామాన్య ప్రేక్షకుడుకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

5 Min read
Author : Surya Prakash
Published : Aug 27 2021, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


 దేశంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట నమోదు అవుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈ విషయాలపై భారీగా డిస్కషన్ జరుగుతోంది. మార్పు ఏ మేరకు వస్తోందో..పరిష్కారం ఏమిటి అనేది తేలకపోయినా కొంతలో కొంత మార్పు అయితే చర్చ ల ద్వారా వచ్చే అవకాసం ఉంది. సినిమా అనేది బలమైన మాధ్యమం కాబట్టి దాని ద్వారా చర్చ జరగటం మంచిదే. అలాంటి కోణంలోంచి ఆవిష్కరించబడ్డ సినిమానే ‘శ్రీదేవి సోడా సెంటర్’. పైకి రొటీన్ కమర్షియల్ సినిమాగా అనిపించినా..అంతర్గతంగా ఈ విషయంపై ఫోకస్  చేసారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి..డైరక్టర్ చెప్పదలుచుకున్నదేమిటి...సామాన్య ప్రేక్షకుడుకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review

కథ
అమలాపురంలో లైటింగ్ సూరిబాబు(సుధీర్ బాబు)అంటే ఫేమస్. పేరున్న ఎలక్ట్రీషియన్. ఆ ఊళ్లో సోడాల శ్రీదేవి (ఆనంది) అనే అందగత్తె. జాతరలో ఆమెను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి వెనకే పడిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఈ కుర్రాడి కష్టం చూసి సరే అనేస్తుంది. ఇద్దరు ఎడాపెడా ప్రేమించేసుకుని..పెళ్లి చేసేసుకుందామనుకుంటారు. ప్రేమకు అంటే ప్లాబ్లం లేదు కాని పెళ్లంటే బోలెడు లెక్కలు కదా. శ్రీదేవి తండ్రి(నరేష్) నో చెప్పేస్తాడు. ఎందుకు అంటే కుర్రాడు మన కలుపోడు కాదు అనే కారణం చెప్తాడు. అదే సమయంలో సూరిబాబు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళతాడు సూరిబాబు. అతన్ను ఎవరు ఇరికించారు. చివరకు ఆ ప్రేమ కథ ఏ తీరం చేసింది.. శ్రీదేవి, సూరిబాబు ఒక్కటయ్యారా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ..

314
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review

 క్లైమాక్స్ ట్విస్ట్..రెస్టాఫ్ 

కొన్ని సినిమాలు క్లైమాక్స్ ని నమ్ముకుని తెరకెక్కుతూంటాయి. అది కానీ పేలిందా..జనాలకు ఎక్కిందా...సినిమా నిలబడిపోతుంది. ఈ మధ్యకాలంలో ఉప్పెన చిత్రం అలాంటి ఊహించని మలుపుతో తెరకెక్కి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నే నమ్ముకుంది. మిగతా కథ అంతా మనం కామన్ ప్రేక్షకుడు కూడా కమాన్ అంటూ ఊహించేయగలుగుతాడు.ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం ఫక్తు కమర్షియల్ సినిమాలా నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచే నేరేషన్ లో మార్పు మొదవుతుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి అది పీక్స్ కు వెళ్తుంది.

414
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


 చాలా డార్క్ గా క్లైమాక్స్ ని డిజైన్ చేసారు. అది కనుక జనాలకు పట్టి, చర్చనీయాంశంగా మారితే సినిమాకు మామూలుగా ప్లస్ కాదు. అలా కాకపోతే సోసో సినిమా అనిపించుకుంటుంది. ఇక ఇలాంటి సినిమాలకు బాగా ప్లస్ కావాల్సిన ప్రేమ కథ, జంట మధ్యన ఉండాల్సిన కెమిస్ట్రీ కాస్త తక్కువనే చెప్పాలి. దాంతో క్లైమాక్స్ ఇంపాక్ట్ తక్కువగా అనిపించింది. అలాగే పరువు హత్యలు అనే పాయింట్ చుట్టూ కథ అయ్యినప్పుడు ఫస్టాఫ్ లో అందుకు సంభందించిన హింట్ ఇస్తే బాగుండేది. సమాజంలో చర్చించాల్సిన విషయమే కాని కథ,కథనం ఇంకాస్త కొత్తగా చెప్తే బాగుండేది అనిపించింది.

514
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


ముఖ్యంగా ఇంటెన్స్ డ్రామా అల్లు కోవాల్సింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూర్చుకుంటూ రావటం కూడా ఈ కథకు అడ్డుగా మారింది. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే.. అటు కమర్షియల్ సినిమాగానూ, ఇటు వాస్తవ ధోరణిలో నడిచే చిత్రంగానూ సమాంతరంగా అడుగులు వేస్తూ చివరకు ఎటు వైపు నిలబడలేక తడబడింది. దాంతో  ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఫోర్సెడ్ గా మారిపోయాయి. పలాస 1978 కు వెళ్లిన ధోరణిలోనే ఈ సినిమాని వాస్తవిక థోరణిలో మొత్తం తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. 

614
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


ఇక హీరో,హీరోయిన్స్ లవ్ స్టోరీ ఒక వైపు, మరో ప్రక్క కులం గొడవలు సరిగ్గా బాలన్స్ చేయలేకపోయారు.రెండు వేర్వేరు థ్రెడ్ లాగ విడిపోయాయి. అలాగే సినిమా ప్రారంభంలో  హీరో జైలుకు రావడం.. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వటం...హీరోయిన్ తో లవ్ ఎపిసోడ్..ఆ తర్వాత కులం మ్యాటర్ వరసగా వచ్చేయటం, ఇలాంటివి చాలా సినిమాల్లో చూసేయటం తో ఇంతకు ముందు చూసిన సినిమా చూసినట్లు అనిపిస్తుంది. లాస్ట్ లో మాత్రం కులం కోసం ఎంత దూరమైనా వెళ్లే తల్లిదండ్రులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు.. అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అదీ మనకు ప్రకాష్ రాజ్, సాయిపల్లవి చేసిన ‘Oor Iravu’ ని గుర్తుకు తెస్తుంది. 

714
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review

ప్లస్ లు, మైనస్ లు 
 హైలెట్స్ విషయానికి వస్తే...సుధీర్ బాబు, ఆనంది పెర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అని చెప్పాలి, మైనస్ పాయింట్స్ లలో రొటీన్ అనిపించే స్టొరీ లైన్, రన్ టైం ఎక్కువ, సెకెండ్ ఆఫ్ స్లో అవ్వటం మేజర్ డ్రా బ్యాక్స్ 

814
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


దర్శకత్వం,మిగతా విభాగాలు

డైరెక్షన్ విషయానికి వస్తే తన తొలి సినిమా పలాస మాదిరిగానే మరోసారి క్యాస్ట్ ని ఇంటర్ లింక్ చేస్తూ కథ రాసుకున్నారు. ఇందుకు విలేజ్ లవ్ స్టొరీ నేపధ్యం తీసుకున్నారు.మూసలో కొట్టుకుపోకండా తన ముద్ర వేయగలిగిన  ఇలాంటి కథని డైరక్టర్ చెప్పాలనుకోవటం అభినందించాల్సిన విషయం. అయితే ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేక ఎంగేజింగ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ ని బేస్ చేసుకుని సినిమా కథ అంతా అల్లారని అర్దమవుతుంది. కాకపోతే  కేవలం క్లైమాక్స్ మాత్రమే జనం చూసి ఎంజాయ్ చేయలేరు కదా..మొత్తం సినిమా చూడాలి కదా. ఫస్టాఫ్ లో అలాంటి మెరుపులు ప్రదర్శించాల్సింది. అలా చేయకపోవటంతో  కొత్తదనం ఏమి లేకుండా రొటీన్ గానే అనిపిస్తూ సాగినట్లు అనిపించింది. ఇక క్లైమాక్స్ డార్క్ ట్విస్ట్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులకు పడుతుందో వెయిట్ చేయాలి. ఇక జబర్దస్త్ రాఘవ, సప్తగిరిలతో చేసిన కామెడీ సీన్స్ కూడా  ఫోర్సెడ్ గానే ఉన్నాయి. కామెడి అక్కడితో ఆపేయటం బాగుందనిపించింది.

914
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


 సుధీర్ బాబు విషయానికి వస్తే అతను ప్రత్యేకంగా నటుడుగా ప్రూవ్ చేసుకున్న సినిమాలు అతి తక్కువ. దాంతో కథ,కథనం బాగుంటేనే ఆడుతున్నాయి. వరస పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు సరైన కథ పడినప్పుడే హిట్ వస్తోంది. అయితే ఈ సారి అతను బాగా చేసారనిపించుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ నరేష్ క్యారక్టరైజైషన్ టిపికల్ గా బాగా డిజైన్ చేసారు. నరేష్ కూడా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసారు.విలన్ గా చేసిన పావల్‌ నవగీతమ్‌, హీరోయిన్ ఆనంది గుర్తుండిపోతారు.

1014
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


 దేశంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట నమోదు అవుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈ విషయాలపై భారీగా డిస్కషన్ జరుగుతోంది. మార్పు ఏ మేరకు వస్తోందో..పరిష్కారం ఏమిటి అనేది తేలకపోయినా కొంతలో కొంత మార్పు అయితే చర్చ ల ద్వారా వచ్చే అవకాసం ఉంది. సినిమా అనేది బలమైన మాధ్యమం కాబట్టి దాని ద్వారా చర్చ జరగటం మంచిదే. అలాంటి కోణంలోంచి ఆవిష్కరించబడ్డ సినిమానే ‘శ్రీదేవి సోడా సెంటర్’. పైకి రొటీన్ కమర్షియల్ సినిమాగా అనిపించినా..అంతర్గతంగా ఈ విషయంపై ఫోకస్  చేసారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి..డైరక్టర్ చెప్పదలుచుకున్నదేమిటి...సామాన్య ప్రేక్షకుడుకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

1114
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review

టెక్నికల్ గా ..
చిత్రం టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. సినిమాటోగ్రఫీ ..బాగుంది. ముఖ్యంగా రూరల్ ఎలిమెంట్స్ ని బాగా పట్టుకుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగా రిజిస్ట్రర్ అయ్యింది. బాగుంది. మణిశర్మ సంగీతం లో పాటలు కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చెయ్యాల్సింది. బాగా లెంగ్తీగా ఉంది. అలాగే కొన్ని చోట్లు స్పీడుగా మరికొన్ని చోట్ల స్లోపేస్ లో ఉంది. అంతటా ఒకేలా లేదు. 

1214
Sridevi Soda center movie

Sridevi Soda center movie

ఇక చిత్రంలో వచ్చే చాలా డైలాగులు బాగున్నాయి.“ పెద్ద మనిషి అంటే ముద్ద పెట్టేవాడు అయ్యిండాలి, ముద్ద లాక్కునేవాడు కాదు“ ,  “ జైలుకొచ్చిన మనిషి , జైలు నుంచి వెళ్లే మనిషి ఎప్పటికీ ఒకటి కాదు “ ,  “ మంచోడే..కానీ మనోడు కాదు”  వంటివాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

1314
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


ఫైనల్ థాట్
అసురన్, కర్ణన్  స్దాయి కథలు,స్క్రీన్ ప్లేలు మన తెలుగు స్క్రీన్ కు అవసరమే కాకపోతే అదే స్దాయిలో ఉండాలి
Rating:2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

1414
Sudheer Babu Sridevi Soda Center Review

Sudheer Babu Sridevi Soda Center Review


ఎవరెవరు..
 నిర్మాణ సంస్థ: 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
 నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, ప‌వెల్ న‌వ‌గీత‌న్‌‌, న‌రేశ్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేశ్‌, హర్షవర్ధన్‌, స‌ప్తగిరి, క‌ళ్యాణి రాజు, రొహిణి, స్నేహ గుప్త, త‌దిత‌రులు; 
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్;
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌
క‌థ: నాగేంద్ర కాషా;  
 స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్‌
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేదీ: 27 ఆగస్టు 2021

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved