- Home
- Entertainment
- Movie Reviews
- Sing Geetham Review: సింగ్ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్ వెండితెరపై ఎలా ఉందంటే?
Sing Geetham Review: సింగ్ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్ వెండితెరపై ఎలా ఉందంటే?
Sing Geetham Review: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు తన 95ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన మూవీ `సింగ్ గీతం`. నేడు విడుదలైన ఈచిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

సింగ్ గీతం మూవీ రివ్యూ
సింగీతం శ్రీనివాసరావు.. సినిమా దశదిశలను మార్చిన దర్శకుడు. కమర్షియాలిటీని బ్రేక్ చేసి, సరికొత్త విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసిన దర్శకుడు. తెలుగు ఆడియెన్స్ కి సైన్స్ ఫిక్షన్ ని పరిచయం చేసింది ఆయనే. మూకీ సినిమాలతో సంచలనాలు సృష్టించింది కూడా ఆయనే. కెమెరాల పరంగా, కథ పరంగా మ్యాజిక్ చేసిన ఆయన తన 95ఏళ్ల వయసులోనూ సినిమాకి దర్శకత్వం వహించారు. తన 45ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు రూపొందించారు. కమల్ తో చేయాలనుకున్న ఈ సినిమాని ఇప్పుడు కొత్త వాళ్లతో `సింగ్ గీతం` పేరుతో రూపొందించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై నాగ్ అశ్విన్ దీన్ని నిర్మించారు. ఇందులో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(జూన్ 12)న విడుదలైంది. మరి సింగీతం డ్రీమ్ మూవీ ఎలా ఉంది? ఇప్పటి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సింగ్ గీతం మూవీ కథ
ప్రతాప్(ఆయాన్) జైలు నుంచి విడుదలవుతాడు. వచ్చీ రాగానే తన లాయర్ వచ్చి తన నాన్న ఉదయ్(రాహుల్ రవీంద్రన్) తనకు రాసిచ్చిన భూమిపత్రాలు ఇస్తాడు. అవి తీసుకొని కుబేరపురం వెళ్తాడు ప్రతాప్. అదంతా ఒక ఏడాది ప్రాంతం. ఒకే ఒక్క చెట్టు ఉంటుంది. తనని మరో వ్యక్తి అక్కడికి తీసుకెళ్తాడు. కారులో వెళ్తూ చెట్టుని ఢీ కొడతారు. అందులో గౌరి(అహల్యా బమ్రూ) ఉంటుంది. ఆమె చెట్టుని రక్షిస్తుంటుంది. అయితే అక్కడ గోల్డ్ మైనింగ్ ఉంటుంది. అది కూడా ప్రతాప్ భూమిలోనే. దాన్ని కాజేసే ప్లాన్ వేస్తుంది రేణు(శాలిని). ఫారెన్ వ్యక్తితో వంద కోట్లకు డీల్ కుదుర్చుకుంటుంది. ఈ విషయం తనకు తెలియడంతో 50-50 కి డీల్ సెట్ చేసుకుంటాడు ప్రతాప్. ఆ మైనింగ్ తవ్వాలంటే చెట్టుని కొట్టాలి. దానికి గౌరి అడ్డుపడుతుంది. కానీ ఆమెని కాదని చెట్టుని కొడతారు. దీంతో ఆ బాధలో ఆమె కుబేరుడి గుడి వద్దకు వెళ్లి బాధపడుతుండగా, భూకంపం వస్తుంది. గౌరీ గుహలో పడిపోతుంది. అందులో తన గోడు చెప్పుకుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చాక.. ఊర్లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంటుంది. జనాలకు మాటలు రావు.. మాటలు పాటలుగా వస్తుంటాయి. మాటలు, పాటలుగా చెబుతుంటారు. మరి ఎందుకు అలా జరిగింది? అది శాపమా? వైరస్సా? అక్కడ గోల్డ్ మైన్ వెనకున్న కథేంటి? ప్రతాప్ పేరెంట్స్ ఎవరు? వారికి ఈ సంఘటనలకు సంబంధం ఏంటి?ఆ ప్రాంతం బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరికి ఈ మూవీ ద్వారా సింగీతం ఇచ్చిన సందేశమేంటి? చివర్లో వచ్చిన స్టార్ సర్‌ప్రైజ్ ఏంటనేది మిగిలిన కథ.
సింగ్ గీతం మూవీ విశ్లేషణ
సింగీతం శ్రీనివాసరావు అంటే ప్రయోగాలకు కేరాఫ్. సరికొత్త అనుభూతిని ఆడియెన్స్ కి అందించడమే ఆయన ప్రత్యేకత. ఇప్పుడు మరో సరికొత్త ట్రీట్‌ని అందించే లక్ష్యంతోనే `సింగ్ గీతం` సినిమాని రూపొందించారు. మాటలు పాటలుగా మారితే జనం పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రకృతిని, చెట్లని రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. మైనింగ్ పేరుతో చెట్లని కొట్టడం, ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల వచ్చే అనర్థాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు సింగీతం. దాన్ని సరదాగా, ఫన్నీగా, కొంత ఎమోషనల్‌గా, ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత నుంచే కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది. మనకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఏడారిలో ఒకే చెట్టు ఉండటం, దాన్ని అమ్మాయి రక్షించడం, గోల్డ్ మైనింగ్ కోసం ఆ చెట్టుని కొట్టేయడం, దీంతో ప్రజలకు మాటలు పోయి పాటలు రావడం, ఆ తర్వాత వరుసగా ఇబ్బందులు ఎదురు కావడం వంటివి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఊహించని విధంగా సాగుతుంటాయి. అయితే కథనం పరంగా సినిమా సాగే తీరు మాత్రం కొంత సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. పాటలుగా మాట్లాడే తీరు ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంది. ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. దీనికితోడు కథ కూడా ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతుంది, బాగా సాగదీసినట్టుగా ఉంటుంది. చాలా సీన్లు లాజిక్ లెస్‌గా ఉంటాయి.
ఇంటర్వెల్ సీన్ కొంత క్యూరియాసిటీ కలిగించడంతో సెకండాఫ్ ఆకట్టుకుంటుందేమో అనిపిస్తుంది. కానీ అది కూడా అలానే అనిపిస్తుంది. కాకపోతే కొత్త సమస్యలు రావడం, దీనికితోడు జనాల్లో బంగారం ఆశలు పెరగడం, వాళ్ల రియాలిటీ బయటకు రావడం కొంత ఆకట్టుకునే అంశంగా చెప్పొచ్చు. ఇందులోనే ప్రతాప్ పేరెంట్స్ ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది. అది రిలీఫ్ అంశంగా చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు జీవితాలను కూడా రిస్క్ లో పెట్టేందుకు, యూనిటీగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన తీరు, గర్భంతో ఉన్న మహిళని కాపాడుకోవడం కోసం ఊరు జనం చేసే త్యాగం ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సినిమాలో బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఇదొక్కటనే చెప్పొచ్చు. సినిమా కథగా కొత్తగా ఉంది, కానీ దాన్ని ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా, ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా, ఫన్నీగా తెరకెక్కించడంలో మాత్రం టీమ్ సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. చాలా సీన్లు లాజిక్ లెస్‌గా ఉన్నాయి. పాత్రలు, సెట్ కూడా ఆర్టిఫీషియల్‌గా ఉన్నాయి. సహజత్వం మిస్ అయ్యింది. అదో కొత్త లోకంలా ఉంది. రియాలిటీకి దూరంగా, కనెక్ట్ అయ్యేలా లేవు. ఈ సినిమా విషయంలో అభినందించే విషయం ఏంటంటే.. 95ఏళ్ల వయసులో సింగీతం చేసిన ప్రయత్నం. కొత్త ప్రయత్నానికి అభినందనలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి థాట్ మన ఇండియన్ సినిమాలో రాలేదని చెప్పొచ్చు.
సింగ్ గీతం మూవీ నటీనటులు
ప్రతాప్‌గా ఆయాన్ చాలా బాగా నటించాడు. పాత్రలో జీవించాడు. కొత్తనటీనటులైనా చాలా సహజంగా చేశారు. ప్రతాప్ పాత్ర గుర్తిండిపోతుంది. దాన్ని మించి గౌరీ పాత్రలో నటించిన అహల్య బమ్రూ పాత్ర ఉంటుందని చెప్పొచ్చు. ఆమె అంతే సహజంగా చేసింది. సినిమాకి హీరో తనే అనేలా ఉంటుంది. రేణు పాత్రలో శాలిని కూడా హుందాగా కనిపించి ఆకట్టుకుంది. చాలా బాగా నటించింది. ఆమె తండ్రి పాత్రలో బెనర్జీ బాగా చేశాడు. అతని పాత్ర బలంగా ఉంటుంది. మరోవైపు తులసికి మరో బలమైన పాత్ర దక్కింది. చివర్లో ఆమె పాత్ర కథని మలుపుతిప్పుతుంది. అనుదీప్ క్యామియో సర్‌ప్రైజ్ చేస్తుంది. విజయ్ దేవరకొండ క్లైమాక్స్ లో సర్‌ప్రైజ్ చేస్తాడు. నివేదా పేతురాజు కనిపించింది కాసేపే అయినా అదరగొట్టింది. రాహుల్ రవీంద్రన్ కూడా మెప్పించాడు. రచ్చ రవి పాత్ర కూడా ఫన్నీగా ఉంది. చిన్న పిల్లలు, ఇతర ఊరు పాత్రలు చేసిన వారంతా అంతే సహజంగా చేసి మెప్పించారు.
సింగ్ గీతం మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ప్లన్ అయ్యింది. పాటలు ఆకట్టుకున్నాయి. ఆర్‌ఆర్ కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంది. మాటలు పాటలుగా మార్చడం, దానికి దేవి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాకి అదొక హైలైట్‌గా చెప్పొచ్చు. సినిమా మొత్తం దేవి మ్యూజిక్ మీదనే సాగుతుందని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే పాట హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పరంగా షార్ప్ గానే ఉన్నా, ఇంకా కట్ చేయోచ్చు అనిపిస్తుంది. విజువల్ గా బాగుంది. కొత్త అనూభూతినిస్తుంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎంచుకున్న కథ అదిరిపోయింది. అయితే దాన్ని తీసుకెళ్లే సమయంలో ఆ ఆసక్తి మిస్ అయ్యింది. ఈ ఏజ్‌లో కూడా ఆయన దర్శకత్వం వహించడం గొప్ప విషయం. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసిన లెజెండ్ ఆయన. ఆడియెన్స్ కోణంలో, కమర్షియల్ యాంగిల్‌లో చూస్తే ఈ మూవీ ఆకట్టుకోకపోయినా, ఒక కొత్త కథని మనకు చూపించే విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. మంచి కథని చెప్పాలనుకున్న ఆయన థాట్‌కి సలామ్ కొట్టాలి.
సింగ్ గీతం మూవీ ఫైనల్ నోట్
సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో కొత్త ప్రయత్నం. ఆయనపై అభిమానంతో చూస్తే ఓకే, ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చూస్తే డిజప్పాయింట్ తప్పదు.

